సాక్షి, హైదరాబాద్ : నగరంలో కరక్కాయల పొడి వ్యాపారం పేరుతో ప్రజలను నమ్మించి పరారైన మోసగాళ్ల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ కరక్కాయల స్కామ్‌లో బాధితుల సంఖ్య పెరుగుతోందని సమాచారం. దాదాపుగా రూ. 10కోట్ల స్కామ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మల్లికార్జున్ కోసం ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ స్కాంలో కీలక నిందితుడు దేవరాజ్ హరిరాజ్ ఢిల్లీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవారాజ్ హరిరాజ్ స్వస్థలం నెల్లూరు. ఈ స్కామ్‌లో దేవరాజ్, మల్లికార్జునల వెనుక ఢిల్లీకి చెందిన ముఠా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
నెల్లూరు, బెంగళూరులో అతని కోసం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజల డబ్బుతో మల్లికార్జున్ కుటుంబంతో సహా పరారయ్యాడు. కంపెనీ అకౌంట్ నుంచి డబ్బులు మొత్తం డ్రా చేసినట్లు గుర్తించారు. నిందితుడు మల్లికార్జున్ విదేశాలకు పారిపోకుండా అన్ని విమానాశ్రయాలకు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment