మూడుముళ్లు వేసిన చేతులే ప్రాణాలు తీశాయి | Husband Killed Wife In Karnataka | Sakshi
Sakshi News home page

మూడుముళ్లు వేసిన చేతులే ప్రాణాలు తీశాయి

Published Fri, May 4 2018 9:04 AM | Last Updated on Fri, May 4 2018 9:18 AM

Husband Killed Wife In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక, బనశంకరి: ఎన్నో ఆశలతో అత్తారింటికి అడుగు పెట్టిన నవ వధువు భర్త చేతిలో హతమైంది. మూడుముళ్లు వేసి అర్ధాంగిగా స్వీకరించిన భర్త అనుమానంతో ఆమెను గొంతు నులిమి పాడె ఎక్కించాడు. ఈ ఘటన  జేసీ నగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... మునిరెడ్డిపాళ్యలోని మారప్పగార్డెన్‌కు చెందిన సయ్యద్‌ తబ్రేజ్‌కు నెల రోజుల క్రితం నగరానికి చెందిన సబీనాబాను(24) అనే యువతితో వివాహమైంది. తబ్రేజ్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. అయితే సబీనాబానుకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకుని భార్యతో  గొడవపడేవాడు.

బుధవారం రాత్రి కూడా ఇదే విషయంపై భార్యతో గొడవపడి చున్నీతో గొంతుబిగించి హత్య చేసి పారిపోయాడు. సబినాబాకు తల్లిదండ్రులు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో గురువారం ఉదయం ఇంటి వద్దకు చేరుకుని చూడగా హత్యోదంతం వెలుగు చూసింది. పోలీసులకు సమాచారం అందించేలోగా సయ్యద్‌ తబ్రేజ్‌ జేసీ నగర పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. భార్య ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడని ఉత్తర విభాగం డీసీపీ చేతన్‌సింగ్‌ రాథోడ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement