సీతానగరం (రాజానగరం): సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను నమ్మిన ఓ వ్యక్తి రూ.3,83,700 పోగొట్టుకున్నారు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని చినకొండేపూడికి చెందిన ముదునూరి రామరాజుకు క్లిప్‌కార్ట్ కంపెనీ నుంచి తన సెల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. స్విఫ్ట్ కారు లాటరీలో వచ్చిందని, జీఎస్టీ కడితే కారు మీ సొంతం చేసుకోవచ్చునని మెసేజ్‌లో ఉంది. అది నిజమేనని నమ్మిన రామరాజు జీఎస్టీ కట్టడానికి సన్నద్ధమయ్యాడు. దీంతో అకౌంట్ నంబర్ మెసేజ్ ద్వారా వచ్చింది. పలు దఫాలుగా రూ. 3,83,700 ఆ అకౌంట్‌లో వేశాడు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment