
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకుడులు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా మండల కేంద్రమైన ముసునూరుకి చెందిన రామదాసు(90), అచ్చమాంబ(80) దంపతులు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయోభారం వల్ల తమ పనులు తాము చేసుకోలేకపోయారు. కాగా వారి అలనా పాలనా చూసుకోవాల్సిన కుమారులు వారిని పట్టించుకోలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దంపతులను స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం ఆ వృద్ధ దంపతులు మృతి చెందారు. మృత దేహాలను పోస్ట్‌మార్టంకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment