నువ్వు లేక నేను లేను.. | lovers committed to suicide in warangal district | Sakshi
Sakshi News home page

ప్రేమికుల ఆత్మహత్య

Published Fri, Jan 19 2018 12:37 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

lovers committed to suicide in warangal district - Sakshi

సాక్షి, నర్సంపేట : ప్రేమను పెద్దలు కాదంటారేమోనని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో గురువారం రాత్రి జరిగింది. ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన షేక్‌ మహబూబీ–సలీంపాషా  కుమార్తె నజ్మీన్‌(23) వరంగల్‌లోని ఓ కళాశాలలో పీజీ పూర్తి చేసింది. దుగ్గొండి మండలం రేకంపల్లికి చెందిన కొలుగూరి భాస్కర్‌–నిర్మల కుమారుడు కొలుగూరి భరత్‌(25) డిగ్రీ పూర్తి చేశాడు.

భరత్‌ నర్సంపేటలోని మేనమామల వద్ద ఉంటూ కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్నాడు. నజ్మీన్‌ ఆ ఇనిస్టిట్యూట్‌లో చేరడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో నజ్మీన్‌కు ఈ నెల 22న నిశ్చితార్థం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో  ఈ నెల 17న నజ్మీన్‌ ఇనిస్టిట్యూట్‌కు వచ్చింది. ఇద్దరు కలసి పురుగుల మందు తాగారు.

భరత్‌  మేనమామకు ఫోన్‌ చేసి ‘ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిగేలా లేదు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’అని చెప్పాడు. వారు వచ్చేసరికి అపస్మారస్థితిలో ఉన్న ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నజ్మీన్‌ను వరంగల్‌ ఆస్పత్రికి తరలించగా, స్థానిక ఆస్పత్రిలో భరత్‌ గురువారం మృతి చెందాడు. వరంగల్‌ ఆస్పత్రిలో నజ్మీన్‌ చనిపోయింది. ఏ మందు తాగితే త్వరగా చనిపోతామో ఇంటర్నెట్‌లో వెతికి తాగినట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement