జనసేన కార్యకర్తల దారుణం.. భోజనానికి పిలిచి.. | Janasena Activists Attacks YSRCP Polling Agent In East Godavari | Sakshi
Sakshi News home page

జనసేన కార్యకర్తల దారుణం.. పోలింగ్‌ ఏజెంట్‌పై దాడి

Published Sat, Apr 13 2019 7:09 PM | Last Updated on Sat, Apr 13 2019 7:21 PM

Janasena Activists Attacks YSRCP Polling Agent In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో జనసేన కార్యకర్తలు దారుణానికి పాల్పడ్డారు. దొంగఓట్లు వేసుకోవటానికి సహకరించలేదని వైఎస్సార్‌ సీపీ పోలింగ్‌ ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన అంబాజీపేట మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుమారుడు మీడియాతో తెలిపిన వివరాల మేరకు.. అంబాజీపేట మండలం కుమ్మరిపాలేనికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ర్యాలి శ్రీనివాస్ వడయార్ ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుపున పోలింగ్‌ ఏజెంట్‌గా ఉన్నారు. జనసేన పార్టీకి చెందిన కొంతమంది దొంగఓట్లు వేసుకోవటానికి తమకు సహకరించాలని ఆయనను కోరారు. ఇందుకు శ్రీనివాస్‌  ఒప్పుకోకపోవటంతో ఆయనపై క్షక్ష్య పెంచుకున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా శ్రీనివాస్ వడయార్‌ని భోజనానికి రమ్మని పిలిచిన ఏడుగురు జనసేన కార్యకర్తలు ఆయనను నందెపువారిపాలెం వద్ద అడ్డగించి, అతిదారుణంగా చితకబాదారు. శ్రీనివాస్‌ కుమారుడు సమరనాథ్‌ ఈ సంఘటనపై అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పి.గన్నవరం నియోజకవర్గం అభ్యర్థి కొండేటి చిట్టిబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement