అశ్లీల వీడియో తీసి రూ.5లక్షల డిమాండ్‌ | Minor Girl Video Record And Demands Five Lakhs in Tamil Nadu | Sakshi
Sakshi News home page

అశ్లీల వీడియో తీసి రూ.5లక్షల డిమాండ్‌

Published Wed, Jan 8 2020 10:06 AM | Last Updated on Wed, Jan 8 2020 10:06 AM

Minor Girl Video Record And Demands Five Lakhs in Tamil Nadu - Sakshi

చెన్నై,టీ.నగర్‌: బాలికను అశ్లీల వీడియో తీసి రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. విరుదునగర్‌ జిల్లా పల్లపట్టిరాజన్‌ వీధికి చెందిన రాజశివసుందర్‌ (29) బీటెక్‌ పట్టభద్రుడు. ఇతను చెన్నై కోయంబేడు, తిరుముల్‌లైవాయల్, ఆవడి, మైలాపూర్‌ ప్రాంతాల్లో కంప్యూటర్‌ సెంటర్స్‌ నడుపుతున్నాడు. సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడుతుండగా వాషర్‌మెన్‌పేట శ్రీనివాసపురానికి చెందిన 16 ఏళ్ల బాలికతో రాజశివసుందర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇలావుండగా కొన్ని రోజుల తర్వాత వీడియో కాల్‌లో దుస్తులు లేకుండా పోజివ్వమని బాలికను కోరాడు. తన ప్రేమికుడేగా అని భావించిన ఆమె నగ్నంగా పోజిచ్చింది.

దీన్ని సెల్‌ఫోన్‌లో రాజశివసుందర్‌ భద్రపరుచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను కోయంబేడుకు రావాల్సిందిగా కోరాడు. అయితే బాలిక అక్కడికి వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన రాజశివసుందర్‌ బాలిక నగ్నంగా ఉన్న వీడియోను ఆమె సెల్‌ఫోన్‌కు పంపి బెదిరించాడు. దీంతో అనుమానించిన బాలిక ఈ విషయం తన తల్లికి చెప్పింది. బాలిక తల్లి రాజశివసుందర్‌తో మాట్లాడగా రూ.5 లక్షలు ఇస్తే బాలిక అసభ్య వీడియో తొలగిస్తానని అన్నాడు. దీంతో వాషర్‌మెన్‌పేట పోలీసు స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక చిన్నాన్న ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటించి నగదు ఎక్కడ ఇవ్వాలని కోరారు. దీంతో రాజశివసుందర్‌ కోయంబేడుకు రావాల్సిందని తెలపగా పోలీసులు సోమవారం అక్కడికి వెళ్లి రాజశివసుందర్‌ను పట్టుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement