బీజేపీ ఎమ్మెల్యే మనవడు కారుతో బీభత్సం | BJP MLA grandson Car Accident in Karnataka | Sakshi

కారుతో ఎమ్మెల్యే మనవడు బీభత్సం

Feb 25 2020 8:50 AM | Updated on Feb 25 2020 8:50 AM

BJP MLA grandson Car Accident in Karnataka - Sakshi

సాక్షి, బళ్లారి: దావణగెరె ఉత్తర అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఏ.రవీంద్రనాథ్‌ మనుమడి కారు దూసుకెళ్లడంతో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆ తర్వాత ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి దావణగెరె శివారులోని శామనూరులో చోటు చేసుకుంది. అరుణ్‌కుమార్‌ కారును వేగంగా నడుపుకుంటు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని వాటిల్లలేదు. కాగా ప్రమాదంపై ప్రశ్నించిన వారిపై అరుణ్‌కుమార్‌ దాడికి ప్రయత్నించారని చెబుతున్నారు.

స్థానికులు ఆగ్రహించడంతో కారును వదిలి అరుణ్‌కుమార్‌ పరారయ్యాడు. స్థానికులు అరుణ్‌కుమార్‌ ఇక్కడకు రావాల్సిందేనని కొద్దిసేపు పట్టుపట్టారు. కారును తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వేళ కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనపై విద్యానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement