సాక్షి, పట్నంబజారు(గుంటూరు): ఆర్టీసీ బస్సులో మహిళ చేతివాటం ప్రదర్శించిన ఘటన మంగళవారం జరిగింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఆర్టీసీ బస్ కండక్టర్ కేబీ పరమానందం తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల డిపోకు చెందిన బస్సు మంగళవారం చేబ్రోలు చేరుకుంది. కండక్టర్ పరమానందం పక్కనే ఓ మహిళ నిలబడి ఉంది. చేబ్రోలు నుంచి నారాకోడూరు వరకు వచ్చే లోపల కొన్ని టిక్కెట్లు కొట్టిన ఆయన చిల్లర కోసం నగదు తీసుకుని ప్రయాణికులకు ఇచ్చారు.
నారాకోడూరు నుంచి బస్సు బయలుదేరిన తర్వాత మరికొంత మంది ఎక్కటంతో టిక్కెట్లు ఇచ్చి బ్యాగును తెరవటంతో నగదు కనిపించలేదు. ఉలిక్కిపడ్డ కండక్టర్ పరమానందం ప్రయాణికులను నగదు విషయం అడిగారు. ఎవరిలోనూ స్పందనలేదు. అయితే ఒక మహిళ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో కండక్టర్, డ్రైవర్లు నిలదీశారు. ఈ క్రమంలో ఆమె చీరలో నుంచి నగదు కిందపడటాన్ని గమనించి, మహిళ తీసిందని నిర్ధారణకు వచ్చారు.
నేరుగా బస్సును స్టేషన్‌కు తీసుకెళ్లారు. సదరు మహిళను విచారించిన పాతగుంటూరు పీఎస్ ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఆమె పేరు మరియమ్మ అని చెబుతోందని, అయితే అదీ కూడా సరైన పేరు అయి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సదరు మహిళను సీసీఎస్ పోలీసులకు అప్ప గించారు. కేసు చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సదరు మహిళ నుంచి కండక్టర్ రూ.17,400 స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment