ఓ విదేశీ జంట.. కరెన్సీ కావాలంటూ! | Foreign Couple Stolen Foreign Currency Kurnool | Sakshi
Sakshi News home page

విదేశీ కరెన్సీ చోరీ

Published Sun, Jun 16 2019 10:32 AM | Last Updated on Sun, Jun 16 2019 10:33 AM

Foreign Couple Stolen Foreign Currency Kurnool - Sakshi

సీసీ పుటేజీలో విదేశీ జంట

సాక్షి, కర్నూలు : కరెన్సీ మార్పిడి కోసం వచ్చామంటూ మాటలతో బురిడీ కొట్టించి ఓ విదేశీ జంట పలు దేశాల విదేశీ కరెన్సీని చోరీ చేసి ఉడాయించింది. పోలీసుల కథనం మేరకు..  కర్నూలు స్కంద బిజినెస్‌ పార్క్‌లో ఉన్న ఫారిన్‌ ఎక్సేంజ్‌ కార్యాలయానికి ఈ నెల 13వ తేదీన న్యూజిలాండ్‌కు చెందిన వారమని ఓ విదేశీ జంట వచ్చింది. తమ వద్ద ఉన్న కరెన్సీ  మార్చి ఇవ్వాలని క్యాషియర్‌ను మాటల్లోకి దింపింది.

అతన్ని ఏమార్చి రూ.1.40 లక్షల విలువైన పలు విదేశీ కరెన్సీని తస్కరించి ఉడాయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే జంట ఈ నెల 10వ తేదీన కొచ్చిన్, 11న మైసూర్‌లో విదేశీ కరెన్సీ చోరీ చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని  సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement