కారు బానెట్‌పై ట్రాఫిక్‌ పోలీసు వేలాడుతున్నా.. | Man Drags Police On Cars Bonnet In Gurugram | Sakshi
Sakshi News home page

Dec 20 2018 11:12 AM | Updated on Dec 20 2018 11:55 AM

Man Drags Police On Cars Bonnet In Gurugram - Sakshi

గురుగ్రామ్‌: కారును అడ్డుకోవడానికి ప్రయత్నించిన ట్రాఫిక్‌ పోలీసుపైకి వాహనాన్ని ఎక్కించేందుకు కూడా వెనకాడలేదు ఓ వ్యక్తి. ఈ ఘటన బుధవారం గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌లోని సిగ్నేచర్‌ టవర్‌ చౌక్‌ వద్ద రాంగ్‌ రూట్లో వెళ్తున్న కారును ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ అడ్డుకున్నారు. కారులో ఉన్న వ్యక్తి మాత్రం వాహనాన్ని రివర్స్‌ తీసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. తన వద్దకు పోలీసు రాగానే కారును వెనక్కి తీస్తున్నట్టుగా చేసి ముందుకు పోనిచ్చాడు. అది ఆపడానికి యత్నించిన ట్రాఫిక్‌ పోలీసు కారు ముందు భాగాన్ని పట్టుకున్నాడు. కానీ ఆ వ్యక్తి ఇదేమీ పట్టించుకోకుండా.. వేలాడుతున్న పోలీసును లాక్కుంటూ కారును కొద్ది దూరం ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి, కారును సీజ్‌ చేశారు. ఈ ఘటనను అక్కడున్న ప్రత్యక్షసాక్షులు చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement