అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు | Interstate Thieves Gang Arrested Hyderabad | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

Published Thu, Mar 14 2019 1:59 AM | Last Updated on Thu, Mar 14 2019 1:59 AM

Interstate Thieves Gang Arrested Hyderabad - Sakshi

నిందితులు, డ్రగ్స్‌ను పరిశీలిస్తున్న మహేష్‌భగవత్

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని లక్ష్యంగా నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. సుమారు కోటి రూపాయల విలువ చేసే రూ.1.5కిలోల హెరాయిన్, కోకైన్‌తోపాటు డైట్యూట్‌ కెమికల్‌ పౌడర్‌ను మల్కాజిగిరి, సరూర్‌నగర్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నా రు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుమంది ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ కేసుల సూత్రధారి నెల్లూరుకు చెందిన అమ్జద్‌ పరారీలో ఉన్నారు. హైదరాబాద్‌కు నిషేధిత మాదకద్రవ్యాల రవాణాలో అసలు సూత్రధారులు ఎవరనేది, ఎక్కడి నుంచి వ్యవహారాలు నిర్వహిస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నట్టు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ స్పష్టం చేశారు. నేరేడ్‌మెట్‌లో కొత్తగా నిర్మిం చిన తన కార్యాలయంలో బుధవారం తొలిసారిగా సీపీ విలేకరుల సమావేశం నిర్వహించి, డ్రగ్స్‌ రాకెట్‌ కేసు వివరాలు వెల్లడించారు.

సూరిబాబు నుంచి డ్రగ్స్‌ 
ఏపీలోని నెల్లూరు జిల్లా రంగనాయకులపేటకు చెందిన బీడి కార్మికుడు షేక్‌ ఆబిద్‌ (48)కు కొన్ని నెలల క్రితం నెల్లూరు నివాసి డ్రగ్స్‌ రవాణ వ్యాపారి అమ్జద్‌తో పరిచయం ఏర్పడింది. సూరిబాబు అనే పోలీసు అధికారి తనకు బాగా తెలుçసని అతని వద్ద కోట్ల విలువ చేసే నిషేధిత మాద్రక ద్రవ్యాలు ఉన్నాయని ఆబిద్‌కు అమ్జద్‌ వివరించాడు. సూరిబాబు నుంచి డ్రగ్స్‌ తీసుకొని బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తే లక్షలు సంపాదించొచ్చని అమ్జద్‌ చెప్పడంతో ఆబిద్‌ అంగీకరించాడు. ఇద్దరు కలిసి సూరిబాబు నుంచి కిలోన్నర హెరాయిన్, కోకైన్, డైల్యూట్‌ కెమికల్‌ పౌడర్‌ను తీసుకువచ్చి, నెల్లూరులోని ఆబిద్‌ ఇంట్లో నిల్వ చేశారు. అనంతరం ఎక్కువ మొత్తానికి డ్రగ్స్‌ కొనుగోలుదారుల కోసం ఆబిద్‌ వెతకటం ప్రారంభించాడు.

కృష్ణపట్నం టు హైదరాబాద్‌ 
2008 సంవత్సరంలో కృష్ణపట్నం పోర్ట్‌లో గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుతో జైలుకెళ్లొచ్చిన బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన డ్రైవర్‌ ముసునూర్‌ ఓంకార్‌ (27), అతని మిత్రుడు కందికంటి రాజశేఖర్‌ (27)లను కలిసి తన వద్ద ఉన్న కోకైన్, హెరాయిన్‌ గురించి ఆబిద్‌ వివరించాడు. కొనుగోలుదారులను తెస్తే ఇందులో వాటా ఇస్తానని వారికి చెప్పాడు. వీరిద్దరు విశాఖపట్నంకు చెందిన డ్రైవర్‌ పెద్దిరెడ్ల కనకరాజు (34) అలియాస్‌ రాజుకు డ్రగ్స్‌ విక్రయం గురించి వివరించారు. రాజు ద్వారా వరంగల్‌కు చెందిన పూజారి చక్రధరాచార్యులు (48)కు ఈ విషయం తెలిసింది. చక్రధర్‌ రంగంలోకి దిగి.. రూ.35లక్షలకు డీల్‌ కుదిర్చాడు. మొదట ఇంత తక్కువ మొత్తానికి ఆబిద్‌ ఒప్పుకోనప్పటికీ.. తర్వాత అంగీకరించి తన వద్ద ఉన్న డ్రగ్స్‌ ప్యాకెట్‌లను ఓంకార్, రాజశేఖర్, రాజులకు ఇచ్చాడు. వీరు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వీటిని తరలించేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. 

పట్టుబడ్డారిలా! 
ఈనెల 9వ తేదీ రాత్రి పోలీసులు కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో పోలీసులు వాహన తనీఖీలు నిర్వహిస్తున్నారు. నాకాబందీని గమనించిన ఓంకార్, రాజశేఖర్‌లు కారు (ఏపీ 31టీవీ 6815 – స్విఫ్ట్‌ డిజైర్‌) దిగి పారిపోగా.. రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 15 గ్రాముల కోకైన్, హెరాయిన్, 3.30గ్రాముల కెమికల్‌ పౌడర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. పరారీ లో ఉన్న ఓంకార్, రాజశేఖర్, చక్రధర్, ఆబిద్‌లను సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి 1.440 కేజీల మాదకద్రవ్యాలు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసు కున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసు విచారణలో పాల్గొన్న అధికారులకు ఆయన నగ దు రివార్డులను అందజేశారు. ఈ సమావే శంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్‌ఓటీ అడిష నల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి, ఏసీపీ పృథీందర్‌రావు, సీఐ నాగేశ్వర్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు అవినాష్, మల్కాజిగిరి, సరూర్‌నగర్‌ ఎస్‌టీఓ పోలీసులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement