హత్యకు గురైన ఐదేళ్ల బాలిక అంజలి సరోజ్
ముంబాయి: పెళ్లికి అడ్డుగా ఉందని ఓ మహిళ, ఐదేళ్ల బాలికను ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేసింది. ఈ సంఘటన ముంబాయిలోని నాలాసోపారాలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా నివాసం ఉంటున్న సంతోష్ సరోజ్ అనే వ్యక్తికి ఐదేళ్ల కుమార్తె ఉంది. అయితే కొంతకాలం క్రితమే సంతోష్ తన భార్యకు విడాలిచ్చాడు. దీంతో అనితా భాఘేలా(25) అనే మహిళతో కొంతకాలంగా సంతోష్ సహజీవనం సాగిస్తున్నాడు.
పెళ్లి చేసుకోవాలని పలుమార్లు అంజలి, సంతోష్‌ను అడిగింది. దానికి సంతోష్ సున్నితంగా తిరస్కరించాడు. కుమార్తె ఉండటం వల్లే పెళ్లికి నిరాకరిస్తున్నాడని భావించి బాలికను చంపేద్దామని పథకం రచించింది. అందులో భాగంగా ఈ నెల 24న బాలికకు చాక్లెట్లు చూయించి కిడ్నాప్ చేసింది. కూతురు కనపడకపోవడంతో తండ్రి సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు సీసీటీవీ ఫుటేజీ ద్వారా మంచి ఆధారం లభించింది. ఓ మహిళ, బాలికకు చాక్లెట్లు ఇవ్వడం కెమెరాలో రికార్డు అయింది..అలాగే నాలాస్‌పోరా రైల్వే స్టేషన్‌లో బాలికతో ఆ మహిళే రైలు ఎక్కడం కూడా రికార్డు అవడంతో పోలీసులకు మంచి ఆధారం లభించింది.
ఈ ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలిని పట్టుకోగలిగారు..కానీ చిన్నారి అంజలి సరోజ్ ప్రాణాలు కాపాడలేకపోయారు. మూడు రోజుల తర్వాత గుజరాత్‌లోని నావ్సారి జిల్లాలోని ఓ టాయిలెట్‌లో బాలిక శవమై కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. సంతోష్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఆయనను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తనకు అంజలి అనే మహిళ తెలియదని సంతోష్ చెప్పడం గమనర్హం.
Comments
Please login to add a commentAdd a comment