ramaraju
-
‘ఉండి’ టీడీపీ టికెట్: ఎమ్మెల్యే రామరాజు కంటతడి
సాక్షి,పశ్చిమగోదావరి: తన నియోజకవర్గం నుంచి వేరొకరికి టీడీపీ టికెట్ ఇస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి పెట్టారు. మంగళవారం(ఏప్రిల్9) కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం అనంతరం రామరాజు మీడియాతో మాట్లాడారు. ‘నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ కేటాయించేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా. వారే నా కుటుంబ సభ్యులు..వారు చెప్పినట్టు చెస్తా. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా’ అని రామరాజు చెప్పారు. ‘ఉండి’ సీటుపై టీడీపీ శ్రేణుల్లో అయోమయం ఉండి నుంచి కాకుండా ఎమ్మెల్యే రామరాజుకు మరో చోట టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళనకు ఆందోళనకు దిగింది. రామరాజు సీటు మార్చొద్దంటూ కార్యకర్తలు నిరసన తెలిపారు. కాగా, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రఘురామకృష్ణం రాజు పోటీచేస్తారని ఇటీవల పాలకొల్లు ప్రచారంలో చంద్రబాబు ప్రకటించడంతో రామరాజు వర్గంలో టెన్షన్ మొదలైంది. ఇదీ చదవండి.. మూడు ముక్కలైన ఉండి టీడీపీ -
రఘు రామ చేసిన పనికి సొంత పార్టీ నేతలతో అవమానాల పాలైన బాబు
-
టీడీపీ తనను గుర్తించలేని ఆవేదన వ్యక్తం చేసిన శివరామరాజు
-
టీడీపీలోనే ‘ఉండి’... రాజుల రగడ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ తెలుగుదేశంలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుపాకాన పడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజుకు లోకేశ్, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు చంద్రబాబు కొమ్ముకాస్తుండటంతో వారిద్దరి సిగపట్లు పత్రికలకెక్కుతున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు వేటుకూరి శివరామరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అనుచరుడుగా గుర్తింపు పొందిన మంతెన రామరాజుకు 2019లో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. అయితే అనుకోకుండా రాజకీయ సమీకరణాలు మారడంతో శివరామరాజు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా, రామరాజు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎంపీ అభ్యర్థి ఓడిపోగా, ఆయన శిష్యుడు మాత్రం ఎమ్మెల్యేగా గెలవడంతో రాజకీయ రగడకు బీజం పడింది. కార్యాలయం సాక్షిగా వర్గపోరు భీమవరంలోని ఒకే కార్యాలయంలో ఉండే ఈ ఇద్దరు రాజుల మధ్య వర్గపోరు ఇటీవల మరింత తీవ్రమైంది. తనకు ప్రాధాన్యమివ్వకుండా... కార్యక్రమాలకు పిలవకుండా... తనను అసలు పట్టించుకోకుండా మంతెన అవమానిస్తున్నాడని ఆయన్ను కార్యాలయం నుంచి వేటుకూరి ఖాళీ చేయించి పంపేశారు. అదిగో అప్పటినుంచే విభేదాలు బహిర్గతమయ్యాయి. తాజాగా చంద్రబాబు తనకు టికెట్ హామీ ఇచ్చారని వేటుకూరి శివరామరాజు ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో తన వర్గంతో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా... మంతెన రామరాజు టికెట్ తనకే ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చినట్టు క్యాడర్‌కు చెప్పుకుంటూ ఇటీవలే నియోజకవర్గమంతా కంచాలు పంపిణీ చేశారు. విమర్శల వివాదం గత వారం మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కొన్ని మీడియా ఛానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ ఎమ్మెల్యే రామరాజుపై విమర్శలు గుప్పించారు. 2019లో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వమని చంద్రబాబు వద్దకు తీసుకువెళితే 10వ తరగతి కూడా పాస్ కాని వాడికి ఎంపీ ఏంటి.. అని ఎద్దేవా చేశారనీ, అందువల్ల తాను ఎంపీగా పోటీచేసి, అతనికి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిపించుకున్నాననీ ఇప్పుడు ఆయన విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యే రామరాజు వర్గం రెచ్చిపోయింది. పార్టీ మండల అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొందరు ఉండిలో సమావేశం నిర్వహించి వేటుకూరి నియోజకవర్గానికి ఏం చేశాడు.. బీసీలకు ఏం చేశాడు.. అసలు ఆయన అభ్యర్థే కాదు.. అసలు టికెట్ ఇస్తామని ఆయనకు ఎవరూ చెప్పలేదని ఎదురు దాడి చేయడంతో రగడ తారస్థాయికి చేరింది. టీడీపీ టికెట్ నాకే... ఆకివీడు : ఉండి టీడీపీ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం తన సేవా సంస్థ తలుపులు తెరిచి నియోజకవర్గంలో తన సత్తా చూపిస్తానని విలేకర్లకు వివరించారు. తనకు చెందిన శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు శుక్రవారం శాంతి హోమం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సహకారంతో పోటీ చేయడం తథ్యమని ఘంటాపథంగా చెప్పారు. -
‘ఉండి’ టీడీపీలో నువ్వా? నేనా?
ఉండి: పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశానికి కంచుకోటగా చెప్పుకొనే ఉండి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు రోడ్డెక్కాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఉండి రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఉన్న టీడీపీ మండల కార్యాలయం ముందు ఆదివారం టీడీపీ నాయకులు నిరసనదీక్ష చేపట్టారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొని శ్రేణులను ఉత్సాహపరుస్తూ వారితో నిరసనకు దిగారు. అనంతరం శిబిరంలోకి ఎమ్మెల్యే రామరాజు వచ్చారు. కొద్దిసేపటి తరువాత మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆ శిబిరానికి పక్కనే మరో శిబిరం ఏర్పాటు చేయించి అందులో కూర్చుని నిరసన చేపట్టారు. దీంతో ఆయన అనుచరులు కూడా ఆ శిబిరంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల విభేదాలు మరోసారి రోడ్డెక్కడంతో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. చాలామంది మాజీ ఎమ్మెల్యే శివరామరాజు శిబిరంలోకి చేరి ఆయనకు మద్దతు తెలపడంతో విభేదాలు మరింత పెరిగాయి. ఈ మధ్యకాలంలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకునేందుకే టీడీపీ నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుగానీ వారికి చిత్తశుద్ధి లేదంటూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రస్తుత ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దూషణలకు దిగారు. ఉండి టీడీపీ కంచుకోటకు బీటలువారాయని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. -
గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు
పుత్తూరు రూరల్ (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తూ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం దొరికిపోయారు. వారిలో ఒకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరితోపాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్చార్జి డీఎస్పీ రామరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పుత్తూరు పట్టణంలోని స్వర్ణా హౌసింగ్ కాలనీలో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ లక్ష్మీనారాయణ అక్కడికి సిబ్బందితో వెళ్లారు. ముళ్ల పొదల మధ్యలో 8 మంది గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకోబోగా, ఆరుగురు దొరికారు. మరో ఇద్దరు పరారయ్యారు. అరెస్టయిన వారిలో నాగలాపురం మండలం వినోబానగర్‌కు చెందిన ఎ.విజయభాస్కర్ (22), నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కె.యూకేష్ (21), పుత్తూరుకు చెందిన కాశీం మస్తాన్ (29), టి.సందీప్‌కుమార్ (27), సి.ఎం.శరవణ (35), బి.ఎస్.హరికృష్ణ అలియాస్ హరి (30) ఉన్నారు. వీరి నుంచి రూ.2.52 లక్షలు విలువ చేసే 21.05 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అరకుకు చెందిన వెంకటేష్ వద్ద గంజాయిని కొని పుత్తూరులో విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో తెలిపారు. పరారైన మోనిష్, బాలుతో పాటు అరకుకు చెందిన వెంకటేష్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. గంజాయి విక్రేతలపై పీడీ యాక్టు పెట్టేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. గతంలోనూ అరెస్టయిన హరికృష్ణ అరెస్టయిన వారిలో హరికృష్ణ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో పుత్తూరు పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. శరవణ ప్రస్తుతం టీడీపీ పుత్తూరు పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు. గత ఏడాది జనవరి 10న విజయనగరం జిల్లా కాపుసోంపురం వద్ద 28 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో హరికృష్ణ రెండో నిందితుడు. అదే రోజు అరెస్టయిన వారిలో మరో టీడీపీ నాయకుడు హేమంత్ మూడో నిందితుడు. ఆ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన హరికృష్ణ మరోసారి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. -
మెసేజ్‌ను నమ్మి.. రూ.3.83 లక్షలు పోగొట్టుకొని..
సీతానగరం (రాజానగరం): సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను నమ్మిన ఓ వ్యక్తి రూ.3,83,700 పోగొట్టుకున్నారు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని చినకొండేపూడికి చెందిన ముదునూరి రామరాజుకు క్లిప్‌కార్ట్ కంపెనీ నుంచి తన సెల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. స్విఫ్ట్ కారు లాటరీలో వచ్చిందని, జీఎస్టీ కడితే కారు మీ సొంతం చేసుకోవచ్చునని మెసేజ్‌లో ఉంది. అది నిజమేనని నమ్మిన రామరాజు జీఎస్టీ కట్టడానికి సన్నద్ధమయ్యాడు. దీంతో అకౌంట్ నంబర్ మెసేజ్ ద్వారా వచ్చింది. పలు దఫాలుగా రూ. 3,83,700 ఆ అకౌంట్లో వేశాడు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశాడు. -
భవన విజయం
ఓ ఇంట్లో పూలు పూసే మొక్కలు, కాయలు కాసే చెట్లను చూసుంటాం. ఇంకో ఇంట్లో పిట్టలో, పెంపుడు జంతువులనో చూసుంటాం. మరో చోట ఆకుకూరలతో ‘ఇంటి’ పంట చూసుంటాం. ఇవన్నీ, మరికాసిన్ని ఒకేచోట చూడాలంటే... ఏ అడవికో పోనవసరం లేదు. యూసఫ్‌గూడ క ల్యాణ్నగర్లో ఉన్న ‘వనకుటీరం’ వెళ్తే చాలు! ఈ ఏడాది రాష్ట్రంలో నిర్వహించిన గార్డెన్స్ ఫెస్టివల్లో ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచిన టై గార్డెన్ అది. కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికులకు, పాఠశాల విద్యార్థులకు దర్శనీయ స్థలం కూడా. ..:: ఎస్.సత్యబాబు ఈ వన కుటీరం సృష్టికర్త రామరాజు. భీమవరం సమీపంలోని కాళ్లకూరు గ్రామానికి చెందిన రామరాజు బాల్యం పచ్చని పంటలు, ప్రకృతి నీడలో సాగింది. కాలక్రమంలో కాంక్రీట్ జంగిల్‌కు వల సొచ్చినా.. పూలు, ముచ్చటైన మొక్కలు, వన్యప్రాణులతో తిరిగి దోస్తీ చేయాలనుకున్నారు. ఆ అభిరుచికి తన భవనాన్నే వేదిక చేసుకున్నారు. కల్యాణ్‌నగర్ మూడో ఫేజ్‌లో, తోడల్లుడితో కలసి తాను కట్టుకున్న ఇంటిలోని కొంచెం స్థలంలో వనకుటీరం ఏర్పాటు చేశారు. వ్యయప్రయాసలకోర్చి దానిని దినదిన ప్రవర్ధమానం అయ్యేలా చేస్తున్నారు. కూల్ అండ్ గ్రీన్... మామిడి, సపోటా, గంధం, మారేడు.. భిన్న రకాల చెట్లు ఆయన భవనానికి నాలుగు పక్కలా ఉంటాయి. ‘మాకు ఎండ తీవ్రత తెలీదు. మండే ఎండల్లో కూడా ఇంట్లో టెంపరేచర్ 32 డిగ్రీలు దాటదు’ అని చెప్పే రామరాజు రూమ్ టెంపరేచర్ కొలిచే సాధనం కూడా తనింట్లో ఏర్పాటు చేసుకున్నారు. మూడంతస్తుల భవనం టై మీద రామరాజు పరచిన పచ్చదనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. టై మీద ఒకటో రెండో కుండీలు పెట్టుకుని ఆనందించే రొటీన్ గార్డెనింగ్‌కు భిన్నంగా ఆయన తన మేడ మీద ఖాళీస్థలంలో అంగుళం వదలకుండా గ్రీనరీనిపరిచారు. ఎన్నెన్నో జాతులు.. రాత్రిపూట ఉదయించి, పొద్దునే అస్తమించే బ్రహ్మకమలం, ఎండాకాలంలో సూర్యోదయంతో పాటు విచ్చుకుని మధ్యాహ్నానికి మాయమయే కాక్టస్.. ఇలాంటి విశేషాలున్న మొక్కలు రామరాజు టైని అపురూపమైన గార్డెన్‌గా మార్చాయి. బోన్సాయి మర్రి, బోధి చెట్టు, రోడ్ డివైడర్స్‌కు మధ్యలో వేసే సైకస్లతో పాటు తీపి చింత, సీడ్లెస్ జామ, వెల్వెట్ బత్తాయి, ఆకుకూరలు, మట్టిలో ఊరే పెండ్లం, ఆల్స్పైస్ (మసాలా ఆకు), రెడ్ జింజిర్, ఆర్నమెంటల్ పైనాపిల్, విక్స్ ఆకు మొక్క, లవంగ, వాటర్ యాపిల్, పూలమొక్కలు... ఇలా 120 రకాల మొక్కలు పెంచుతున్నారు. దీనికి 1,600 చదరపు అడుగుల స్థలంపోగా మిగిలిన 200 చదరపు అడుగుల స్థలంలో చిన్న గది కట్టుకున్నారాయన. ప్లాన్డ్గా ప్లాంట్స్... భవనం పైభాగంలో మొక్కలు పెంచితే పడే బరువు ఏమేరకు ఉండవచ్చునో ఇంజనీరింగ్ నిపుణుల చేత ముందుగానే తనిఖీ చేయించారు రామరాజు. నీటికి కటకటలాడే నగరంలో, అదీ ఐదు కుటుంబాలు నివసించే చోట నీళ్ల సమస్య తప్పదు. తన గార్డెన్‌కు ఆ సమస్య రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. కృత్రిమ రసాయనాలు కాకుండా వెల్లుల్లిరసం, వేపనూనె లను స్వయంగా తయారు చేసి చీడపీడలకు విరుగుడుగా వాడుతున్నారు. గువ్వల కువకువ... తాబేళ్ల తమాషా... మొక్కలు పచ్చదనాన్ని అటుంచితే... ఈ టై గార్డెన్లో పిచ్చుకలు, పావురాల గూళ్లకు కొదవేలేదు. ‘ప్రకృతి అంటే కేవలం పచ్చదనం మాత్రమే కాదు. మరెన్నో జీవులు కూడా’అంటారు రామరాజు. ప్రత్యేకంగా ఒక సిమెంట్ తొట్టెనే పాండ్‌గా రూపొందించి అందులో చేపలు, తాబేళ్లను పెంచుతున్నారు. మేడ మీద లవ్‌బర్డ్స్‌తో పాటు పాల పిట్టలు, పావురాలు వగైరా 50 దాకా నివసించేలా ఒక గూడు సైతం ఏర్పాటు చేశారు. అతిథి దేవోభవ.. ప్రతి రోజూ ఈ ఇంటిని పెద్ద సంఖ్యలో పిచ్చుకలు పలకరిస్తుంటాయి. ఆ భ‘వనా’న విరిసే పూలమీద మకరందాన్ని తాగేందుకు తేనెటీగలు వస్తాయి. రెడ్ చెర్రీ మొదట పచ్చగా ఉంటుంది. ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. సరిగ్గా అది ఎరుపు రంగులోకి మారేటప్పటికి దాన్ని తినడానికి ఎవరో చెప్పినట్టు కోయిల వస్తుంది. రామరాజు చెర్రీపండుని కోసుకోరు. కోయిల రావడాన్ని, చెర్రీని తినడాన్ని సంతోషంగా చూస్తారు. ఉడతలు సైతం ఆయన వనానికి అతిథులే. అంతేకాదు... నెలకోసారైనా ఏదో ఒక స్కూల్ పిల్లలు ఆయన ఇంటికి చుట్టాలవుతారు. ఇక వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు, సిబ్బంది తరచుగా ఆయన తోటకు హాయ్ చెబుతూనే ఉంటారు. అందర్నీ ఆప్యాయంగా ఆహ్వానించి మర్యాదలు చేసే రామరాజు... తమ కాలనీలోని పిల్లలకు మొక్కల ప్రాధాన్యత గురించి వివరిస్తుంటారు. వారికి మొక్కల్ని బహుమతులుగా అందిస్తుంటారు. ప్రకృతి ఇచ్చిన వాటిని ఆహారంగా మార్చుకోవడం మాత్రమే కాదు ఆహ్లాదంగా ఆస్వాదించడం కూడా తెలిసిన వారాయన. అందుకే సాయంత్రాల్లో తన వనంలో టీ తాగుతూ సేదతీరుతారు రామరాజు.