daughter dead
-
ఇంటి బయట పోలీసులు ఇంట్లో మర్డర్
గ్వాలియర్(ఎంపీ): గొడవలు వద్దు, కూర్చుని మాట్లాడుకోండని సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులు ఇంటిబయట ఉండగానే కూతురిని కన్న తండ్రి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అమ్మాయి బంధువు సైతం కాల్పులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్‌లోని గోలా కా మందిర్ ప్రాంతంలో 45 ఏళ్ల మహేశ్ సింగ్ గుర్జార్‌కు 20 ఏళ్ల కూతురు ఉంది. జనవరి 18వ తేదీన ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే తనకిప్పుడు ఈ పెళ్లి ఇష్టంలేదని కుమార్తె చెప్పడంతో మహేశ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఎలాగైనా పెళ్లి జరగాల్సిందేనని మహేశ్ మేనల్లుడు రాహుల్ సైతం పట్టుబట్టి ఆమెను ఒప్పించే ప్రయత్నంచేశాడు. ముగ్గురి మధ్య వాగ్వాదం విషయం తెల్సి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వాళ్లు హుటాహుటిన పెళ్లింటికి వచ్చేశారు. పెళ్లి ఏర్పాట్లతో ఇళ్లంతా ముస్తాబు చేసిఉండటంతో లోపలికి వెళ్లకుండా మగ, ఆడ కానిస్టేబుల్స్ ఇంటి బయటే వేచి చూస్తున్నారు. ఎంతచెప్పినా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మహేశ్, రాహుల్ ఒక నాటు తుపాకీ, పిస్టల్‌తో అమ్మాయిని కాల్చి చంపారు. నాలుగు బుల్లెట్లను కాల్చారు. బుల్లెట్ల మోతతో హుతాశులైన స్థానికులు, పోలీసులు ఇంట్లోకి పరుగులుతీశారు. అప్పటికే రాహుల్ అక్కడి నుంచి తప్పించుకోగా తండ్రి అక్కడే ఉన్నాడు. రక్తమోడుతున్న అమ్మాయిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పారిపోయిన బంధువు రాహుల్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. -
ప్రియునితో భార్య పరార్.. కూతుళ్లను చంపిన తండ్రి
యశవంతపుర: భార్య మరొకరితో వెళ్లిపోవడంతో ఉన్మాదిగా మారిన భర్త ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్య చేశాడు. ఈ ఘటన కలబురిగిలో జరిగింది. వివరాలు... భోవి నగరకు చెందిన లక్ష్మికాంత్, అంజలి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మికాంత్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంజలి ఇటీవల ప్రియునితో కలిసి పరారైంది. దీంతో లక్ష్మికాంత్ నలుగురు పిల్లలను అవ్వ వద్ద ఉంచాడు. బుధవారం రాత్రి నలుగురు పిల్లలకు చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరిని ఆటోలో కుర్చోపెట్టి, మరో ఇద్దరు కూతుళ్లు సోని (11), మయూరి (10)లను పక్కకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపాడు. ఇద్దరి మృతదేహాలను ఆటోలో పెట్టుకొని నేరుగా ఎంబీ నగర పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం నగరంలో సంచలనం కలిగించింది. లక్ష్మీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. (చదవండి: టీచర్ వికృతానందం.. మహిళలకు అసభ్యకరంగా ఎస్సెమ్మెస్‌లు, వీడియోలు పంపి..) -
క్షణికావేశం.. విషాదం
అల్లూరు: కుటుంబ కలహాలతో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తన మూడేళ్ల కుమార్తెకు విష గుళికలు పెట్టి, తానూ తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుమార్తె మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం మండలంలోని నార్తు ఆములూరు గిరిజన కాలనీలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. గిరిజన కాలనీకి చెందిన చిరంశెట్టి చంద్ర, సంజీవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్ర ఇటీవల ఇందుపూరులో పశువుల కాపరిగా చేరి అక్కడే ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ వివా దాలు జరుగుతున్నాయి. సోమవారం మరోసారి భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో కుమార్తె చందన (3)కు విషగుళికలు తినిపించి, తాను తిన్నాడు. గమనించిన ఇద్దరిని స్థానికులు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమార్తె మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. -
పిడుగులాంటి వార్త.. అయినా తొణకలేదు
లక్నో : ఓ వైపు కుటుంబంలో తీవ్ర విషాదం. మరోవైపు ఓ ప్రాణం చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. రెండింటిలో ఏది ముఖ్యమంటే... తన వృత్తి ధర్మమే ముఖ్యమని ఆయన నిర్ణయించుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ షారన్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ భూపేంద్ర తోమర్(57) ఫిబ్రవరి 23న బడాగావ్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంతలో సర్సిరి గ్రామంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పొడిచారని.. రక్తపు మడుగులో అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైర్లెస్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఆయన తన వాహనాన్ని ఘటనా స్థలం వైపు తిప్పారు. ఆ సమయంలో ఆయనతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఇంతలో ఆయనకు మరో కాల్ వచ్చింది. ఆయన కూతురు జ్యోతి హఠాన్మరణం చెందిందని ఆ వార్త సారాంశం. ఓ వైద్య కేంద్రంలో సహయకురాలిగా పని చేసే కూతురికి ఏడాది క్రితమే ఆయన వైభవంగా వివాహం చేసి పంపించారు. అలాంటిది ఉన్నట్లుండి ఆమె చనిపోయిందన్న వార్తతో ఆయన ఉలిక్కిపడ్డారు. అయినా తన వాహనాన్ని వెనక్కి తిప్పకుండా.. వాహనాన్ని క్షతగాత్రుడి వైపునకు వెళ్లారు. ఆంబులెన్స్ ఆలస్యం కావటంతో తమ వాహనంలోనే తీసుకెళ్లి అతని ప్రాణాలను పోలీసులు కాపాడగలిగారు. ‘ నా కూతురి మరణ వార్త తెలిశాక నేను బాధపడటం తప్పించి చెయ్యగలిగింది ఏం లేదు. ఆ సమయంలో ఓ వ్యక్తి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. అందుకే అతన్ని కాపాడాలన్న నిర్ణయంతో ముందుకు వెళ్లా ’ అని భూపేంద్ర చెబుతున్నారు. పిడుగులాంటి వార్త తెలిశాక కూడా వృతి ధర్మంతో ఓ ప్రాణం కాపాడిన భూపేంద్రను పోలీస్ శాఖ ఘనంగా సన్మానించింది. భూపేంద్రను సన్మానిస్తున్న ఉన్నతాధికారులు -
కూతురుకు విషమిచ్చి..
విజయపురిసౌత్ (మాచర్ల) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి.. కూతురుకు పురుగుమందు తాగించడమేగాక తాను కూడా తాగిన ఘటన విజయపురిసౌత్‌లోని బ్రహ్మంగారి గుడి సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచర్ల మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన మాదాసు వెంకట్రావు అలుగురాజుపల్లి గ్రామానికి చెందిన పద్మను 9 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. గత 8 ఏళ్లుగా భార్య పద్మతో కలిసి వెంకట్రావు అలుగురాజుపల్లిలోనే ఉంటూ కూలి పనులు చేసుకొని జీవిస్తున్నాడు. మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకట్రావు సాయంత్రం అలుగురాజుపల్లి ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న కూతురు ధనలక్ష్మిని(8) విజయపురిసౌత్‌కు తీసుకొని వచ్చి బ్రహ్మంగారి గుడి సమీపంలో పురుగుమందు తాగించాడు. ఆ తర్వాత వెంకట్రావు కూడా పురుగుమందు తాగి భార్య పద్మకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇది గమనించిన గుడి సమీపంలో ఉన్న స్థానికులు వెంకట్రావు, ధనలక్ష్మిని హిల్ కాలనీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ధనలక్ష్మి మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. వెంకట్రావుకు ప్ర«థమ చికిత్స చేసిన అనంతరం బంధువులు గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకట్రావుకు ఇద్దరు కుమార్తెలు కాగా ధనలక్ష్మి పెద్ద కుమార్తె. భార్య పద్మ ఫిర్యాదు మేరకు విజయపురిసౌత్ పోలీసులు కేసు నమోదు చేయగా, మాచర్ల రూరల్ సీఐ దిలీప్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మొన్న తల్లి.. నిన్న కూతురు
కరీంనగర్‌రూరల్: ఈనెల 17న ఆటోలో కూలీ పనులకు వెళ్తుండగా.. కరీంనగర్ శివారు మల్కాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కరీంనగర్ మండలం చామన్‌పల్లికి చెందిన మేకల అనూష(20) హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు కుటుంబసభ్యుల తెలిపారు. ఆటోలో పత్తి ఏరేందుకు వెళ్తుండగా జరిగిన ఆ ప్రమాదంలో కూలీలు మేకల దేవమ్మ, లలిత, సాయిలీ ల, లావణ్య, కూనరాజుల ఓదెమ్మ, ఆటోడ్రైవర్ వెంకటమాధవరావు మృతిచెందిన విషయం తెల్సిందే. గాయపడిన పదిమందిని అపోలోరీచ్ ఆస్పత్రిలో చేర్పించారు. అనూష కాలు విరగడంతో ఆమెను ఈనెల 18న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మృతిచెందింది. ప్రమాద సమయంలో చనిపోయిన మేకల దేవమ్మ కూతురే ఈ అనూష. మొన్న తల్లి.. నిన్న కూతురు చనిపోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రూ.97వేలు చెల్లించాలని వైద్యుల డిమాండ్ ఆస్పత్రికి తరలించిన అనూషకు శస్త్రచికిత్స చేసేందుకు ఆమె తండ్రి లచ్చయ్య రూ.60వేల వరకు చెల్లించాడు. ఇంకా రూ.97వేలు చెల్లించాక మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది కరాఖండీగా చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన గురయ్యారు. ఇప్పటికే చనిపోయిన భార్య లలిత.. తాజాగా కూతురు అనూష మరణంతో లచ్చయ్య దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అనూష చనిపోయిన విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బుధవారం గ్రామానికి చేరుకున్నారు. కలెక్టర్, నిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. స్ధానిక టీఆర్ఎస్ నాయకులు స్పందించి ఎమ్మెల్యే గంగులకు వివరించారు. ఆయన మంత్రి రాజేందర్ దృష్టికి తీసుకెళ్లగా మంత్రి నిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వపరంగా బిల్లు చెల్లిస్తామని చెప్పారు. అనూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌కు తీసుకొచ్చారు. -
కూతురి మృతి తట్టుకోలేక..
గుండెపోటుతో తండ్రి దుర్మరణం కీసర: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బక్కని రాజనర్సింహ(48), పోచమ్మ దంపతులు స్థానికంగా కూలీపనులు చేస్తుంటారు. వీరికి కూతురు మహేశ్వరి(18), ఓ కుమారుడు ఉన్నారు. మహేశ్వరి పదో తరగతి పూర్తిచేసి ఇంటి వద్దే ఉండేది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేశ్వరి ఈనెల 14న మృతిచెందింది. మరుసటి రోజు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కంటికి రెప్పలా పెంచుకుంటున్న కూతురు మృతిచెందడంతో రాజనర్సింహ మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో ఆయన బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. కూతురు, తండ్రి మృతిచెందడంతో కుటుంబీకులు, బంధువులు రోదనలు మిన్నంటాయి.