అక్రమ సంబంధం అంటగట్టారు! | Case Registered On Victim Husband | Sakshi
Sakshi News home page

‘మానవ మృగం’పై స్పందించిన పోలీసులు  

Published Mon, Aug 27 2018 1:46 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

Case Registered On Victim Husband - Sakshi

బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుంటున్న రూరల్‌ ఎస్‌ఐ చిన్నంనాయుడు   

శ్రీకాకుళం రూరల్‌ : సాక్షిలో ప్రచురితమైన ‘భర్తే...మానవ మృగం’ కథానానికి జిల్లా యం త్రాంగం స్పందించింది. తల్లిదండ్రులు లేని బాధితురాలికి పరామర్శలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కనుగులవానిపేటకు చెందిన జాడ సుజాత ఇటీవల తన భర్త చేసిన అఘాయిత్యానికి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు తమ వంతు సాయం చేసేందుకు ఒక్కొక్కరూ ముందుకు వస్తున్నారు. సుజాత భర్త(నగేష్‌)పై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం రూరల్‌ ఎస్‌ఐ చిన్నంనాయుడు తన సిబ్బందితో కలిసి బాధితురాలిని ఆదివారం పరామర్శించారు.

తన భర్త నగేష్, అత్త సరోజిని, ఆడపడుచు మాలతీ చేసిన పైశాచిక పనులను సైతం ఆమె పోలీసులకు వివరించింది. ‘మైనర్‌గా(14 ఏళ్లు) ఉన్నప్పుడే వివాహం చేసుకోవడంతో నరకాన్ని చవిచూశా’నంటూ బోరున విలపించింది. తన భర్త రోజూ హింసిస్తుంటే చెప్పుకునేందుకు కనీసం తల్లిదండ్రుడు కూడా లేరని వాపోయింది. తమ్ముడు పేరిట తన తండ్రికి వచ్చిన ప్రమాద బీమా సొమ్మును బ్యాంకులో డిపాజిట్‌ చేసుకుంటే తన ఆడపడుచుకు టైలరింగ్‌ షాపు నిమిత్తం ఆ డబ్బులు ఎలాగైనా తీసుకు రావా లంటూ ఏదో ఒక పేరుతో నిత్యం వేధించేదని ఆవేదన వ్యక్తం చేసింది.

వేధింపులు.. వాతలే

తన భర్త నగేష్‌ ఆటో వేస్తూ వచ్చిన డబ్బులతో నిత్యం పూటుగా మద్యం సేవించేవాడని సుజాత తెలిపింది. ఇంటికి వచ్చే ముందు తన స్నేహితుడి సెల్‌తో ఇంటికి ఫోన్‌ చేసేవాడని పేర్కొంది. తీరా ఇంటికి వచ్చాక.. సెల్‌ఫోన్‌ తీసుకొని ఫలనా నంబర్‌ నుంచి ఎవరితో మాట్లాడావంటూ లేని పోని అక్రమ సంబంధం అంటగడుతూ ఇష్టానుసారంగా కొట్టడం, శరీరంపై ఎక్కడపడితే అక్కడు వాతలు పెట్టేవాడని వెలిబుచ్చింది.

మద్యం అమ్మాలంటూ ఒత్తిడి

ఇదిలా ఉండగా.. సుజాత అత్త సరోజిని బలివాడ జంక్షన్, ఇప్పిలి రోడ్‌కు వెళ్లే రహదారిలో ఓ ప్రభుత్వ స్థలంలో మద్యం విక్రయిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈమె అనాధికారికంగా మద్యం అ మ్ముతోందని సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేయగా.. పలు లిక్కర్‌ బాటిళ్లతో ఆమె పట్టుబడింది. అప్పట్లో సరోజినిపై ఎక్సైజ్‌ స్టేషన్‌లో కేసు కుడా నమోదు చేశారు. దీంతో కొన్ని రోజులుగా వ్యాపారం బంద్‌ చేసిన బాధితురాలి అత్త.. ఇక లాభం లేదంటూ గ్రామంలోనే అమ్మకాలు మొదలుపెట్టింది.

అక్కడితో ఆగకుండా తన కోడలైన సుజాతతో కుడా మద్యం అమ్మకాలు చేపట్టించింది. అత్త పెట్టిన ఒత్తిడి భరించలేక రెండు రోజులు మద్యం కుడా అమ్మినట్లు సుజాత వెల్లడించింది. తాగిన వారు సుజా తను చూసి అనరాని మాటలు అనడంతో, ఆ బాధ భరించలేక నేను మద్యం అమ్మలేనంటూ తేల్చి చెప్పింది. దీంతో తన భర్తకు లేనిపోనివి చెప్పి దగ్గరుండి కొట్టించేదని ఆమె పోలీసులకు వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement