కాలిన గాయాలతో మృతిచెందిన రజిత
సాక్షి, వరంగల్ : జిల్లాలోని పర్వతగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. భర్త అక్రమ సంబంధం విషయం తెలిసి.. భార్య నిలదీసినందుకు ఆమెను చెట్టుకు కట్టేసి నిప్పంటించాడు భర్త. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుతండాకు చెందిన రజిత అనే మహిళ తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి నిలదీసింది. దీంతో ఆగ్రహించిన రజిత భర్త ఆమెను చెట్టుకు కట్టేసి నిప్పంటించాడు. మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment