సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో బోగస్ సంస్థను ఏర్పాటు చేసి కోట్లాది రూపాలను దండుకొని బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఫరిదిలో గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో ఓ బోగస్ సంస్థను ఏర్పాటు చేసిన శ్రీకాంత్... లక్ష రూపాయలు చెల్లిస్తే పల్లీలు వలిచే యంత్రం ఇస్తామంటూ చాలామంది నుంచి డబ్బు వసూలు చేశాడు. నెలకు రూ.10 వేలు సంపాధించవచ్చునని ఆశ చూసి వేలాది మంది నుంచి దాదాపు 50 నుంచి వంద కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.
తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాకట,తమిళనాడు రాష్ర్టాల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. గతంలో మహాలైఫ్ పేరుతో కూడా శ్రీకాంత్ భారీ మోసానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు శ్రీకాంత్‌తో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment