టీడీపీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు | IT Searches In TDP Leaders Houses In Tamilanadu | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు

Published Sat, Feb 23 2019 6:38 PM | Last Updated on Sat, Feb 23 2019 7:18 PM

IT Searches In TDP Leaders Houses In Tamilanadu - Sakshi

చెన్నై: టీడీపీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ నాయకులు రామ్మూర్తి రెడ్డి, దండా బ్రహ్మానందం, జవ్వాజి రామాంజనేయుల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. వీరంతా కూడా తమిళనాడు మంత్రి వీరమణితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

రామాంజనేయులు చైన్నై టీటీడీ సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ఈ సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లతోపాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement