గుండయ్య, రేణుకమ్మ మృతదేహాలు
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో ఓ ప్రేమ జంట విషం తాగి అత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. దేవదుర్గ సీఐ సంజీవ కుమార్ చెప్పిన వివరాలు..దేవదుర్గ తాలూకాలోని సముద్ర గ్రామానికి చెందిన రేణుకమ్మ(28) అనే మహిళకు వివాహమై భర్త, ఇద్దరు సంతానం ఉన్నారన్నారు. అయితే ఆమె అదే గ్రామానికి చెందిన గుండయ్య(22) అనే యువకుడి తో అక్రమ సంబంధం కలిగి ఉండేదన్నారు. ఈక్రమంలో ఏం జరిగిందో తెలియదు కాని రేణుకమ్మ, గుండయ్యలు మనస్తాపం చెంది బుధవారం రాత్రి పొలంలోకి వెళ్లి క్రిమి సంహారక మందు తాగి ఆ త్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటనపై జాలహళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమో దు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్న ట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment