drags
-
విమానంలో వికలాంగుడి పట్ల అమానుషం: కన్నీటి పర్యంతమైన జంట
న్యూఢిల్లీ: వికాలాంగుడన్న కనీస కనికరం లేకుండా విమానంలో దారుణంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. తమకు జరిగిన అవమానాన్ని తడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న వివాహ వార్షికోత్సవ వేడుకల్లో తీరని మానసిక వేదనకు గురయ్యమాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో చివరకు ఎయిర్ కెనడా క్షమాపణ చెప్పింది. బ్రిటిష్ కొలంబియాకు చెందిన హార్డ్‌వేర్ సేల్స్‌మ్యాన్ రోడ్నీ హాడ్జిన్స్ స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. వీల్ చెయిర్ లేనిదే కదలలేని స్థితి. అయితే ఆగస్టులో వివాహ వార్షికోత్సవ వేడుకుల కోసం ఎయిర్ కెనడాలో భార్య డీనాతో కలిసి లాస్ వెగాస్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా విమానం ల్యాండ్ అయినప్పుడు మోటరైజ్డ్ వీల్‌చైర్ కావాలని అడిగాడు. అయితే విమానం మళ్లీ టేకాఫ్‌కు సిద్ధం కావడానికి ముందు వీల్‌చైర్‌ను ఎక్కించుకోవడానికి సమయం లేదని ఫ్లైట్ అటెండెంట్ దంపతులకు ఖరాఖండీగా చెప్పేశారు. పైగా దిగాలంటూ తొందరపెట్టారు. దీంతో రోడ్నీ భార్య అతడిని బలవంతంగా రెండు కాళ్లు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రోడ్నీ హాడ్జిన్స్ దంపతులు(ఫైల్ ఫోటో) ఈ విషయాన్ని డీన్నా హాడ్జిన్స్ ఇటీవలి ఫేస్బుక్ పోస్ట్ చేశారు. అందరూ చూస్తూ ఉండగానే దాదాపు 12 లైన్లకు వరకూ భర్త వీపుమీద జరుగుతూ ఉంటే, తాను రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటా వెళ్లాల్సి వచ్చిందని, దీంతో అతనికి వీపుపైన, కాళ్లకు గాయాలని చెప్పుకొచ్చారు. తనకూ వెన్నులో నొప్పి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో శారీరక బాధలతో పోలిస్తే.. తన భర్త హక్కులకు భంగం కలగడమే కాకుండా, తమకు తీరని మానసిక వ్యధను మిగిల్చిందంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఎనిమిదినెలలకు ప్లాన్ చేస్తున్న టూర్ అవమానకరంగా సాగిందని పేర్కొన్నారు. ఈ అమానుష ఘటనపై సోషల్ మీడియాలోఆగ్రహం వ్యక్త మైంది. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్ కెనడా వారు హాడ్గిన్స్ దంపతులు క్షమాపణలు చెప్పి, తగిన నష్టపరిహారాన్ని కూడా అందించారు. పరిహారంతో సరా...?: రోడ్నీ హాడ్జిన్స్ పరిహారంతో సమస్య పరిష్కారం కాదంటూ వికలాంగ ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థ వ్యవహరించిన తీరుపై రోడ్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనేదే తన తాపత్రయమని చెప్పారు. -
వివాదంలో రిలయన్స్ - ఫ్యూచర్స్ డీల్
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఫ్యూచర్ గ్రూప్ అసెట్ల విక్రయ అంశం వివాదానికి దారి తీసింది. ఫ్యూచర్ గ్రూప్ తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఈ డీల్ విరుద్ధమైనదంటూ అమెరికన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సియాక్)ను ఆశ్రయించింది. నిబంధనల ఉల్లంఘనకు గాను ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌కు లీగల్ నోటీసులు పంపింది. ‘కాంట్రాక్టు ప్రకారం మా హక్కులు కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున వివరాలను వెల్లడించలేం’ అని అమెజాన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి అసెట్స్ విక్రయానికి సంబంధించి ఇతర వ్యాపార సంస్థలతో పాటు అమెజాన్‌కు కూడా ఫ్యూచర్ గ్రూప్ ఆఫర్ ఇచ్చిందని, అది తిరస్కరించిన తర్వాతే రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నాయి. పైగా ఎఫ్‌డీఐ నిబంధనలు, ఫ్యూచర్ గ్రూప్‌లో తదుపరి పెట్టుబడులు పెట్టే హక్కులు మూడేళ్ల తర్వాతే అమెజాన్‌కు దఖలు పడనుండటం కూడా ఫ్యూచర్ సంస్థల్లో ఆ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రతిబంధకాలని వివరించాయి. వివరాల్లోకి వెడితే.. అమెజాన్ డాట్‌కామ్ గతేడాది ఆగస్టులో ఫ్యూచర్స్ కూపన్స్‌లో 49 శాతం వాటాలను ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసింది. అప్పట్లో ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం వాటాలు ఉండేవి. ఒప్పంద నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్ల లోపున ప్రమోటర్‌కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌కు అధికారాలు లభిస్తాయి. మరోవైపు, తన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాలను రిలయన్స్‌కి విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఈ ఏడాది ఆగస్టులో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే రూ. 37,700 కోట్ల పెట్టుబడులు సమీకరించి దూసుకెడుతున్న తరుణంలో ఫ్యూచర్-అమెజాన్ మధ్య వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది. -
టీచర్‌ను తాళ్లతో కట్టి.. రోడ్డుపై ఈడ్చి..
బలుర్ఘాట్: రోడ్డు వేసేందుకు స్థలం ఇవ్వడం లేదన్న కారణంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని కాళ్లు, చేతులు కట్టేసి, రోడ్డుపై ఈడ్చిన దారుణ దుర్ఘటన పశ్చిమబెంగాల్లోని దీనజ్‌పూర్‌లో జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టడంతో రాజకీయ సెగ అలుముకుంది. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాంపూర్ బ్లాక్‌కు చెందిన ప్రభుత్వ టీచర్, బీజేపీ మద్దతుదారు స్మృతికానా దాస్ స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టేలా పంచాయతీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఆమె అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఉప ప్రధాన్ (డిప్యూటీ చీఫ్) అమల్ సర్కార్.. స్మృతికానా దాస్ కుటుంబాన్ని హింసించారు. టీచర్ కాళ్లను, చేతులను కట్టేయడంతో ఆమె కిందపడిపోవడం, ఆమెను కొందరు దుండగులు దాదాపు 30 అడుగులు ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకెళ్లి బంధించడం వీడియోలో రికార్డయ్యింది. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో గూండాయిజం సాగుతున్నదనడానికి ఇది ఉదాహరణ అంటూ విమర్శించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ చెప్పారు. -
భారతీ ఇన్ఫ్రాటెల్కు విలీనం సెగ
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో రూ.608 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.606 కోట్ల నికర లాభం ఆర్జించామని భారతీ ఇన్ఫ్రాటెల్ తెలిపింది. ఆదాయం రూ.3,662 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.3,600 కోట్లకు చేరిందని భారతీ ఇన్ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం ఫ్లాట్‌గా రూ.2,494 కోట్లుగా నమోదైందని వివరించారు. ఆదా యం మాత్రం రూ. 14,490 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.14,582 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.7.50 రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. విలీన ప్రభావం.... టెలికం రంగంలో ఏకీకరణ కారణంగా మొబైల్ టవర్ల అద్దెలు తగ్గడంతో నికర లాభంలో ఎలాంటి వృద్ధి లేదని అఖిల్ గుప్తా తెలిపారు. వొడాఫోన్–ఐడియా కంపెనీల విలీనం కారణంగా మొత్తం మీద 75,000 కో–లొకేషన్లను కోల్పోయామని పేర్కొన్నారు. అందుకని గత ఆర్థిక సంవత్సరం క్యూ4ల్లో ఆర్థికంగా కంపెనీ పనితీరు అంతంతమాత్రంగానే ఉందని వివరించారు. భవిష్యత్తు బాగు.... డేటాకు డిమాండ్ జోరుగా పెరుగుతోందని, భారీ స్థాయిలో నెట్వర్క్ విస్తరణ జరుగుతోందని, ఫలితంగా తమ కంపెనీకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండనున్నదని అఖిల్ గుప్తా అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇండస్ టవర్స్‌తో తమ కంపెనీ విలీన ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని, మరికొన్ని నెలల్లో విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్ 3 శాతం లాభంతో రూ.302 వద్ద ముగిసింది. -
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని లక్ష్యంగా నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. సుమారు కోటి రూపాయల విలువ చేసే రూ.1.5కిలోల హెరాయిన్, కోకైన్‌తోపాటు డైట్యూట్ కెమికల్ పౌడర్‌ను మల్కాజిగిరి, సరూర్‌నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నా రు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుమంది ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ కేసుల సూత్రధారి నెల్లూరుకు చెందిన అమ్జద్ పరారీలో ఉన్నారు. హైదరాబాద్‌కు నిషేధిత మాదకద్రవ్యాల రవాణాలో అసలు సూత్రధారులు ఎవరనేది, ఎక్కడి నుంచి వ్యవహారాలు నిర్వహిస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. నేరేడ్మెట్లో కొత్తగా నిర్మిం చిన తన కార్యాలయంలో బుధవారం తొలిసారిగా సీపీ విలేకరుల సమావేశం నిర్వహించి, డ్రగ్స్ రాకెట్ కేసు వివరాలు వెల్లడించారు. సూరిబాబు నుంచి డ్రగ్స్ ఏపీలోని నెల్లూరు జిల్లా రంగనాయకులపేటకు చెందిన బీడి కార్మికుడు షేక్ ఆబిద్ (48)కు కొన్ని నెలల క్రితం నెల్లూరు నివాసి డ్రగ్స్ రవాణ వ్యాపారి అమ్జద్‌తో పరిచయం ఏర్పడింది. సూరిబాబు అనే పోలీసు అధికారి తనకు బాగా తెలుçసని అతని వద్ద కోట్ల విలువ చేసే నిషేధిత మాద్రక ద్రవ్యాలు ఉన్నాయని ఆబిద్‌కు అమ్జద్ వివరించాడు. సూరిబాబు నుంచి డ్రగ్స్ తీసుకొని బ్లాక్మార్కెట్లో విక్రయిస్తే లక్షలు సంపాదించొచ్చని అమ్జద్ చెప్పడంతో ఆబిద్ అంగీకరించాడు. ఇద్దరు కలిసి సూరిబాబు నుంచి కిలోన్నర హెరాయిన్, కోకైన్, డైల్యూట్ కెమికల్ పౌడర్‌ను తీసుకువచ్చి, నెల్లూరులోని ఆబిద్ ఇంట్లో నిల్వ చేశారు. అనంతరం ఎక్కువ మొత్తానికి డ్రగ్స్ కొనుగోలుదారుల కోసం ఆబిద్ వెతకటం ప్రారంభించాడు. కృష్ణపట్నం టు హైదరాబాద్ 2008 సంవత్సరంలో కృష్ణపట్నం పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో జైలుకెళ్లొచ్చిన బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన డ్రైవర్ ముసునూర్ ఓంకార్ (27), అతని మిత్రుడు కందికంటి రాజశేఖర్ (27)లను కలిసి తన వద్ద ఉన్న కోకైన్, హెరాయిన్ గురించి ఆబిద్ వివరించాడు. కొనుగోలుదారులను తెస్తే ఇందులో వాటా ఇస్తానని వారికి చెప్పాడు. వీరిద్దరు విశాఖపట్నంకు చెందిన డ్రైవర్ పెద్దిరెడ్ల కనకరాజు (34) అలియాస్ రాజుకు డ్రగ్స్ విక్రయం గురించి వివరించారు. రాజు ద్వారా వరంగల్‌కు చెందిన పూజారి చక్రధరాచార్యులు (48)కు ఈ విషయం తెలిసింది. చక్రధర్ రంగంలోకి దిగి.. రూ.35లక్షలకు డీల్ కుదిర్చాడు. మొదట ఇంత తక్కువ మొత్తానికి ఆబిద్ ఒప్పుకోనప్పటికీ.. తర్వాత అంగీకరించి తన వద్ద ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను ఓంకార్, రాజశేఖర్, రాజులకు ఇచ్చాడు. వీరు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వీటిని తరలించేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. పట్టుబడ్డారిలా! ఈనెల 9వ తేదీ రాత్రి పోలీసులు కర్మన్‌ఘాట్ ప్రాంతంలో పోలీసులు వాహన తనీఖీలు నిర్వహిస్తున్నారు. నాకాబందీని గమనించిన ఓంకార్, రాజశేఖర్‌లు కారు (ఏపీ 31టీవీ 6815 – స్విఫ్ట్ డిజైర్) దిగి పారిపోగా.. రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 15 గ్రాముల కోకైన్, హెరాయిన్, 3.30గ్రాముల కెమికల్ పౌడర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. పరారీ లో ఉన్న ఓంకార్, రాజశేఖర్, చక్రధర్, ఆబిద్‌లను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి 1.440 కేజీల మాదకద్రవ్యాలు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసు కున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసు విచారణలో పాల్గొన్న అధికారులకు ఆయన నగ దు రివార్డులను అందజేశారు. ఈ సమావే శంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్ఓటీ అడిష నల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, ఏసీపీ పృథీందర్‌రావు, సీఐ నాగేశ్వర్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐలు అవినాష్, మల్కాజిగిరి, సరూర్‌నగర్ ఎస్టీఓ పోలీసులు పాల్గొన్నారు. -
కారు బానెట్‌పై ట్రాఫిక్ పోలీసు వేలాడుతున్నా..
గురుగ్రామ్: కారును అడ్డుకోవడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసుపైకి వాహనాన్ని ఎక్కించేందుకు కూడా వెనకాడలేదు ఓ వ్యక్తి. ఈ ఘటన బుధవారం గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌లోని సిగ్నేచర్ టవర్ చౌక్ వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న కారును ఓ ట్రాఫిక్ పోలీస్ అడ్డుకున్నారు. కారులో ఉన్న వ్యక్తి మాత్రం వాహనాన్ని రివర్స్ తీసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. తన వద్దకు పోలీసు రాగానే కారును వెనక్కి తీస్తున్నట్టుగా చేసి ముందుకు పోనిచ్చాడు. అది ఆపడానికి యత్నించిన ట్రాఫిక్ పోలీసు కారు ముందు భాగాన్ని పట్టుకున్నాడు. కానీ ఆ వ్యక్తి ఇదేమీ పట్టించుకోకుండా.. వేలాడుతున్న పోలీసును లాక్కుంటూ కారును కొద్ది దూరం ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. ఈ ఘటనను అక్కడున్న ప్రత్యక్షసాక్షులు చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది. #WATCH: Man stopped by traffic police for driving on the wrong side near Signature Tower Chowk in Gurugram, dragged traffic personnel on the bonnet of his car when the personnel tried to stop him. He was later arrested & the car was also seized. #Haryana (19.12.18) pic.twitter.com/BbyN79ysIW — ANI (@ANI) 20 December 2018 -
ఫ్లిప్‌కార్ట్‌ను కోర్టుకీడ్చిన ఆమ్వే
సాక్షి, ముంబై: అమెరికా ఆన్లైన్ దిగ్గజం వాల్‌మార్ట్ డీల్ తరువాత దేశీయంగా దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్‌కు మరో దిగ్గజం ఆమ్వే షాక్ ఇచ్చింది. భారతీయ ఇ-కామర్స్ నిబంధనలకు ఇరుద్ధంగా ఫ్లిప్‌కార్ట్ తమ ఉత్పత్తులను అనధికారికంగా విక్రయిస్తోందని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సంస్థ ఆమ్వే ఆరోపిస్తోంది. తద్వారా 2016 లో కేంద్రం జారీ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించిందని వాదించింది. ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'అనధికార' అమ్మకాలు జరుపుతోందని ఆరోపించింది. ముందస్తు అనుమతి లేకుండా అక్రమంగా తమ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తోందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ ఉత్పత్తుల లిస్టింకు ముందు కంపెనీల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న భారతదేశ మార్గదర్శకాలను ఫ్లిప్‌కార్ట్ ఉల్లంఘిస్తోందని ఆమ్వే పేర్కొంది. అంతేకాదు తమ ఉత్పత్తుల మూతలపై ముద్రించిన యూనీకోడ్, సిల్వర్ ఫోయిల్ సీల్స్‌ను టాంపర్ చేసి మరీ అక్రమ విక్రయాలకు పాల్పడుతోందని ఆమ్వే విమర్శించింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపింది. డైరెక్ట్ విక్రయదారుల ప్రయోజనాలు, జీవనోపాధిని కాపాడటం, వ్యాపార ప్రాథమిక పునాదిని కాపాడుకోవడంతోపాటు వినియోగదారుల భద్రతను కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఆమ్వే కోరింది. గతంలో ఇదే వ్యవహారంలో స్నాప్‌డీల్, ఆన్లైన్ ఫార్మా సంస్థ 1ఎంజీ.కామ్‌పై కేసులు నమోదు చేసింది. ఈ మేరకు రెండు సంస్థలు ఆమ్వే ఉత్పత్తులను తొలగించాయి. మరి తాజా పరిణామంపై ఫ్లిప్‌కార్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
అర కిలోమీటర్ ఎత్తులో ఈడ్చుకుంటూ..
బీజింగ్ : గాజు వంతెలనకు పెట్టింది పేరు చైనా. సాధారణ వంతెనల నిర్మాణం కంటే ఇప్పుడక్కడ ఎత్తయిన కొండ ప్రాంతాల్లో కొండ చివరన గాజువంతెనల నిర్మాణమే అధికం. ఎందుకంటే ఇవి విపరీతంగా టూరిస్టులను ఆకర్షించి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయితే, అక్కడికి వచ్చిన టూరిస్టులు మాత్రం చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదుర్కొంటున్నారు. వంతెన వరకు వచ్చి దానిపై అడుగుపెట్టేందుకు భయపడేవారు కొందరైతే.. దానిపై కొంతమేరకు నడిచి అంత ఎత్తునుంచి కిందికి చూసి కళ్లు తిరిగి ఇక మాత్రం ముందుకు కదలకుండా వంతెనకు వేలాడేవారు ఇంకొందరు. తాజాగా ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చెక్కర్లు కొడుతోంది. ఇటీవల ప్రారంభించిన ఐజాయ్ అనే 500 మీటర్ల ఎత్తయిన గాజు వంతెనపై కొద్ది దూరం మాత్రం రెండడుగులు వేసిన ఓ మహిళా టూరిస్టు అనంతరం గజగజా వణికిపోతూ దానిపై కూర్చొని ఇక కదలలేనంటూ మొండికేసింది. దీంతో ఆమెతో వచ్చిన వ్యక్తి ఈడ్చుకుంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన అక్కడి వారంతా కడుపుబ్బేలా నవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ వీడియో తెగ ఆకర్షిస్తోంది.. మీరూ ఓ లుక్కేయండి మరీ! -
జియో ఫోన్ ఎఫెక్ట్: మీడియా, టెలికాం షేర్ల పతనం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ ఏజీఎం సందర్భంగా జియో ఫోన్ ప్రకటన తో మీడియా షేర్లు, టెలికాం షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఐడియా సెల్యులార్ ఏకంగా 6 శాతం, భారతి ఎయిర్ టెల్, 3.2, ఆర్‌కాం1.43 శాతం, డిష్ టీవీ, 6శాతం, హాత్వే కేబుల్ 2 శాతం పతనాన్ని నమోదు చేశాయి. మరోవైపు ఆర్ఐఎల్ 3 శాతం లాభాలతో కొనసాగుతోంది. రిలయన్స్ జియో ఎంట్రీతో దేశీయ టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. ఉచిత ఆఫర్లనుంచి తారిఫ్‌లను మార్చుకుంటూ వచ్చినా దేశీయ పత్యర్థి టెల్కోల నష్టాలు కొనసాగుతున్నాయి. దీనిపై మూడు ప్రధాన ఆపరేటర్ల ఆందోళన ఆరోపణలు కొనసాగుతుండగానే తాజా ప్రపంచంలోనే అతి చవకైన 4జీ ఫీచర్ ఫోన్ ప్రకటించడం వీటికి మరింత భారం కానుంది. ముఖ్యంగా జియో కస్టమర్లకు ఈ ఫోన్ పూర్తిగా ఉచితం. వాయిస్ కాల్స్ ఉచితం. దీంతో పాటు కేవలం రూ.153 లకే అన్ని సేవలను ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో మీడియా షేర్లు, టెలికాం షేర్లు కుదేలయ్యాయి. అటు ఎనలిస్టులు కూడా ఫోన్ మార్కెట్లోకి జియో ప్రవేశించడం టెలికం దిగ్గజాలపై భారీగా ప్రభావితం చేయనుందని వ్యాఖ్యానించారు. -
యాక్షన్ సీన్ లాంటి యాక్సిడెంట్
కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా నెట్ లో హల్ చల్ చేస్తోంది. కాలిఫోర్నియా హైవేపై లాస్ ఏంజిల్స్ , లాస్ వెగాస్ నగరాల మధ్య ఈ ఆక్సిడెంట్ చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టింది. ట్రక్ వెనుక చక్రం కింద చిక్కుకున్న ఆ కారుని ఏకంగా ఆరు కిలోమీటర్ల ఈడ్చుకెళ్లింది. కారు డ్రైవర్ , చేతులు ఊపుతూ అరిచి గోల చేసినా ఫలితం లేకపోయింది. ట్రంక్ వెంటే వెళ్తున్న మరో వాహనం లోని ఓ వ్యక్తి, దీన్ని షూట్ చేసి వీడియోని ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. అయితే తన ట్రక్కు వెనక కారు ఇరుక్కుపోయిందన్న విషయం తనకు తెలియదని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో కారులోవున్న డ్రైవర్‌తో సహా ఎవరికీ ఎలాంటి ఏ ప్రమాదం జరగలేదు. ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు.