వివరాలు వెల్లడిస్తున్న సీఐ యుగంధర్
అనంతపురం సెంట్రల్: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్ ఆడుతున్న 14 మందిని అనంతపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4.21 లక్షల నగదు, మూడుసెల్‌ఫోన్లు, 150 గ్రాముల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. సోమవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలను సీఐ యుగంధర్ వెల్లడించారు. ఆదివారం ఐపీఎల్ ఫైనల్‌లో చైన్నె సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయయి. నగరంలోని సైఫుల్లా హిందూ శ్మశాన వాటిక సమీపంలో, హౌసింగ్‌బోర్డు కాలనీ శివారులోని క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేసినట్లు సీఐ తెలిపారు. నవోదయ కాలనీకి చెందిన ఉద్దల కిష్టప్ప, రాప్తాడు మండల కేంద్రానికి చెందిన చిరుతల శివయ్య, నగరంలో గౌసల్‌వరావీధికి చెందిన తపాలా సర్దార్ అనే క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశామన్నారు.
వీరితో పాటునగరంలో ఆముదాలవీధికి చెందిన పసుపులేటి సాయికుమార్, లక్ష్మీనగర్‌కు చెందిన అచల సల్మాన్‌ఖాన్, రహమత్‌నగర్‌కు చెందిన సాదిక్, అశోక్‌నగర్‌కు చెందిన మంజునాథ్, మారుతీనగర్‌కు చెందిన షేక్‌బాషా, రాజమ్మవీదికి చెందిన హాజీషఫీ, గుంతకల్లు చెందిన శ్రీనివాసులు, నగరంలో పాన్‌వాలీవీధికి చెందిన షాకీర్, వేణుగోపాల్‌కు చెందిన ఓంకార్, బళ్లారి రోడ్డుకు చెందిన సోమశేఖర్, భవానీనగర్‌కు చెందిన షేక్‌బాబాఫకృద్దీన్‌లను అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ. 4.21 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు, 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. క్రికెట్‌బుకీలు బెట్టింగ్‌తో పాటు గంజాయి కూడా విక్రయిస్తున్నట్లు తేలిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment