
సాక్షి, హైదరాబాద్(యాకుత్‌పురా) : రెండున్నరేళ్ల బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఇన్స్‌పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన ఎం.ఏ.జబ్బర్(72) స్థానికంగా ఉన్న కైసర్ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్థానికంగా ఉండే రెండున్నరేళ్ల బాలికను హోటల్ వెనుకాల ఉన్న నిర్మాణ దశలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.
ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జబ్బర్‌కు భర్య, పిల్లలున్నారు. గత కోన్నేళ్లుగా అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఇంట్లో నుంచి బయటకు పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వృద్ధుడి కోసం పోలీసులు పలు బృందలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment