Karakkaya
-
చైన్ దందా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొలుసుకట్టు దందాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఇటీవలి కాలంలో క్యూనెట్, హీరా గ్రూపు ఉదంతాలు వెలుగుచూసినా కొత్త పేర్లు, ఐడియాలతో జనాల జేబుకు చిల్లు పెట్టేందుకు నయా మార్గాల్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. వేగంగా డబ్బు రెట్టింపు చేస్తామని ఆశచూపుతూ మధ్యతరగతి ప్రజల జీవితా లతో ఆటలాడుకుంటున్నాయి. తాజాగా సెర్ఫా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట హైదరాబాద్‌లో ఓ కొత్త కంపెనీ వెలిసింది. మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా వ్యాపారం సాగిస్తోంది. ఏడాదిలో లక్షాధి కారులు కావచ్చని అరచేతిలో స్వర్గం చూపిస్తూ అమాయకుల నుంచి భారీగా దండుకుంటోంది. ఎలా చేస్తున్నారు..? సెర్ఫా కంపెనీలో చేరాలంటే ముందుగా రూ. 18 వేలు కట్టాలి. దానికి సమాన విలువ అని చెబుతూ రెండు 100 గ్రాముల బరువున్న ట్యాబ్లెట్ల డబ్బాలు అంట గడతారు. కట్టిన డబ్బు వృథా కాలేదు అనే భావన కస్టమర్‌కు కలిగేలా సంతృప్తి పడేలా నూరిపోస్తారు. వాస్తవానికి ఆ ట్యాబ్లెట్ల విలువ మార్కెట్లో రూ. 1,000–2,000కు మించదు. తరువాత వారికి ఒక ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. అంతకుముందే బ్యాంకు, ఆధార్ ఖాతాల వివరాలు తీసుకొని తొలుత ఖాతాలో రూ. 2 వేలు జమచేస్తారు. ఇక అక్కడ నుంచి ఖాతాదారు తరఫున ఎంత మంది చేరితే అన్ని రూ. 1,200 చొప్పున ఖాతాలో జమ చేస్తామని ఆశచూపుతారు. బంధువులు, స్నేహితులను చేర్పించమంటూ మానవ సంబంధాలపై వ్యాపారం నడిపిస్తున్నారు. వారు తమ కంపెనీలో చేరే ప్రతి ఒక్కరినీ పార్ట్నర్ని అని చెబుతుండటం గమనార్హం. ఏడాదిన్నర కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నారట.. వాస్తవానికి ఈ కంపెనీని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వద్ద 2018 ఏప్రిల్ 26న విశాఖపట్నం కేంద్రంగా రిజిష్ట్రేషన్ చేశారు. అంటే దీని వయసు ఏడాదిన్నరలోపే. కానీ ఇందులో పనిచేసే ఉద్యోగులు మాత్రం తాము 2016 నుంచి ఈ కంపెనీలో చేస్తున్నామని, ఎంటెక్, ఎంబీఏలు చదివి వేల రూపాయల వేతనాలు వదులకొని ఇందులో భాగస్వాములుగా చేరామని గొప్పలు చెబుతున్నారు. ప్రతి వారినీ కంపెనీలో భాగస్వాములంటూ సంబోధించడంతో వెనకా ముందు చూడకుండా పేదలు దిగువ మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులు అప్పు చేసి మరీ పెట్టుబడి పెడుతున్నారు. క్యూనెట్ ప్రెస్‌మీట్‌తో ఖాతాదారుల్లో అనుమానాలు.. ఇటీవల క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ పోలీసులు పెట్టిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలుసుకుని ఇందులో చేరిన ఖాతాదారులు కొందరు ఆలోచనలో పడ్డారు. ఈ కంపెనీ ప్రతినిధులు ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ కాదని చెబుతున్నా.. అదేబాటలో నడుస్తుండటంతో అనుమానం వచ్చి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడం మొదలుపెట్టారు. కానీ, వారిని కంపెనీ ప్రతినిధులు దబాయిస్తున్నారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, కోర్టుకు లాగుతామని బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. అందరిలాగానే వెళ్లిన సాక్షి ప్రతినిధికి కూడా కంపెనీ ఉద్యోగులు అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్నంతా ‘సాక్షి’ రికార్డు చేసింది. తరువాత దీనిపై వివరణ కోరగా.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని తామెవరినీ మోసం చేయడం లేదని చెప్పుకొచ్చారు. చిక్కుకున్నాక మోసం.. ఈ దందాలే మానవ సంబంధాలు, మాటలే పెట్టుబడులు. మోసంలో చిక్కుకున్నాక.. తమ డబ్బును ఎలాగైనా తిరిగి వసూలు చేసుకోవాలని, బంధువులను, స్నేహితులను ఇందులో చేరుస్తున్నారు. ఫలితంగా మోసం వెలుగుచూసాక.. బంధాలు తెగిపోతున్నాయి. ఇలాంటి బాధితుల్లో అధికంగా సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు, ఎంటెక్, ఎంబీఏలు చదివిన గ్రాడ్యుయేట్లు కావడం గమనార్హం. డబ్బులిమ్మంటే బెదిరిస్తున్నారు.. మొదట్లో ఇదేదో మామూలు స్కీం అనుకున్నా. అందుకే పొరుగింటావిడ చెప్పిందని చేరాను. మొన్న క్యూనెట్ గురించి వార్తల్లో చదివా. రెండూ ఒకేరకంగా ఉండటంతో కంపెనీ ప్రతినిధులను నిలదీశా. వారు కంపెనీకి అనుమతులు ఉన్నాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటామని తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారు. – తులసి, గృహిణి, కేపీహెచ్‌బీ కాలనీ పేరేదైనా.. చివరి లక్ష్యం మోసమే..! హైదరాబాద్‌లో రకరకాల పేర్లతో అక్రమార్కులు జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. అందుకు పోంజి, మల్టీలెవల్ మార్కెటింగ్, హెర్బల్ ఇలా తదితర మార్గాల్లో దందాలు చేస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే.. జనాల నుంచి తక్కువ సమయంలో అందినకాడికి దండుకోవడం. క్యూనెట్: రాష్ట్ర రాజధాని ఇటీవల వెలుగుచూసిన మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం విలువ దాదాపు రూ. 1,000 కోట్లపైనే. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టి దారుణంగా మోసపోయాడు. తనతోపాటు స్నేహితులు, బంధువులనూ చేర్పించాడు. వారి వద్ద మొహం చెల్లక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. హీరా: ఇదో రకమైన పోంజి స్కీం. అధిక వడ్డీ ఆశజూపి హైదరాబాద్ కేంద్రంగా సాగిన దందా ఇది. దీని విలువ ఏకంగా రూ. 5,000 కోట్లు. ఈ పథకంలో చేరిన వారిలోనూ అధిక శాతం విద్యావంతులు, గ్రాడ్యుయేట్లే ఉండటం గమనార్హం. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ సంస్థా అధిక వడ్డీ చెల్లించదన్న చిన్న పాయింట్‌ను బాధితులెవరూ గుర్తించకపోవడం కుంభకోణానికి అసలు కారణం. కరక్కాయలు: రోజుకు కిలో కరక్కాయలు దంచిపెడితే రూ. 1,000 ఇస్తామని ఆశచూపి కోట్ల రూపాయలు దండుకున్న విషయం తెలిసిందే. నెల్లూరుకు చెందిన ఓ కేటుగాడు ప్రారంభించిన ఈ దందాలో చిక్కి 650 మంది మహిళలు దాదాపు రూ.8.3 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. -
‘కాయ’..రాజా..కాయ్!
సాక్షి, సిటీబ్యూరో: తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఎరవేస్తూ మోసగాళ్లు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇటీవల సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాల్లో ‘కాయ’ బాగా పాపులర్ అయ్యింది. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్న కరక్కాయ, మునక్కాయల కేసులు విచారణలో ఉండగానే...తాజాగా రాచకొండ పోలీసులు ‘పల్లీ కాయల’ మోసం గుట్టురట్టుకావడం జనం బలహీనత, అత్యాశకు అద్దం పడుతోంది. ఈ మూడు మోసాల విధానం ‘ఆరోగ్య’దాయకంగా ఉండటంతో పాటు అనతికాలంలోనే లక్షాధికారులు కావొచ్చనే ఆయా కంపెనీల మాటలు నమ్మి వేల మంది వందల కోట్లు సమర్పించుకున్నారు. కరక్కాయ మోసమిలా... నెల్లూరు జిల్లా అంబలపురానికి చెందిన ముప్పల శివ మరో ఇద్దరితో కలిసి కేపీహెచ్బీలో సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గతేడాది జూన్‌లో కార్యాలయాన్ని ప్రారంభించాడు. అయుర్వేదిక మందుల్లో ఉపయోగపడే కరక్కాయలపై పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందొచ్చంటూ దినపత్రికలు, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చారు. కిలో కరక్కాయలను రూ.వెయ్యికి కొనుగోలు చేసి 15 రోజుల్లో పొడి చేసి తిరిగి ఇస్తే ఆ వెయ్యితో పాటు అదనంగా రూ.300, మొత్తం రూ.1300లు ఇస్తామంటూ నమ్మించారు. దీన్ని నమ్మిన 650 మంది తమ తోటి బంధువులు, మిత్రులు, సుపరిచితులను ఈ స్కీమ్‌లో చేర్పించడంతో రూ.తొమ్మిది కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తొలినాళ్లలో కస్టమర్లకు చెల్లించినా వీరు ఆ తర్వాత బిచాణా ఎత్తేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసులో బాధితులకు డబ్బులు అందలేదు. మునక్కాయతో ముంచారిలా... ఏడో తరగతి వరకు చదివిన హర్యాణా వాసి రాధేశ్యామ్ మరో ఇద్దరితో కలిసి 2015లో ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్ఎంఎల్సీ)ను హిస్సార్‌లో ప్రారంభించారు. ముఖ్యంగా ఆరోగ్యకర ఉత్పత్తులైన మునక్కాయ పొడి ప్యాక్ చేసిన డబ్బాలతో ఈ గొలుసు దందా సాగించారు. రూ.7,500లు చెల్లించి మీరు సభ్యుడిగా చేరితే రూ.2,500 ఫీజు మినహయించి మిగిలిన రూ.ఐదు వేలకు మునక్కాయ పొడి ఉత్పత్తులు ఇస్తారు. మీరు మరో ఇద్దరిని చేర్పిస్తే నెలకు రూ.500ల బోనస్‌తో పాటు నెలకు రూ.2,500 సంపాదించుకోవచ్చంటారు. ఎక్కువ సభ్యులను చేర్పించిన వారికి టైటిల్‌తో పాటు భారీగా ప్రైజ్‌మనీ కూడా ఇచ్చేవారు...ఇలా అమాయకుల నుంచి దాదాపు రూ.మూడువేల కోట్ల వరకు మోసం చేసిన వీరిని గతేడాది సెప్టెంబర్ 8న గుర్గావ్లో అరెస్టు చేశారు. తక్కువ ధరకే మునక్కాయలు కొనుగోలు చేసి పొడిచేసి కస్టమర్లను మోసగించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలో బాధితులను గుర్తించినా ఇప్పటివరకు న్యాయస్థానం ద్వారా పోలీసు అధికారులు ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల్లోని రూ.200 కోట్లను చెల్లించలేకపోయారు. ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ‘పల్లీ కాయ’తో పల్టీ కొట్టించాడు... ఇంటర్మీడియెట్ వరకే చదువు ఆపేసిన నిజామాద్ జిల్లా మోర్తాండ్ మండలం సంకేట్ గ్రామానికి చెందిన జిన్న కాంతయ్య అలియాస్ జిన్న శ్రీకాంత్‌రెడ్డి అగర్బత్తుల వ్యాపారంతో మోసాలు మొదలెట్టి 2017 డిసెంబర్ నుంచి గ్రీన్‌గోల్డ్ బయోటెక్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాడు. సూరత్ నుంచి రూ.20 వేలకు కొనుగోలు చేసి తీసుకువచ్చిన పల్లీనూనె యంత్రాలతో రూ.లక్షల్లో ఆదాయం వస్తుందంటూ ప్రచారానికి తెరలేపాడు. ఇంట్లోనే ఉండి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించవచ్చంటూ ఆశచూపాడు. ఈ గొలుసు కట్టు పథకంలో భాగంగా రూ.లక్ష ఇచ్చి పల్లీనూనె యంత్రాన్ని కొనుగోలు చేస్తే 40 కిలోల పల్లీనూనె, 200 కిలోల పల్లీలు ఇస్తామంటూ చెబుతాడు. ఈ రకంగా పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.పది వేలతో పాటు రూ.ఐదు వేల అలవెన్స్ 24 నెలల పాటు ఇస్తానంటూ మభ్యపెడతాడు. ఒకవేళ రూ.రెండు లక్షల మెషీన్ కొనుగోలు చేస్తే 80 కిలోల నూనె, 400 కిలోల పల్లీలు ఇచ్చి, ఆ పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.20 వేలతో పాటు అలవెన్స్ కింద రూ.పది వేలు రెండేళ్ల పాటు చెల్లిస్తామంటాడు. అగ్రిమెంట్ సమయంలో ప్రజలను నమ్మించేందుకు పిన్ నంబర్లు కూడా కేటాయిస్తాడు. అలాగే కస్టమర్ల దగ్గరి నుంచి రెండు నెలల పాటు తీసుకున్న ఆయిల్‌ను మళ్లీ ఇతర కస్టమర్లకు ప్యాకేజీ కింద ఇస్తుంటాడు. తొలుత చేరిన వ్యక్తి మరో ఇద్దరిని చేర్పిస్తే కమిషన్ రూపంలో డబ్బులు ఇస్తామని ఆశచూపాడు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఏజెంట్లను నియమించుకుని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వంద కోట్ల వరకు మోసం చేశాడు. ఈ విషయం సీపీ మహేష్ భగవత్ దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు నిందితుడు కాంతయ్యతో పాటు మరో ఇద్దరిని గత నెల 29న అరెస్టు చేశారు. చేరినా...చేర్పించినా నేరమే సులభ పద్ధతిలో ఆదాయం వస్తుందని గొలుసు కట్టు పథకంలో పెట్టుబడులు పెట్టినా, ఇతరులతో పెట్టుబడులు పెట్టించినా అది నేరమవుతుంది. 1978, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చూ అంటే వచ్చే ప్రకటనలు నమ్మకండి. చాలా మంది పోయింది కొంతమొత్తం కాబట్టి ఠాణాకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. ఇవే మోసగాళ్లకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ప్రకటన మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. –వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ అప్రమత్తతతోనే మోసాలకు అడ్డుకట్ట చిన్న మొత్తాలతో భారీగా డబ్బులు సంపాదించవచ్చనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరెన్నీ చెప్పినా నెలల్లోనే లక్షాధికారులు కావొచ్చనే కల్లబొల్లి మాటలు నమ్మకండి. సులభ పద్ధతిన డబ్బులు వస్తున్నాయంటే అది మోసమే అవుతుంది. కరక్కాయ, మునక్కాయ, పల్లీ కాయలతో ఎంఎల్ఎం మోసాలతో కోట్లు దండుకున్నారు. ఈ గొలుసు కట్టు పథకాలతో జరజాగ్రత్తగా ఉండాలి. మీ దృష్టికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. –మహేష్ భగవత్, రాచకొండ సీపీ -
గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామని నమ్మించి వేలాది మంది నుంచి కోట్ల రూపాయాలు వసూలు చేసిన గ్రీన్‌గోల్డ్ బయోటెక్ సంస్థ ఎండీ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా కాంత్‌పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్ష రూపాయలు చెల్లిస్తే పల్లీల నుంచి నూనే తీసే యంత్రం ఇస్తామని దాంతో నెలకు పదివేలు సంపాదించవచ్చని ఆశ చూశారు. ఏజెంట్ల ద్వారా వీటికి ప్రచారం కల్పించి వేలాది మందిని మోసం చేశారు. ఈ మోసంపై ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ స్కాంలో దాదాపు ఆరు వేలకు పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. -
‘కరక్కాయ’ను పట్టించుకోరా..?
సాక్షి, సిటీబ్యూరో: కరక్కాయల పొడి పేరుతో జరిగిన చీటింగ్ కేసును ఛేదించిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు బాధితులకు న్యాయం చేయడంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసిన సమయంలో 81 టన్నుల కరక్కాయలు నిల్వచేసిన కేపీహెచ్‌బీలోని గోదాంను సీజ్ చేసిన పోలీసులు ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నెల్లూరు జిల్లా, అంబపురంకు చెందిన ముప్పల మల్లికార్జునతో పాటు దేవ్‌రాజ్ అనిల్‌కుమార్, జగన్మోహనరావు, గుండపనేని సురేంద్ర, చిరంజీవి రెడ్డిలను గత నెల 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.40,95,000 నగదును కోర్టులో డిపాజిట్ చేశారు. ఈ సమయంలో కరక్కాయల విషయమై కోర్టు దృష్టికి తీసుకెళ్లగా వేలం వేసి వచ్చిన డబ్బులను కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయినా ఇప్పటివరకు ఆ దిశగా సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కరక్కాయలు కొద్దిరోజుల పాటే నిల్వ ఉంటాయని, ఇప్పటికైనా వాటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంచాలని కోరుతున్నారు. మా డబ్బులు ఇప్పించండి... కరక్కాయల పొడి వ్యాపారం ప్రారంభంలో పెట్టుబడులు పెట్టిన వారికి రూ.1,000లకు రూ.300 కలిసి రూ.1300లు చెల్లించారు. దీంతో కొందరు ఏకంగా రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టగా, మరో రూ.30 లక్షలు కలిసి రూ.1.20 కోట్లు చెల్లించారు. దీంతో అతను రెండోసారి రూ.60లక్షలు పెట్టుబడి పెట్టాడు. మిగతావారు కూడా తొలిసారి డబ్బులు తిరిగి ఇవ్వడంతో నమ్మకం పెరిగి లబ్దిదారులు మరికొంత మందిని చేర్చారు. కొందరు తమ బంధువులను సైతం ఈ ఊబిలోకి లాగారు. చివరకు తమ కంపెనీలో పనిచేసే సిబ్బందితో కూడా పెట్టుబడులు పెట్టించారు. ఇలా 650 మంది మోసపోయారు. వీరిలో 500 మంది మహిళలు కావడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేదిక ఈ మోసం జరిగింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్న నిర్వాహకులకు నెల్లూరుకు చెందిన గుండపనేని సురేంద్ర, తిన్నలూరు మహే శ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నోటి చిరంజీవి రెడ్డి సహకరించారు. అయితే తమ డబ్బులు ఇవ్వడం లేదని నలుగురు వ్యక్తులు కేపీహెచ్‌బీ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు తెలియడంతో వీరు పరారయ్యారు. మహారాష్ట్ర, కర్ణాటక, పాండిచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాల్లో వీరికోసం గాలించిన పోలీసులు చివరకు కేపీహెచ్‌బీ ఠాణాలోని రాఘువేంద్రకాలనీలో ఆగస్టు 4న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వారు దొరికి తే మరికొంత నగదు స్వాధీనమయ్యే అవకాశముందని పోలీసులు చెబుతున్నా ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అయితే స్వాధీనం చేసుకున్న డబ్బులతో పాటు కరక్కాయలు అమ్మగా వచ్చిన డబ్బులను వెంటనే కోర్టు ద్వారా ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. -
కాపురాల్లో ‘కరక్కాయ’
సాక్షి, సిటీబ్యూరో: ‘ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుందంటూ ప్రకటనను చూసి ఆకర్షితురాలైన కేపీహెచ్‌బీకి చెందిన అరుణ జీవితం నిజంగానే మారిపోయింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చుననే ఆశపడిన ఆమెకు ‘కరక్కాయల పొడి’ రూపంలో డబ్బు పోవడమే కాకుండా ఆమె కుటుంబంలో కలతలు రేపింది. రూ. వెయ్యితో కిలో కరక్కాయలు కొనుగోలు చేసి పొడి చేసి ఇస్తే రూ.1300 వస్తున్నట్లు తెలియడంతో ఈ విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో దాదాపు 12 మంది అరుణ మాటలు విని కరక్కాయల పొడిలో పెట్టుబడి పెట్టారు. చివరకు సదరు కంపెనీ బిచాణా ఎత్తివేయడంతో డబ్బులు పోయిన బెంగలో ఉన్న ఆమెను బంధువుల మాటలు మరింత నొప్పించాయి. నీ కారణంగానే పెట్టుబడులు పెట్టామంటూ వారు గొడవకు దిగడంతో అరుణ, ఆమె భర్త మధ్య ఘర్షణకు దారి తీసింది. అరుణ ఒక్కరే కాదు..కరక్కాయల పొడి కేసులో మోసపోయిన దాదాపు 500 మంది మహిళల్లో 150 మంది మహిళల పరిస్థితి ఇదే. అయినవాళ్లే కదా వారూ లాభపడతారన్న ఉద్దేశంతో వీరు చెప్పిన మాటలు ఇప్పుడూ ఏకంగా వారిని బాధిస్తున్నాయి. ఓ వైపు డబ్బులు పోగా..మరోవైపు బంధువుల మాటలతో ఆవేదనకు లోనైన పలువురు మహిళలు సైబరాబాద్ పోలీసులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేపీహెచ్బీలో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐఎంటీ) పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి పలు కంపెనీలు ఆయుర్వేద మందుల్లో కరక్కాయల పొడిని వినియోగిస్తారని ప్రచారం చేశారు. బేగంపేటలో కిలోకు కేవలం రూ.38కి కొనుగోలు చేసిన కరక్కాయలను ఏకంగా రూ.వెయ్యికి అమ్మి పౌడర్‌గా చేసి తిరిగిస్తే రూ.1300 ఇస్తామంటూ 650 మందిని మోసగించిన నెల్లూరు జిల్లా అంబపురంకు చెందిన ముప్పల మల్లికార్జున ముఠాను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంతో తమ డబ్బులు వస్తాయన్న ఆశతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ ఘటన నుంచైనా ప్రజలు మారాలని పోలీసులు కోరుతున్నారు. విద్యావంతులు సైతం ఈ మోసంలో చిక్కుకోవడం దారుణమని డబ్బుపై ఉన్న ఆశను వెల్లడిస్తోందని, దీనినే నేరగాళ్లు ఆసరాగా చేసుకొని టోపీ పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు. సులువుగా డబ్బులు రావు... డబ్బులు సులభంగా సంపాదించేందుకు షార్ట్‌కట్ మార్గాలు ఉండవు. ఎవరైనా ఇలాంటి ప్రకటనలు ఇస్తే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి. మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారంలో చాలా మంది మహిళలే బాధితులుగా ఉంటున్నారు. బంధువులను కూడా ఆయా స్కీమ్‌ల్లో చేర్పిస్తున్నందున కుంటుంబాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. ఎంఎల్ఎం కంపెనీలు, పొంజి స్కీమ్‌లు, చిట్స్, డిపాజిట్ కంపెనీలు నమ్మశక్యం కాని ఆఫర్లు ఇస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా వాటిని ఆదిలోనే అరికట్టవచ్చు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
కరక్కాయల స్కాం ప్రధాన నిందితుడు అరెస్ట్
-
కరక్కాయ స్కాం.. నిందితుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన మల్లిఖార్జున్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 44 లక్షల రూపాయలతో పాటు కరక్కాయ సంచులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించింది విషయం తెలిసిందే. గతనెల 16న కేపీహెచ్‌బీ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కరక్కయ పొడి చేసి ఇస్తే అధిక మొత్తం చెల్లిస్తామంటూ దగా చేసిన నిందితులు కోట్ల రూపాయలను దండుకున్న విషయం తెలిసిందే. ఈ స్కాంలో 10 కోట్లకు పైగా మోసం జరిగిందని సీపీ వెల్లడించారు. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. -
కరక్కాయల స్కామ్.. ఢిల్లీ ముఠా..!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కరక్కాయల పొడి వ్యాపారం పేరుతో ప్రజలను నమ్మించి పరారైన మోసగాళ్ల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ కరక్కాయల స్కామ్‌లో బాధితుల సంఖ్య పెరుగుతోందని సమాచారం. దాదాపుగా రూ. 10కోట్ల స్కామ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మల్లికార్జున్ కోసం ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ స్కాంలో కీలక నిందితుడు దేవరాజ్ హరిరాజ్ ఢిల్లీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవారాజ్ హరిరాజ్ స్వస్థలం నెల్లూరు. ఈ స్కామ్‌లో దేవరాజ్, మల్లికార్జునల వెనుక ఢిల్లీకి చెందిన ముఠా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నెల్లూరు, బెంగళూరులో అతని కోసం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజల డబ్బుతో మల్లికార్జున్ కుటుంబంతో సహా పరారయ్యాడు. కంపెనీ అకౌంట్ నుంచి డబ్బులు మొత్తం డ్రా చేసినట్లు గుర్తించారు. నిందితుడు మల్లికార్జున్ విదేశాలకు పారిపోకుండా అన్ని విమానాశ్రయాలకు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం. -
తెలుగు రాష్ట్రాల్లో భారీగా కరక్కాయ స్కాం బాధితులు
-
కోట్ల రూపాయలకు చేరిన కరక్కాయల కుంభకోణం
-
చెల్లించి..వంచించి..!
కేపీహెచ్‌బీకాలనీ: కరక్కాయపొడి పేరుతో వందలాదిమందికి టోకరా వేసిన ‘సాప్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్స్ ప్రైవేటు లిమిటెడ్’ సంస్థ యజమాని మాటూరి దేవరాజు అనిల్‌కుమార్ పథకం ప్రకారమే రూ. కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. పెట్టుబడులు పెట్టిన వినియోగదారులతో పాటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిణులతో పదోన్నతులు, ప్రోత్సాహకాల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ యజమాని అందులో పనిచేస్తున్న ఉద్యోగిణులకు కూడా మొఖం చూపించకుండా జాగ్రత్త పడటం, మేనేజర్, కిందిస్థాయి ఉద్యోగిణులకు అన్ని కార్యకలాపాలు అప్పగించడం ఇందులో భాగమేనని పేర్కొంటున్నారు. కరక్కాయలను కొనుగోలు చేసి మోసపోయిన బాధితులు మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ఫిర్యాదు చేశారు. రూ. వేలల్లో ఎర..రూ.కోట్లల్లో టోకరా సంస్థను స్థాపించిన ఆరు నెలల వ్యవధిలో మొదటి మూడు నాలుగు నెలల పాటు డబ్బులను తిరిగి చెల్లించిన సంస్థ ప్రతినిధులు జూన్, జులై మాసాల్లోనే రూ.లక్షల్లో డిపాజిట్ల రూపంలో సేకరించారు. చివరి నెలరోజుల్లోనే రూ.కోట్లతో ఉడాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన మహిళలకు మొదట్లో డబ్బులు తిరిగి చెల్లించి వారు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేలా ప్రోత్సహించారు. దీంతో పలువురు రూ.లక్షలు చెల్లించి క్వింటాల కొద్ది కరక్కాయలను కొనుగోలు చేశారు. పలువురి వద్ద డబ్బులు తీసుకొని కరక్కాయలను కూడా ఇవ్వలేదని సమాచారం. వరంగల్ జిల్లా, పోచమైదాన్ ప్రాంతానికి చెందిన మహిళలు, పొదుపు సంఘాలు భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు తెలిపారు. వారు కరక్కాయ పొడిని సైతం తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అప్పులు చేసి కరక్కాయలు కొన్నామని, పోలీసులే తమను ఆదుకోవాలని బాధిత మహిళలు యాకూబీ, అక్తర్‌బీ, అసియా, సాబేరా, అహ్మదీ, మహాబూబీ, రెహానాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఆకర్షనీయమైన ప్రకటనలు ఇవ్వడంతో పలువురు నిరుద్యోగ యువతులను ఉద్యోగానికి కుదుర్చుకోవడంలోనే కుట్ర దాగిఉందని పోలీసులు పేర్కొంటున్నారు. ముందస్తు శిక్షణ, ప్రాథమిక దశల పేరుతో ఉద్యోగినులను కరక్కాయ పొడి కొనుగోలు, విక్రయాలకు ప్రోత్సహించినట్లు సమాచారం. తమతోనూ పెట్టుబడులు పెట్టించినట్లు ఉద్యోగిణులు వాపోయారు. పథకం ప్రకారం ఉద్యోగిణుల సెల్నెంబర్లనే మోసాలకు వాడుకోవడం, వారి ద్వారానే పెట్టుబడులు రాబట్టడం గమనార్హం. ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీసులు ప్రత్యేకంగా రెండు కౌంటర్లను ఏర్పాటుచేసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆన్లైన్ యాడ్స్ పేరుతో మరో మోసం.... ఇంటివద్దనే రూ.పదివేలకు పైగా సంపాదించవచ్చునని పైన్మిత్రా ఆన్లైన్ సంస్థ ద్వారా యాడ్స్ ప్రమోషన్ పేరుతో ఒక్కో ప్రకటనకు రూ. 3వేలు వసూలు చేసి వాటిని ఆన్లైన్ మాద్యమాలలో పోస్టు చేసిన వారికి రోజుకు రూ.100 చొప్పున చెల్లిస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మవాణి అనే మహిళ రూ. 2లక్షలు మోసపోయినట్లు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పైన్ మిత్రా సంస్థపై కేసులు నమోదు చేశారు. పరారీలో నిందితులు.... యజమాని మూడు రోజులుగా అందుబాటులో లేకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో మేనేజర్ మల్లిఖార్జున్ కూడా కిందిస్థాయి ఉద్యోగులకు సమాచారం ఇచ్చి రెడ్ బస్ యాప్‌లో నెల్లూరుకు టికెట్ బుక్ చేసుకొని పరారైనట్లు తెలిసింది. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు బాధితులకు సమాచారం ఇచ్చి పోలీసుల వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్, మేనేజర్ మల్లిఖార్జున్ ఆచూకీ కనిపెట్టేందుకు కేసును సైబరాబాద్ ఆర్ధిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ఇటీవల సదరు విభాగానికి బదిలీ అయిన కేపీహెచ్‌బీ అదనపు సీఐ గోపీనా«థ్ దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు. -
కేపీహెచ్‌బీ కాలనీలో ఘరానామోసం
-
కరక్కాయలకు 40లక్షలు చెల్లించాడు..!
కేపీహెచ్‌బీకాలనీ: కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్లల్లో వసూలు చేసి ఉడాయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం కేపీహెచ్‌బీ సీఐ కుషాల్కర్ వివరాలు వెల్లడించారు. కేపీహెచ్‌బీకాలనీ రోడ్డునెంబర్ 1లోని ఎంఐజి 1–165లో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ వెలిసింది. ఆయుర్వేద మందుల తయారీకిగాను కరక్కాయ పొడిని కొనుగోలు చేస్తున్నట్లు, ఇంటివద్ద ఉండే మహిళలు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోవచ్చునని పలు టీవీ చానళ్లలో 6309390734 ఫోన్ నంబర్‌తో సహా ప్రకటనలు ఇచ్చారు. దీంతో పలువురు సదరు నంబర్‌ను సంప్రదించగా కరక్కాయలను తామే అందిస్తామని కిలో కరక్కాయలకు రూ. వెయ్యి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, పొడిగా మార్చి తీసుకువస్తే అదనంగా రూ.300 లాభం కలిపి మొత్తం 1300 ఇస్తామని తెలిపారు. పొడి రూపంలో తీసుకు వచ్చిన కొందరికి రూ.1300 చొప్పున చెల్లించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మధ్య తరగతి ప్రజలు ఏక మొత్తంగా డిపాజిట్లు చేసి కరక్కాయలను కొనుగోలు చేశారు. సంస్థ మేనేజర్ ముప్పాల మల్లిఖార్జున్ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన వారికి అగ్రిమెంట్ల రూపంలో రసీదులు సైతం ఇచ్చాడు. దీంతో అనేక మంది లక్షలు చెల్లించి కరక్కాయలను కొనుగోలు చేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరుకుల బస్వరాజ్ అనే వ్యక్తి మొదట్లో రెండు వేలు వెచ్చించి రెండు కిలోల కరక్కాయలను కొనుగోలు చేశారు. అనంతరం పొడిగా మార్చి తీసుకురావడంతో అతనికి రూ.2600 ఇచ్చారు. దీనికితోడు సంస్థ పలు ఆఫర్లను ప్రకటించడం, డోర్ డెలివరీ పేరుతో సేవలను ప్రకటించడంతో అనేక మంది ఇళ్ల వద్ద ఉండే డిపాజిట్లు చెల్లించి కరక్కాయలను ఇళ్లవద్దకే తెప్పించుకున్నారు. బస్వరాజ్ అతని స్నేహితులు సుమారు రూ.40లక్షలు చెల్లించి కరక్కాయలను తీసుకొని పొడిగా మార్చి తీసుకువచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం అతడికి సోమవారం డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంది. ఉదయం సంస్థ హెచ్ఆర్ మేనేజర్ ప్రసన్న అతడికి ఫోన్‌చేసి తమ సంస్థలో కీలక పాత్రధారి మల్లిఖార్జున్ ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఉందని, అతను అందుబాటులో లేడని తెలిపింది. బాధితులు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ సమాదాధానం చెప్పేవారు లేకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.5కోట్లకు పైగా వసూలు చేసిన సంస్థ ప్రతినిధులు ఉడాయించారని బాధితులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు స్వీకరించిన సీఐ కుషాల్కర్ ఉన్నతాధికారుల సూచనమేరకు అదనపు ఇన్స్పెక్టర్ గోపీనా«థ్‌కు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. -
కేపీహెచ్బీలో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. డబ్బు ఆశ చూపి అమాయకులను వంచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‌బీ)లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కరక్కాయల పేరుతో అమాయలకు టోపీ పెట్టారు. కోట్లలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. కేపీహెచ్పీ రోడ్డు నంబర్‌వన్‌లో జరిగిన ఈ ఘరానా మోసం గురించి పోలీసులకు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేయాలంటూ సోమవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సాప్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్ ప్రైవేటు లిమిటెడ్ (ఎస్ఐఎంటీ) అనే సంస్థ కరకాయను తీసుకెళ్లి పౌడర్ చేసి అప్పగిస్తే వేయికి మూడు వందలు లాభం ఇస్తామంటూ స్థానికులను నమ్మించింది. యూట్యూబ్, యాప్‌లలో ప్రచారం చేసింది. కేజీ కరక్కాయలు వెయ్యి రూపాయలు చెల్లించి తీసుకెళ్లాలని నిబంధన పెట్టింది. మూడు వందలు లాభం వస్తుందన్న నమ్మకంతో చాలా మంది వేల రూపాయలు చెల్లించి భారీ మొత్తంలో కరక్కాయలు కొనుగోలు చేశారు. పొడి చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లేందుకు సదరు కంపెనీ ముందుకు రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. తమ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి వారు బిచాణా ఎత్తివేసినట్టు తెలియడంతో బాధితులు హతాశులయ్యారు. తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. వంచనకారులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. లక్షల్లో డబ్బులు కట్టాం.. కేజీ కరక్కాయ తీసుకెళ్లి పొడి చేసి ఇస్తే 1300 ఇస్తామని నమ్మించారని బాధితురాలు ఒకరు మీడియాతో చెప్పారు. తమతో పాటు తమ బంధువులు కూడా లక్షల్లో డబ్బులు కట్టి మోసపోయామని వాపోయారు. తమను నమ్మించేందుకు మొదటి 15 రోజులు డబ్బులు బాగానే ఇచ్చారని తర్వాత నుంచి పత్తా లేకుండా పోయారని తెలిపారు. కరక్కాయ పొడికి ఆయుర్వేదంలో మంచి డిమాండ్ ఉందని, దీనికి సంబంధించిన యాడ్స్ యూట్యూబ్ పోస్ట్ చేస్తే డబ్బులు ఇస్తామని కూడా మోసానికి పాల్పడ్డారని మరో బాధితుడు వెల్లడించారు. -
కేపీహెచ్బీలో కోట్లలో మోసం..