
అల్లూరు: కుటుంబ కలహాలతో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తన మూడేళ్ల కుమార్తెకు విష గుళికలు పెట్టి, తానూ తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుమార్తె మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం మండలంలోని నార్తు ఆములూరు గిరిజన కాలనీలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. గిరిజన కాలనీకి చెందిన చిరంశెట్టి చంద్ర, సంజీవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్ర ఇటీవల ఇందుపూరులో పశువుల కాపరిగా చేరి అక్కడే ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ వివా దాలు జరుగుతున్నాయి. సోమవారం మరోసారి భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో కుమార్తె చందన (3)కు విషగుళికలు తినిపించి, తాను తిన్నాడు. గమనించిన ఇద్దరిని స్థానికులు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమార్తె మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment