
సాక్షి, బెంగళూరు : తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కన్నడ హీరోపై ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హోంబణ్ణ చిత్ర హీరో సుబ్రహ్మణ్య కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసినట్టు 23 ఏళ్ల యువతి బసవగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. రాజాజీనగర్‌కు చెందని యువతి, సుబ్రహ్మణ్య రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరద్దరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. అయితే చిత్ర షూటింగ్ ముగిసిన తర్వాత పెళ్లి చేసుకుందామని సుబ్రహ్మణ్య మాట ఇచ్చాడు.
ఈ క్రమంలో నవంబర్ 1న తన అక్క ఇంట్లో పార్టీ ఉందని చెప్పి ఆ యువతిని సుబ్రహ్మణ్య ఇంటికి పలిచాడు. అక్కడ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతి నిలదీయడంతో త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. కానీ ఇపుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సబ్రహ్మణ్య పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment