ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన సన్ని
కేపీహెచ్‌బీ కాలనీ : మానసికంగా తీవ్ర ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఇంట్లోని కుటుంబీకులతో తగాదా పడటంతో పాటు ఎవరూ లేని సమయంలో అద్దాలు పగులగొట్టి చేతికి, తలపై గాయాలు చేసుకోని భవనంపై నుంచి దూకి చనిపోతానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కూకట్‌పల్లి ఫైర్‌స్టేషన్ సిబ్బందితో కలిసి నిచ్చెన ద్వారా ఇంట్లోకి ప్రవేశించి అతనిని అదుపులోకి తీసుకున్నారు.అదనపు సీఐ గోపీనాధ్ తెలిపిన మేరకు.. కేపీహెచ్‌బీకాలనీలోని ఎల్‌ఐజి గృహాల్లోని బహుళ అంతస్థుల భవనంలో నివాసం ఉండే సన్ని(26) బీటెక్ పూర్తిచేశాడు. శనివారం ఉదయం నుంచి తల్లిదండ్రులతో గొడవ పడటంతో వారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు.
దీంతో మరింత మానసిక ఆందోళనకు గురై ఆగ్రహంతో ఇంటికి అమర్చిన అద్ధాలను పగులగొట్టడంతో పాటు వాటితో చేతిపైన, తలపై గాట్లు పెట్టుకున్నాడు.భవనంపై నుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. రెండవ అంతస్తు నుంచి పగిలిన అద్ధాలు, రక్తం పడటంతో స్థానికులు విషయం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. కేపీహెచ్‌బీ అదనపు సీఐ గోపీనాద్, ఎస్‌ఐ రాజుయాదవ్‌లు అక్కడికి చేరుకొని ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా ఇంటిలోపలివైపు నుంచి తాళం వేసి ఉంది. దీంతో వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని నిచ్చెన ద్వారా ఇంట్లోకి ప్రవేశించి సన్నిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సన్ని మానసిక స్థితి సరిగాలేకపోవడమే కారణమని కుటుంబీకులు, స్థానికులు చెప్పడంతో పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment