
వెల్దుర్తి: ‘నా కూతురుకు 14 సంవత్సరాలు. నాకు చెప్పకుండా నా భార్య బాల్య వివాహం చేసింది’ అంటూ కలుగోట్ల గ్రామానికి చెందిన ఓ తండ్రి వెల్దుర్తి పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన మండలంలో వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండా భార్య బేతంచెర్ల మండలం పెద్దకొలుముల పల్లె గ్రామ యువకునితో తన కూతురుకు బాల్య వివాహం జరిపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజుల క్రితం పుల్లగుమ్మి బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో వివాహం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్పందించిన ఐసీడీఎస్ సూపర్ వైజర్ సరస్వతమ్మ, ఎస్‌ఐ–2 నగేశ్ గురువారం గ్రామాన్ని సందర్శించి బాలికతోపాటు తల్లి, పెళ్లి చేసుకున్న యువకుడిని, దళిత సంఘాల నాయకులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం బాలికను ఆరోగ్య కార్యకర్తల ద్వారా కర్నూలు ఐసీడీఎస్ కేంద్రానికి తరలించినట్లు సరస్వతమ్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment