స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు
పహడీషరీఫ్: గుట్టు చప్పుడు కాకుండా గుట్కాను తయారు చేస్తున్న వ్యక్తిని బాలాపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి, అతడి నుంచి రూ.30 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుల్తాన్‌పుర్ ప్రాంతంలో హుస్సేన్ అనే వ్యక్తి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బ్లూబుల్ కంపెనీ పేరుతో గుట్కా తయారు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో బాలాపూర్ ఇన్స్‌పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి తయారీ మిషన్లతో పాటు భారీగా గుట్కా ముడి సరుకుని స్వాధీనం చేసుకున్నారు.
నేరేడ్‌మెట్‌లో..
భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటన నేరేడ్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. నేరేడ్‌మెట్ సీఐ నర్సింహ్మస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..స్థానిక వినాయకనగర్‌లో శ్రీవాసవి కిరాణ దుకాణానికి చెందిన గోదాంలో గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గోదాంలో నిల్వ చేసిన వివిధ కంపెనీల గుట్కా, పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గోలి నిరంజన్‌ను అదుపులోకి తీసుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment