దెయ్యమై వేధిస్తుందేమోనని తల నరికి... | MP Man Killed His Uncle And Decapitated Aunt Head | Sakshi
Sakshi News home page

దెయ్యమై వేధిస్తుందేమోనని తల నరికి...

Published Thu, Sep 5 2019 8:23 PM | Last Updated on Thu, Sep 5 2019 8:40 PM

MP Man Killed His Uncle And  Decapitated Aunt Head  - Sakshi

భోపాల్‌ :  సొంత అల్లుడే అత్తమామలను చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు.. వారు దెయ్యమై వేధించకుండా ఉండేందుకు అత్త తలను, మొండాన్ని వేరు చేశాడు. వివరాలు.. హత్యగావించబడిన భగవాన్‌ జీ దంపతులు అనుప్పూర్‌లోని దుధ్మానియా గ్రామంలో నివసిస్తున్నారు. వీరి అల్లుడు, నిందితుడు శంఖు కూడా అదే గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా శంఖు కుమారుడు అనారోగ్యంతో బాధపడటమే కాక అతని పశువులు కూడా చనిపోయాయి.

అత్తమామల క్షుద్ర పూజల వల్లే ఇలా జరిగిందని భావించిన శంఖు వారిని హత్య చేశాడు. అంతేకాక చనిపోయాక అత్త తనను దెయ్యమై వేధించకుండా ఉండేందుకు ఆమె తల నరికి కిలో మీటరు దూరంలో పాతి పెట్టాడు. ఆ తర్వాత అత్తమామల మృతదేహాలను ఊరి బయట పడేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శంఖు చేసిన దారుణం వెలుగు చూసింది. ప్రస్తుతం పోలీసులు శంఖు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement