
అన్నానగర్: కోవైలో అదృశ్యమైన యువతి మేట్టుపాలయం కల్లారు సమీపంలో హత్యకు గురైంది. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. కోవై సాయిబాబాకాలనీ వేలాండిపాలయం కోవిల్‌మేడుకు చెందిన హైదర్ సెరీఫ్ కుమార్తె రుక్సానా(21). గత 16వ తేదీ అదృశ్యమైంది. కుటుంబసభ్యులు 19వ తేదీ సాయిబాబా కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో రుక్సానా ఫోన్ నుంచి చివరగా శరవణన్ పట్టికి చెందిన ప్రైవేట్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్‌తో (25) మాట్లాడినట్లు తెలిసింది.
పోలీసులు సోమవారం అతన్ని విచారించారు. రుక్సానాను గత 16వ తేదీ మేట్టుపాళయం, కల్లారు, భవానీ నదికి తీసుకెళ్లి అక్కడ జరిగిన ఘర్షణలో కిందకి తోసినపుడు తలకు రాయి తగిలి మృతి చెందిందని, మృతదేహాన్ని పూడ్చిపెట్టి తిరిగి ఇంటికి వచ్చినట్లు నేరం అంగీకరించాడు. ప్రశాంత్‌ని అరెస్టు చేసిన పోలీసులు, సోమవారం సాయంత్రం కల్లారు ప్రాంతానికి వెళ్లి రుక్సానా మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు పంపారు. రుక్సానా మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment