కూతురి మృతి తట్టుకోలేక.. | father died with heart attack he's doughter die some health frobloms | Sakshi
Sakshi News home page

కూతురి మృతి తట్టుకోలేక..

Published Thu, Mar 17 2016 3:30 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

కూతురి మృతి తట్టుకోలేక.. - Sakshi

కూతురి మృతి తట్టుకోలేక..

 గుండెపోటుతో తండ్రి దుర్మరణం
కీసర: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అనారోగ్యంతో మృతిచెందడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన బక్కని రాజనర్సింహ(48), పోచమ్మ దంపతులు స్థానికంగా కూలీపనులు చేస్తుంటారు. వీరికి కూతురు మహేశ్వరి(18), ఓ కుమారుడు ఉన్నారు. మహేశ్వరి పదో తరగతి పూర్తిచేసి ఇంటి వద్దే ఉండేది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేశ్వరి ఈనెల 14న మృతిచెందింది. మరుసటి రోజు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కంటికి రెప్పలా పెంచుకుంటున్న కూతురు మృతిచెందడంతో రాజనర్సింహ మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో ఆయన బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. కూతురు, తండ్రి మృతిచెందడంతో కుటుంబీకులు, బంధువులు రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement