
శరవణన్, కనిష్క, అరుణ (ఫైల్)
అన్నానగర్: ప్రేమవివాహం చేసుకున్న దంపతులు బిడ్డ సహా విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. దంపతులు మృతిచెందగా బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బాప్పిరెడ్డిపట్టి సమీపంలో చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లా బాప్పిరెడ్డిపట్టి సమీపంలో ఉన్న మెనసికి చెందిన శరవణన్ (35). ఇతని భార్య అరుణ (25). వీరిద్దరూ మూడేల్ల ముందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కుమార్తె కనిష్క (ఒకటిన్నర సంవత్సరం). శరవణన్ మెనసిలో రక్తపరీక్షల కేంద్రం నడుపుతున్నాడు. ఈ స్థితిలో కనిష్కకి అనారోగ్యం ఏర్పడింది. ఇందుకోసం వేర్వేరు ఆసుపత్రులకు తీసుకెళ్లి చూపించారు. తరువాత కోవైలో ఉన్న ఓ ఆసుపత్రికి బిడ్డని తీసుకుని వెళ్లి చికిత్స అందించారు. తరువాత అక్కడ నుంచి సోమవారం ఊరికి తిరిగి వచ్చారు. మంగళవారం ఎ.పల్లిపట్టిలో శరవణన్ బంధువు ఒకతను మృతి చెందాడు. ఇందుకోసం ఎ.పల్లిపట్టికి శరవణన్ బంధువులు వెళ్లారు. మంగళవారం సాయంత్రం వారు ఊరికి తిరిగి వచ్చారు. అప్పుడు ఓ బంధువు శరవణన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ శరవణన్, అరుణ, కనిష్క ముగ్గురు విషం తాగిన స్థితిలో స్పృహతప్పి పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే వారిని బాప్పిరెడ్డిపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శరవణన్, అరుణ ఇద్దరు మృతి చెందారు. విషమ పరిస్థితిలో ఉన్న కనిష్కని అక్కడ నుంచి సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి బాప్పిరెడ్డిపట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment