
గజ తుపాను ధాటికి విరిగిపోయిన చెట్లు
చెన్నై: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా గజతుపాను ధాటికి 45 మంది ఇప్పటివరకు మృతిచెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అనధికారింగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. తుపాను కారణంగా 1.70 లక్షల చెట్లు నేలకూలినట్లుగా అంచనా వేశారు. అలాగే 347 ట్రాన్స్‌ఫార్మర్లు, 39,938 స్తంభాలు ధ్వంసమయ్యాయి. 4730 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో 2.49 లక్షల మందికి ప్రభుత్వం పునరావసం కల్పించింది.
తుపాను ధాటికి తిరువారూర్ జిల్లా పూర్తిగా అతలాకుతలం అయింది. తిరువారూర్, నాగపట్నం జిల్లాల్లో వరద ప్రాంతాలను సందర్శించి, బాధితులను ప్రతిపక్ష నేత స్టాలిన్ పరామర్శించారు. ఆస్తినష్టం అంచనాపై ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలను రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment