
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి 1,047 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం జజీరా ఎయిర్‌లైన్స్ జె9–608 విమానంలో కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తితో పాటు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వారిని తనిఖీ చేశారు.
వ్యక్తి తన ప్యాంటు వెనుక భాగంలో దాచిన 4 బంగారు కడియాలు, మహిళ తన దుస్తుల లోపల దాచుకున్న 6 బంగారు కడియాలు బయటపడ్డాయి. సుమారు 1,047 గ్రాములు బరువు ఉన్న వీటి విలువ రూ.32,87,580 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వీరిద్దరు కలిసే బంగారం అక్రమ రవాణా చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment