మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
యాకుత్‌పురా : భార్యపై కోపంతో ఓ ఆటో డ్రైవర్ అద్దెకుంటున్న ఇంటిని తగలబెట్టిన సంఘటన సోమవారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నర్సింహులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్‌పురా రెయిన్‌బజార్ చమాన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ కరీం (35), నస్రీన్ బేగం దంపతులు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న కరీం గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో నస్రీన్ బేగం కొన్ని రోజులుగా అతనికి దూరంగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మద్యం మత్తులో అతను ఇంట్లో డీజిల్ పోసి నిప్పంటించడంతో ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. రెయిన్‌బజార్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మలక్‌పేట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భార్య నస్రీన్ బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment