Interstate thieves arrested
-
అంతర్రాష్ట్ర కార్ల దొంగలు అరెస్టు
మదనపల్లె టౌన్: నలుగురు అంతర్రాష్ట్ర కార్ల దొంగలను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లె గోపీనగర్‌కు చెందిన మహ్మద్ ఇయాజ్ అలియాస్ అయాజ్ (23), జామీ ప్రసాద్(28), అన్నమయ్య జిల్లా రాయచోటి పొద్దుటూరువారిపల్లెకి చెందిన నందలూరు రాజానర్మదారెడ్డి (36), రాయచోటి టౌన్ మాసాపేటకు చెందిన పగిడిపల్లె సుబహాన్ (50) హైదరాబాద్‌లో కార్లు అద్దెకు ఇచ్చేవారి వద్ద డ్రైవర్లుగా చేరేవారు. అక్కడ నమ్మకంగా ఉంటూ కార్ల యజమానుల వద్ద నెల, రెండు నెలల పాటు వాహనాలను బాడుగకు తీసుకునేవారు. తర్వాత తప్పుడు పత్రాలతో వాటిని మదనపల్లెకు తీసుకొచ్చి కొందరు వడ్డీ వ్యాపారులకు రూ.5 నుంచి 8 లక్షలకు అమ్మేసేవారు. యజమానులు వాహనాలు అడిగినప్పుడు అమ్మిన కార్లకు జీపీఎస్ ఉండడంతో తిరిగి మదనపల్లెకు వచ్చి ఆచూకీ తెలుసుకుని దాని రెండో తాళం సహాయంతో వడ్డీ వ్యాపారులకు తెలియకుండా తీసుకెళ్లి యజమానులకు ఇచ్చేసేవారు. ఈ క్రమంలో శనివారం దొంగలు మదనపల్లెకు వచ్చినట్లు తెలుసుకుని వలపన్ని ఎస్బీఐ కాలనీవద్ద పట్టుకున్నారు. అత్యంత ఖరీదైన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని.. మిగిలిన మూడు కార్లను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
బియ్యం మాటున ‘ఎర్ర’ స్మగ్లింగ్
చిత్తూరు అర్బన్ (చిత్తూరు జిల్లా): ఓ కంటైనర్‌లో రూ.1.5 కోట్ల విలువచేసే ఎర్రచందనం దుంగలను తీసుకెళ్తూ ఎవరికీ అనుమానం రాకుండా దుంగలపైన బియ్యం బస్తాలను వేసినా పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరులో ఈ వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదివారం విలేకరులకు వివరించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పీలేరు వద్ద ఎర్రచందనం దుంగలు తరలుతున్నట్లు సీఐ సాధిల్‌అలీకి సమాచారం రావడంతో పోలీసులు సరిహద్దుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ కంటైనర్‌కు ముందు, వెనుక వైపు ఎస్కార్ట్లుగా వాహనాలు వెళుతుండగా వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కంటైనర్‌ను తెరచి చూశారు. తొలుత ఇందులో పోలీసులకు బియ్యం బస్తాలు కనిపించాయి. వాటిని కిందకు దింపించి చూస్తే పెద్ద సంఖ్యలో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా.. గుడిపాల సరిహద్దుల్లో మరో రెండు వాహనాల్లో తరలుతున్న ఎర్రచందనం దుంగలు, తీసుకెళుతున్న వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి నుంచి తమిళనాడుకు ఎర్రచందనం దుంగలు తీసుకెళుతున్నట్లు విచారణలో తేలింది. ఘటనలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కొత్త సురేంద్రరెడ్డి (27), వసంతు అశోక్‌కుమార్‌రెడ్డి (40), తిరుపతికి చెందిన అప్పిలి మురళి (29), యర్రమరెడ్డి రామంజులు (41), తలారి వికేష్ (26), యాదమరికి చెందిన చేంద్ర శ్రీరాములు వెంకటేష్ (32), తమిళనాడు తిరుపత్తూర్‌కు చెందిన స్వామినాథన్ సంజీవ్ (24), వేలూరుకు చెందిన జి.విజయకాంత్ (28), ఎస్.శక్తివేల్ (30), ఆర్.విజయ్‌కుమార్ (36), ఎం.వేలుసామి (42), రాజమని హరిమూర్తి (42), తిరువణ్ణామలైకి చెందిన ధనతరాన్ ఏలుమలై (37)లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడున్నర టన్నుల బరువున్న 115 ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు, ఓ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. -
యూట్యూబ్ చూసి.. బైక్‌లు చోరీ చేసి
చిత్తూరు అర్బన్/దేవరపల్లి (పశ్చిమ గోదావరి): యూట్యూబ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భారీగా ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన 13 మంది అంతర్ రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి 107 బైక్‌లు, ఓ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకోగా.. అదే తరహాలో చోరీలకు పాల్పడిన మరో ఇద్దరి అరెస్ట్ చేసి 109 బైక్‌లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు జిల్లాల్లో ఒకేరోజు 216 బైక్‌లు పట్టుబడటం గమనార్హం. రెండుచోట్లా పట్టుబడిన నిందితులు అంతర్ రాష్ట్ర దొంగలు కావటం.. టెక్నాలజీ సాయంతోనే చోరీలకు పాల్పడటం విశేషం. చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన చోరీలకు సంబంధించి ఎస్పీ సెంథిల్‌కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, పలమనేరు, పుత్తూరు, శ్రీసిటీ సబ్–డివిజన్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ అవుతున్నట్టు పోలీసులకు పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన డీఎస్పీలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆ బృందాలు చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడులోని తిరువళ్లూరు, వేలూరు జిల్లాకు చెందిన నాలుగు ముఠాలు వాహనాల చోరీకి పాల్పడుతున్నట్టు గుర్తించాయి. వరుస చోరీలకు పాల్పడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి విచారణ జరపగా.. జల్సాలకు అలవాటు పడి ఆ దొంగల్లో పలువురు యూట్యూబ్‌లో చూసి చోరీలు చేస్తున్నట్టు చెప్పారు. చిత్తూరు జిల్లా కేసుల్లో నిందితులు వీరే.. చిత్తూరు సబ్ డివిజన్లో యాదమరికి చెందిన ఎ.వినోద్‌కుమార్ (25), సీజీ రాజా (47), చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఎస్.రవిచంద్ర (32) అనే ముగ్గురిని అరెస్ట్ చేసి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు సబ్–డివిజన్ పోలీసులు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన ఎస్.సతీష్‌కుమార్ (27), ఐ.జయచంద్ర (55), వరదయ్యపాలెంకు చెందిన ఎస్.వెంకటేశ్వర్లు (27), ఎస్.సుబ్రహ్మణ్యం (18)లను అరెస్ట్ చేసి 37 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు సబ్–డివిజన్ పోలీసులు తమిళనాడులోని పేర్నంబట్టుకు చెందిన జి.మురళి (25), పి.కుమరేశన్ (34), యాదమరికి చెందిన జ్యోతి (50) అనే ముగ్గురిని అరెస్ట్ చేసి 27 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీసిటీ పరిధిలో సత్యవేడుకు చెందిన ఎస్.యుగంధర్ (26)ను అరెస్ట్ చేసి 8 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. వాహనాలకు మార్కెట్లో లభించే నాణ్యత ఉన్న లాక్‌లను ఉపయోగించాలని, బైకులు చోరీకి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సెంథిల్‌కుమార్ కోరారు. కాగా, డీఎస్పీలు సుధాకర్‌రెడ్డి, గంగయ్య, యశ్వంత్‌లతో పాటు దర్యాప్తులో పాల్గొన్న సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దేవరపల్లిలో 109 బైక్‌లు తెలంగాణతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోటార్ బైక్‌లు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సుమారు రూ.55 లక్షల విలువైన 109 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పత్సా రాంబాబు, మారం మునియ్య కలిసి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. వీరు కూడా తాళాలు వేసి ఉన్న ఎలాంటి బైక్‌నైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సులభంగా స్టార్ట్ చేసి దర్జాగా వేసుకెళ్లిపోయేవారు. వాటిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్మును జల్సాగా ఖర్చు చేసేవారు. వీరిద్దరూ దొంగిలించిన 109 బైక్‌లలో 83 బైక్‌లకు సంబంధించి ఏలూరు, భీమడోలు, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, టి.నర్సాపురం, దేవరపల్లి, కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు, తాడేపల్లిగూడెం, ద్వారకా తిరుమల, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, తెలంగాణలోని ఆశ్వారావుపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు ఎస్పీ తెలిపారు. 26 బైక్‌లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. చోరీ చేసిన మోటార్ సైకిళ్లను యాదవోలుకు చెందిన 12 మంది వ్యక్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దేవరపల్లి ప్రాంతంలో సారా తయారీదారులు ఈ బైక్‌లను కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు 93 బైక్‌లను యాదవోలు గ్రామంలోనే విక్రయించినట్టు చెప్పారు. తనిఖీల్లో పట్టుబడ్డారు నిందితులు పత్సా రాంబాబు, మారం మునియ్య పోలీసులు నాకాబందీ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. దేవరపల్లి ఎస్సై కె.శ్రీహరిరావు, సిబ్బంది వచ్చీపోయే వాహనాలను తనిఖీలు చేస్తుండగా నిందితులిద్దరూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి అసలు విషయాన్ని రాబట్టారు. నిందితులిద్దరితోపాటు బైక్‌లు కొనుగోలు చేసిన 12 మందిపైనా కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చోరీ అయిన బైక్‌లను త్వరితగతిన స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీధర్, దేవరపల్లి ఎస్సై కె.శ్రీధర్, స్టేషన్ సిబ్బందికి ఎస్సీ రాహుల్‌దేవ్‌శర్మ రివార్డులు అందజేశారు. -
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని లక్ష్యంగా నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. సుమారు కోటి రూపాయల విలువ చేసే రూ.1.5కిలోల హెరాయిన్, కోకైన్‌తోపాటు డైట్యూట్ కెమికల్ పౌడర్‌ను మల్కాజిగిరి, సరూర్‌నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నా రు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుమంది ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ కేసుల సూత్రధారి నెల్లూరుకు చెందిన అమ్జద్ పరారీలో ఉన్నారు. హైదరాబాద్‌కు నిషేధిత మాదకద్రవ్యాల రవాణాలో అసలు సూత్రధారులు ఎవరనేది, ఎక్కడి నుంచి వ్యవహారాలు నిర్వహిస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. నేరేడ్మెట్లో కొత్తగా నిర్మిం చిన తన కార్యాలయంలో బుధవారం తొలిసారిగా సీపీ విలేకరుల సమావేశం నిర్వహించి, డ్రగ్స్ రాకెట్ కేసు వివరాలు వెల్లడించారు. సూరిబాబు నుంచి డ్రగ్స్ ఏపీలోని నెల్లూరు జిల్లా రంగనాయకులపేటకు చెందిన బీడి కార్మికుడు షేక్ ఆబిద్ (48)కు కొన్ని నెలల క్రితం నెల్లూరు నివాసి డ్రగ్స్ రవాణ వ్యాపారి అమ్జద్‌తో పరిచయం ఏర్పడింది. సూరిబాబు అనే పోలీసు అధికారి తనకు బాగా తెలుçసని అతని వద్ద కోట్ల విలువ చేసే నిషేధిత మాద్రక ద్రవ్యాలు ఉన్నాయని ఆబిద్‌కు అమ్జద్ వివరించాడు. సూరిబాబు నుంచి డ్రగ్స్ తీసుకొని బ్లాక్మార్కెట్లో విక్రయిస్తే లక్షలు సంపాదించొచ్చని అమ్జద్ చెప్పడంతో ఆబిద్ అంగీకరించాడు. ఇద్దరు కలిసి సూరిబాబు నుంచి కిలోన్నర హెరాయిన్, కోకైన్, డైల్యూట్ కెమికల్ పౌడర్‌ను తీసుకువచ్చి, నెల్లూరులోని ఆబిద్ ఇంట్లో నిల్వ చేశారు. అనంతరం ఎక్కువ మొత్తానికి డ్రగ్స్ కొనుగోలుదారుల కోసం ఆబిద్ వెతకటం ప్రారంభించాడు. కృష్ణపట్నం టు హైదరాబాద్ 2008 సంవత్సరంలో కృష్ణపట్నం పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో జైలుకెళ్లొచ్చిన బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన డ్రైవర్ ముసునూర్ ఓంకార్ (27), అతని మిత్రుడు కందికంటి రాజశేఖర్ (27)లను కలిసి తన వద్ద ఉన్న కోకైన్, హెరాయిన్ గురించి ఆబిద్ వివరించాడు. కొనుగోలుదారులను తెస్తే ఇందులో వాటా ఇస్తానని వారికి చెప్పాడు. వీరిద్దరు విశాఖపట్నంకు చెందిన డ్రైవర్ పెద్దిరెడ్ల కనకరాజు (34) అలియాస్ రాజుకు డ్రగ్స్ విక్రయం గురించి వివరించారు. రాజు ద్వారా వరంగల్‌కు చెందిన పూజారి చక్రధరాచార్యులు (48)కు ఈ విషయం తెలిసింది. చక్రధర్ రంగంలోకి దిగి.. రూ.35లక్షలకు డీల్ కుదిర్చాడు. మొదట ఇంత తక్కువ మొత్తానికి ఆబిద్ ఒప్పుకోనప్పటికీ.. తర్వాత అంగీకరించి తన వద్ద ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను ఓంకార్, రాజశేఖర్, రాజులకు ఇచ్చాడు. వీరు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వీటిని తరలించేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. పట్టుబడ్డారిలా! ఈనెల 9వ తేదీ రాత్రి పోలీసులు కర్మన్‌ఘాట్ ప్రాంతంలో పోలీసులు వాహన తనీఖీలు నిర్వహిస్తున్నారు. నాకాబందీని గమనించిన ఓంకార్, రాజశేఖర్‌లు కారు (ఏపీ 31టీవీ 6815 – స్విఫ్ట్ డిజైర్) దిగి పారిపోగా.. రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 15 గ్రాముల కోకైన్, హెరాయిన్, 3.30గ్రాముల కెమికల్ పౌడర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. పరారీ లో ఉన్న ఓంకార్, రాజశేఖర్, చక్రధర్, ఆబిద్‌లను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి 1.440 కేజీల మాదకద్రవ్యాలు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసు కున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసు విచారణలో పాల్గొన్న అధికారులకు ఆయన నగ దు రివార్డులను అందజేశారు. ఈ సమావే శంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్ఓటీ అడిష నల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, ఏసీపీ పృథీందర్‌రావు, సీఐ నాగేశ్వర్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐలు అవినాష్, మల్కాజిగిరి, సరూర్‌నగర్ ఎస్టీఓ పోలీసులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లలో చోరీలు
కాజీపేట అర్బన్: ఈజీ మనీకి అలవాటు పడి, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి భారీగా బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ధార్ జిల్లా, కుక్షి తహశీల్ బగోలి గ్రామానికి చెందిన 25 ఏళ్ల దిలీప్ పవార్, అదే తహసీల్ భడ్‌కచ్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల సర్వన్ పవార్ దూరపు బంధువులు. వీరు మధ్యలోనే చదువు మానేసి కూలిపని చేస్తుండేవారు. తర్వాత చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి ఈజీమనీ కోసం దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం.. రైలు మార్గంలో ఉన్న వరంగల్ నగరాన్ని ఎంచుకున్నారు. నగరానికి చేరుకుని తాళం వేసిన ఇళ్లను చూసి, రాత్రి వేళల్లో తాళాలను పగులగొట్టి చోరీలకు పాల్పడేవారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో మామునూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడటంతోపాటు ఒక బైక్, సుబేదారి పరిధిలో రెండు ఇళ్లలో చోరీలు, రెండు బైక్‌లు, కేయూసీ పరిధిలో రెండు చోరీలు, మట్వాడా, హన్మకొండ, మిల్స్‌కాలనీ, కాజీపేట, కమలాపూర్, గీసుకొండ, ఐనవోలు, దేవరుప్పుల పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో ఇంట్లో చోరీలకు పాల్పడ్డారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్లు డేవిడ్‌రాజు, రవిరాజ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బలగాలను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పంపి విచారణ జరపగా వారిద్దరు వరంగల్‌లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇక్కడి సీసీ కెమెరాల్లో వారిద్దరినీ గుర్తించడంతోపాటు వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. వరంగల్‌కు వెళ్తుండగా... చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలను విక్రయించేందుకు చోరీ చేసిన బైక్‌పై వరంగల్‌కు హన్మకొండ నుంచి హంటర్‌రోడ్డు మీదుగా వెళ్తున్నారు. క్రైమ్స్ అదనపు డీసీసీ బిల్లా అశోక్‌కుమార్ సమాచారం మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్లు డేవిడ్‌రాజు, రవిరాజు తనిఖీలు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 900 గ్రాముల బంగారం, 12 కిలోల వెండి, మూడు బైక్, రెండు సెల్ఫోన్లు, చోరీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. వారికి సహకరించిన ఇద్దరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్లు డేవిడ్‌రాజు, రవిరాజ్‌ను అభినందించారు. ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, అసిస్టెంట్ అనాలిటికల్ ఆఫీసర్ సల్మాన్‌పాషా, ఏఎస్సైలు వీరాస్వామి, శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు అహ్మద్‌పాషా, జంపయ్య, కానిస్టేబుళ్లు రాజశేఖర్, చంద్రశేఖర్, మహేశ్వర్, డ్రిస్టిక్ట్ గార్డ్స్ కానిస్టేబుళ్లు సుధాకర్‌రెడ్డి, మహేష్, మహేందర్ పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు
చీరాల రూరల్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర బాల నేరస్తుడితో పాటు మరో ఇద్దరు నేరస్తులను చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, ఒంగోలు సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వారి నుంచి 35 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి స్థానిక కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన బాల నేరస్తుడు ఇటీవల ఒంగోలు టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చేసిన దొంగతనం కేసులో దర్యాప్తు చేపట్టగా నిందితుని వేలి ముద్రలు గతంలో చేసిన పలు దొంగతనం కేసుల్లో వేలిముద్రలు సరిపోలినట్లు డీఎస్పీ తెలిపారు. ఆ వేలిముద్రలు ఆధారంగా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు స్థానిక టూ టౌన్ సీఐ జి.రామారావు, ఒంగోలు సీసీఎస్ డీఎస్పీ కె. శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ ప్రేమ్ కాజల్ తెలిపారు. దర్యాప్తులో హైదరాబాద్‌కు చెందిన బాల నేరస్తుడు గతంలో హైదరాబాద్, వికారాబాద్, తిరుపతి, విశాఖ పట్టణం, ఒంగోలు, నెల్లూరు, చీరాల తదితర ప్రాంతాల్లో సంచరించి పదుల సంఖ్యలో దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని డీఎస్పీ తెలిపారు. హైదరాబాదులో జరిగిన దొంగతనం కేసుల్లో శిక్షలు పడగా అక్కడి బోస్టన్ స్కూలుకు కూడా బాల నేరస్తుణ్ణి తరలించారు. విడుదల అనంతరం అతడు పోలీసులు మరలా అరెస్టులు చేస్తారనే అనుమానంతో అక్కడి నుంచి గుంటూరుకు మకాం మార్చాడు. అక్కడ వెంకటేష్ అనేవ్యక్తితో పరిచయం పెంచుకుని అక్కడ కూడా దొంగతనాలు చేశారు. అక్కడి నుంచి చిలకలూరిపేటకు మకాం మార్చి శీలం రమేష్, భూలక్ష్మిలతో పరిచయం పెంచుకున్నారు. రమేష్ దంపతులు వివిధ గ్రామాలలో తిరుగుతూ చిక్కెంట్రుకల వ్యాపారం ముసుగులో ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుంటారు. వీరిరువురూ బాల నేరస్తుణ్ణి తమవద్దే ఉంచుకుని అతని ద్వారా ఒంగోలు, నెల్లూరు, చీరాల ప్రాంతాల్లో అనేక దొంగతనాలు చేయించారు. అంతేకాక బాల నేరస్తుడు దొంగిలించే బంగారు నగలను రమేష్ అతని భార్య భూలక్ష్మిలు విక్రయించేవారు. కేసుల ఆధారంగా దర్యాప్తును ముమ్మరంచేసి నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న పై ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు. కేసును అత్యంత చాకచక్యంగా చేధించి నిందితులను పట్టుకొన్న చీరాల టూ టౌన్ సీఐ జి. రామారావు, సీసీఎస్ సీఐ కె. శ్రీనివాసరావు, సీసీఎస్ ఎస్సై వివి.నారాయణ, ఏఎస్సై వి.వెంకటేశ్వర రెడ్డి, హెచ్కానిస్టేబుల్స్ టి.బాలాంజనేయులు, వై.చంద్ర శేఖర్, సురేష్, కోటి, అహరోను, కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, అంజిబాబు, ఖాదర్ భాషా, సాయికృష్ణ, శాంతకుమార్, సందాని బాషా, అచ్చియ్య, శ్రీనివాసరావులను ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారని, వారందరికీ రివార్డులు కూడా అందజేయనున్నట్లు డీఎస్పీ ప్రేమ్‌కాజల్ తెలిపారు. -
అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
అల్లిపురం: ఇళ్లలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగలను కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాం డ్కు తరలించారు. వారి వద్ద నుంచి 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి సామగ్రి, 4 కెమెరాలు, 3 రిస్ట్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో గురువారం క్రైం డీసీపీ టి.రవికుమార్ మూర్తి కేసు వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా జే స్టాంబ్ చౌక్ దరి, పూర్ణా బిలాయ్-3కి చెందిన బమ్మిడి సంతోష్ 2009 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై 27 ఇంటి దొంగతనం కేసులు ఉన్నాయి. ఓ మర్డర్ కేసులో కూడా నిందితుడు. ఇతను ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాల్లో 9 సార్లు సెంట్రల్ జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ ఏడాది మార్చి 23న విజయనగరం సబ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకున్న అతనికి పందిమెట్ట, నౌరోజీ రోడ్డు, ముత్యాలమ్మ గుడి సమీపంలో నివాసం ఉంటున్న రేకల అప్పలరాజు కంచరపాలెం కపరాడలో షెల్టర్ ఏర్పాటు చేశాడు. పోలీసులు వీరిపై నిఘా ఉంచడంతో తరచూ బస మారుస్తుండేవారు. కాగా.. బమ్మిడి సంతోష్‌కు జైలులో పరిచయమైన శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలం కృష్ణాపురంనకు చెందిన కిల్లి వెంకటేష్ తోడయ్యాడు. శ్రీకాకుళం, ఆమదాలవలసలో వెంకటేష్‌పై కేసులు నమోదై ఉన్నాయి. నగరంలో ఆరు దొంగతనాలు వీరు ముగ్గురు కలసి నగరంలో ఎయిర్‌పోర్టు, ఆరిలోవ, పీఎం పాలెం, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకొక్కటి, దువ్వాడ స్టేషన్ పరిధిలో రెండు చొప్పున మొత్తం ఆరు ఇంటి దొంగతలనాలకు పాల్పడ్డారు. ఈ దొంగతనాలకు సంబంధించి 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి సామగ్రి, 5 కెమెరాలు, 12 రిస్ట్ వాచ్‌లు, రెండు సెల్ఫోన్లు, రూ.1.59 లక్షల నగదు అపహరించుపోయారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వద్ద గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి సామగ్రి, 4 కెమెరాలు, 3 రిస్ట్ వాచీలు, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ తెలిపారు. కేసులను ఛేదించిన క్రైం సీఐ ఆర్. గోవిందరావు, ఎస్ఐలు జి. రవికుమార్, డి. విశ్వనాథం, కానిస్టేబుళ్లు ఎస్. హరిప్రసాద్, అప్పలరాజు, రమేష్, హోం గార్డు టి. అప్పలరాజులను డీసీపీ అభినందించారు.