అమ్మాయితో ఇంత రాత్రి పూట ఎక్కడికి?.. | Man Assassinated Over Taking Wife Late Night Walk In Punjab | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి భార్యతో రోడ్డుపై వెళుతుండగా..

Published Thu, Jun 25 2020 11:07 AM | Last Updated on Thu, Jun 25 2020 11:25 AM

Man Assassinated Over Taking Wife Late Night Walk In Punjab - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చంఢీగఢ్‌ : అర్థరాత్రి వేళ భార్యతో కలిసి రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు ఇ‍ద్దరు. ఈ సంఘటన పంజాబ్‌లోని పటియాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన మిథున్‌ పాటేల్‌ అనే వ్యక్తి పటియాలలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని భార్య, తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు. సోమవారం అర్థరాత్రి సమయంలో భార్యతో కలిసి సమీపంలోని గురుద్వారా దుఖ్‌ నివారణ్‌ సాహిబ్‌కు బయలు దేరాడు. అయితే మార్గం మధ్యలో వీరిని గమనించిన జగ్‌మోహన్‌ సింగ్‌, భూపేందర్‌ సింగ్‌ అనే ఇద్దరు అడ్డగించారు. ‘అమ్మాయితో కలిసి ఇంత రాత్రి పూట ఎక్కడికి?’ అని ప్రశ్నించారు. (గుత్తిలో భగ్గుమన్న పాత కక్షలు)

ఆమె తన భార్య అని, దగ్గరలోని గురుద్వారాకు వెళుతున్నామని మిథున్‌ సమాధానం ఇచ్చాడు. అయితే అతడి మాటలు నమ్మని వారు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి మిథున్‌ను బాటిల్‌తో దాడి చేశాడు. అనంతరం ఇద్దరూ కలిసి అతడిని రాళ్లు, ఇటుకలతో కొట్టారు. తీవ్ర గాయాలపాలైన మిథున్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ( కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement