సాక్షి, పశ్చిమగోదావరి : తమిళనాడుకు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను ఏలూరు రూరల్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు విల్లుపురంకు చెందిన కాలేజీ స్టూడెంట్స్ మునిస్వామి మహేంద్ర(24), పళనియప్ప ప్రభూ(24) విశాఖపట్టణం నుంచి తమిళనాడుకు కారులో గంజాయి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద రూరల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి సుమారు 130 కిలోగ్రాముల గంజాయితో పాటు ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment