జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న జేఏసీ ప్రతినిధులు
హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. శుక్రవారం భీమవరంలో జరి గిన ఎన్నికల సభలో పవన్ మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్రా ప్రజలపై దాడు లు చేస్తున్నారని, తెలంగాణ ఏమైనా పాకిస్తానా అని రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగిన సమయంలో కూడా ఏ ఒక్కరిపైనా దాడు లకు పాల్పడలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ ఏర్పడ్డ అనంతరం కూడా ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టు కుని చూసుకుంటున్నామని, అన్నదమ్ములవలే ఎంతో సఖ్యతతో ఉన్నామని గుర్తుచేశారు. చంద్రబాబు సూచనలతో పవన్‌కల్యాణ్ ఓట్లకోసం రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏ ఆంధ్రావారి భూములు లాక్కున్నారో చెప్పా లని ప్రశ్నించారు. తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్న పవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్ రెడ్డి, సీ.హెచ్ ఉపేందర్, తూడి శ్రీధర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment