multi level marketing
-
ఆమ్వేకు భారీ షాక్ ! రూ.757 కోట్ల ఆస్తులు ఎటాచ్
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వేకు భారీ షాక్ తగిలింది, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ కంపెనికి చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసింది. ఇందులో స్థిర, చర ఆస్తుల విలువ రూ.411 కోట్లు ఉండగా మిగిలిన రూ.346 కోట్ల నగదును ఎటాచ్ చేసింది. ఆమ్మేకు చెందిన దుండిగల్‌లో ఉన్న ఫ్యాక్టరీ, ఫర్నీచర్, మెషినరీలతో పాటు ఈ కంపెనీకి చెందిన 36 బ్యాంకు ఖాతాలను ఈడీ ఎటాచ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబరులో ఈ కంపెనీలకు కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు అందిస్తున్న పొడక్టులన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, ఈ వ్యాపారంలో భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎంలో అతి పెద్ద సంస్థ అయిన ఆమ్వేకు భారీ షాక్ ఇచ్చింది ఈడీ. ED has provisionally attached assets worth Rs. 757.77 Crore belonging to M/s. Amway India Enterprises Private Limited, a company accused of running a multi-level marketing scam. — ED (@dir_ed) April 18, 2022 చదవండి: ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్‌వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ ! -
ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్‌వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ !
Direct Selling New Guidelines In India 2021: నేరుగా విక్రయాలు సాగించే కంపెనీలు (డైరెక్ట్ సెల్లింగ్) పిరమిడ్, నగదు చలామణి పథకాలను నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం నోటిఫై చేసింది. దీంతో 90రోజుల్లోగా కొత్త నిబంధనలను కంపెనీలు అమల్లో పెట్టాలి. ఈ కంపెనీలు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి. టప్పర్‌వేర్, ఆమ్వే, ఒరిఫ్లేమ్ ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలే. ఈ కంపెనీల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వీటి వలన ఆర్థిక, వినియోగదారుల మార్కెట్లో పోంజి స్కీమ్స్ అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఆహ్వానించాయి. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ చైర్మన్, ఆమ్వే ఇండియా, కార్పోరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ రజత్ బెనర్జీ స్పందిస్తూ.. ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌పై ఆధారపడి దేశంలో 70 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఇందులో సగం మంది మహిళలే అన్నారు. ప్రభుత్వం రెండేళ్లుగా ఈ విధానంపై అధ్యయనంపై చేసి తాజా నిబంధనలు రూపొందించిందన్నారు. దీని వల్ల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌పై ఉన్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కీలక నిబంధనలు ఇలా - డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు పిరమిడ్ తరహా నగదు చెల్లింపు పథకాలను అమలు చేయకూడదు - ఆమ్వే వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ఈ కామర్స్ సైట్లలో అమ్ముకోవచ్చు. అయితే కన్సుమర్ ప్రొటెక్షన్ రూల్స్ - 2020( ఈ కామర్స్) నిబంధనలు పాటించాలి - డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న సంస్థలను నియంత్రించేందుకు సమర్థవంతమైన వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలి. - డైరెక్ట్ సెలింగ్ వ్యాపారంలో ఉన్న కంపెనీలు ఇండియాలో కచ్చితంగా ఒక రిజిస్ట్రర్ ఆఫీసును భౌతికంగా కలిగి ఉండాలి - వారి ఉత్పత్తుల నాణ్యతకు అమ్మందారులు బాధ్యత వహించాలి చదవండి:ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాదారులకు అండగా ఆర్బీఐ -
సన్ పరివార్ కేసు: విచారణ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: సన్‌పరివార్ కేసు విచారణను సైబరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈడీకి పోలీసులు లేఖ రాశారు. 2018లో వెలుగులోకి వచ్చిన రూ.150 కోట్ల సన్‌పరివార్ కేసులో ఆ సంస్థ సీఈవో రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పటేల్‌గూడ సర్పంచ్ నితీషా సహా ఆరుగురు అరెస్టయ్యారు. 14వేల మంది డిపాజిటర్ల నుంచి రూ.150 కోట్లు వసూలు చేశారు. ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు పోలీసులు సీజ్ చేశారు. వివిధ బ్యాంకు ఖాతాలు, ఆస్తుల రూపంలో రూ.16కోట్లు గుర్తించారు. అమీన్ పూర్ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమీన్పూర్ ఎంపీపీ దేవనాథ్ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కొంత మంది రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
గేమింగ్ స్కామ్‌లో మల్టీలెవల్ మార్కెటింగ్...!
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వ్యాపారం పేరుతో సంస్థల్ని రిజిస్టర్ చేసుకుని, కలర్ ప్రెడిక్షన్ గేమ్ ముసుగులో బెట్టింగ్ దందా నిర్వహించిన బీజింగ్ టీ పవర్ కంపెనీ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు పాల్పడినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ పంథాలోనే అనేక మంది కొత్త ‘కస్టమర్ల’ను ఆకర్షించినట్లు తేల్చారు. ఈ స్కామ్ మొత్తం విలువ రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సౌత్ ఈస్ట్ ఏసియా ఆపరేషన్స్ హెడ్ యాన్ హూపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీసర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్ కింద ఆరోపణలు జోడించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు సమాచారం అందించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన యాన్ హూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్లను తదుపరి విచారణ కోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం నాలుగు రోజులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ విచారణ ప్రారంభం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు యాన్ హూపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీసర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్ కింద ఆరోపణలు జోడించారు. ప్రాథమికంగా ఈ కేసుల్ని కుట్ర, మోసంతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని సెక్షన్ల కింద నమోదు చేశారు. ఈ గ్యాంగ్ వారిని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన యువత సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫోన్లు చేస్తున్నారు. తాము కూడా ఆ గేమ్ వల్లో పడి భారీగా నష్టపోయామని చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు తన తల్లి వైద్యం కోసం దాచిన రూ.2.5 లక్షల్ని ఈ గేమ్‌లో నష్టపోయానని, ఆ మొత్తం తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాడు. అయితే తెలంగాణలో మాదిరిగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ గేమింగ్ నిషేధం కాదు. దీంతో ఆయా చోట్ల కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. గత వారం నుంచి ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులకు సంబంధిం చిన 30 బ్యాంకు ఖాతాలు గుర్తించి ఫ్రీజ్ చేశారు. వీటికి సంబంధిం చిన స్టేట్మెంట్స్ అందించాల్సిందిగా ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అవన్నీ అందిన తర్వాతే ఆర్థిక లావాదేవీలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని చెప్తున్నారు. కీలక నిందితుల కోసం గాలింపు.. ఇక ఈ–కామర్స్ పేరుతో ఢిల్లీలో ఆ సంస్థల్ని రిజిస్టర్ చేయించిన గుర్గావ్ వాసులే ఈ ఖాతాలను తెరిచారని తేలింది. తాము చైనా ఈ–కామర్స్ యాప్స్ మానిటర్ చేస్తుంటామని, ఆ ఆదాయం ఈ ఖాతాల్లోకి వస్తుందని బ్యాంకు, పేమెంట్ గేట్వేస్ నిర్వాహకుల్ని నమ్మించారు. అయితే వీటిని నిర్వహించింది మాత్రం యాన్ హూ సహా ఆయా కంపెనీల్లోని చైనా డైరెక్టర్లే కావడం గమనార్హం. ఈ స్కామ్‌లో కీలక నిందితులుగా ఉన్న ఢిల్లీ వాసులు రాహుల్, హేమంత్ల కోసం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రాథమికంగా ఈ స్కామ్ రూ.1,100 కోట్లని భావించినా... ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు ఈ మొత్తం రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నగదు లావాదేవీలు డాకీ పే, లింక్ యూ పే యాప్ ద్వారా జరిగినట్లు చెప్తున్నారు. దీంతో వీరికి నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 20 మందిని చేరిస్తే రూ.500 ఈ గేమ్‌లోకి కొత్తవారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. ఇప్పటికే ఈ గేమ్ ఆడుతున్నవారు లేదా దళారులు ఇచ్చే రిఫరల్‌తో మాత్రమే ఇందులోకి ఎంటర్ అయ్యే వీలుంటుంది. ఇలా రిఫరల్ కోడ్ ఇవ్వడం, ఒక వ్యక్తి మరికొందరిని చేర్చడం మల్టీ లెవల్ మార్కెటింగ్ కిందికే వస్తుందని పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికోసం పనిచేసే దళారులు.. ఓ వ్యక్తిని యాప్‌లోకి ఇన్వైట్ చేసిన తర్వాత కనీసం రూ.200 రీచార్జ్ చేసుకోమంటారు. ఇలా 20 మందిని ఆకర్షించి వారితో రూ.200 చొప్పున రీచార్జ్ చేయిస్తే వీరు రూ.500 కమీషన్ పొందుతున్నారు. ఇలా మనీ సర్క్యులేషన్ దందా నిర్వహిస్తున్నారు. -
మోసపోయి.. మోసం చేసి..
సాక్షి, హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ‘క్యూనెట్’సంస్థ మాదిరిగానే అక్రమాలకు పాల్పడిన మరో సంస్థ ‘సెర్ఫా’బాగోతం బట్టబయలైంది. క్యూనెట్ సంస్థలో చేరి నష్టపోయిన బాధితుడే సెర్ఫా సంస్థ యజమానిగా అవతారమెత్తి దేశవ్యాప్తంగా మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నాడు. నగరంలోని మియాపూర్ వాసి ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పోలీసులు బుధవారం వలపన్ని నిందితుడ్ని పట్టుకున్నారు. నాడు మోసాలకు బాధితుడు.. నేడు సూత్రధారి శ్రీకాకుళం పొందూరు మండలం తానెం గ్రామానికి చెందిన బక్కి శ్రీనివాసరెడ్డి బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగరీత్యా 2012లో హైదరాబాద్ వచ్చాడు. ఈక్రమంలో క్యూనెట్ సంస్థలో చేరి రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. దీంతో 2018లో క్యూనెట్ సంస్థ తరహాలోనే విశాఖపట్టణంలో సెర్ఫా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీస్ ప్రారంభించి మల్టీ లెవల్ మార్కెటింగ్ మొదలెట్టాడు. దీని బ్రాంచ్ ఆఫీసును నగరంలోని కూకట్‌పల్లిలో ప్రారంభించిన బక్కి శ్రీనివాస్‌రెడ్డి అనతి కాలంలోనే లక్షలు సంపాదించవచ్చంటూ తన మాయమాటలతో విద్యార్థులు, గృహిణులు, నిరుద్యోగులను ఆకర్షించాడు. తన కంపెనీలో చేరే వినియోగదారులు డీడీ ద్వారా కంపెనీ బ్యాంక్ ఖాతాకు డబ్బులు చెల్లించాలని, ఆ తర్వాత యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఇస్తామని నమ్మపలికాడు. రూ.12,000 చెల్లించి సభ్యుడిగా చేరితే రూ.1,000, మరో ఇద్దరిని చేర్పిస్తే రూ.4,000 కమీషన్ వస్తుం దని ఆశచూపాడు. సంస్థలో చేరిన వారికి వెకేషన్ టూర్ ప్యాకేజీలు, నాసిరకమైన వాచ్‌లు, నాణ్యతలేని హెల్త్, డైటరీ, బ్యూటీ ఉత్పత్తులు ఇచ్చేవారు. వాస్తవానికి హోల్‌సేల్ మార్కెట్లో లభించిన ధరకు పదింతలు రేట్లు చెప్పి వీటిని వారి చేతికి అంటగట్టేవారు. కమీషన్ వస్తుందన్న ఆశతో ఈ కంపెనీలో చేరిన సభ్యులు మరికొంతమందిని ఈ సంస్థలో చేర్పించారు. ఇలా తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌తో పాటు లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఈ కంపెనీలో ఐదువేల మంది వరకు సభ్యులుగా చేరారు. నగరవాసి ఫిర్యాదుతో.. అప్పటివరకు సెర్ఫా సంస్థ కార్యకలాపాలు సాఫీగానే సాగిపోవడంతో ఏ ఇబ్బందిలేకుండా పోయింది. అయితే ఈ కంపెనీలో సభ్యురాలిగా చేరిన నగరంలోని మియాపూర్‌వాసి కన్నెకంటి తులసి సంస్థ మోసాలపై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెర్ఫా డొంకంతా కదిలింది. సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పోలీసులు రంగంలోకి దిగి సంస్థ యజమాని శ్రీనివాస్‌రెడ్డిని వలపన్ని కూకట్‌పల్లిలోని అతడి కార్యాలయంలోనే అరెస్టు చేశారు. కార్యాలయాన్ని సీజ్ చేయడంతో పాటుగా కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధమున్న ఇతర నిందితుల్ని కూడా అరెస్టు చేయాల్సి ఉందని సైబరాబాద్ పోలీసుల కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. -
కోదాడలో గొలుసుకట్టు వ్యాపారం..!
సాక్షి, కోదాడ: సామాన్యుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ కోదాడలో మరో గొలుసుకట్టు వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలువురు ప్రముఖులు దీనిలో భాగస్వాములు కావడంతో సామాన్యులు సులువుగా మోసపోతున్నారు. రూ.12 వేలు చెల్లిస్తే సభ్యత్వంతో పాటు అంతే విలువైన ఉత్పత్తులను (వివిధ రకాలైన వస్తువులు) ఇస్తామని వీటి అమ్మకం వల్ల రూ.2వేల లాభం వస్తుందని, మరో ఇద్దరిని చేర్పిస్తే మరో రూ.3 వేల లాభం వస్తుందని ఇలా సభ్యులు చేరినా కొద్దీ రూ.లక్షలు మీ జేబుల్లో వచ్చి పడతాయని చెపుతుండడంతో పలువురు వీరి వలకు చిక్కుతున్నారు. దీని వ్యవహారం ఏమిటంటే.. ఇప్పటికే అనేక మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులకు కుచ్చుటోపీ పెట్టి నిండా ముంచుతున్న ఉదంతాలు వెలుగు చూస్తుండగా తాజాగా మరో కంపెనీ కోదాడ ప్రాంతంలో గుటుచ్చప్పుడు కాకుండా తన కార్యకలాపాలు సాగిస్తోంది .‘ఇండుస్ వివా’ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ వ్యాపారం ముందుగా నాలుగు రకాల వస్తువులైనా ఐస్లిమ్, ఐకాఫీ, ఐ పల్స్, ఐ చార్జీలను అంటగడుతున్నారు. వీటి కోసం 12,400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని అమ్ముకోవడం వల్ల రూ.2 వేల కమీషన్ వస్తుందని, దీంతో పాటు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా మరో రూ.5 వేలు, వారు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా చైన్ పెరిగి మీ ఖాతాల్లో రూ.లక్షలు జమ అవుతాయని నమ్మబలుకుతూ తేలిగ్గా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వ్యాపారం అంతా రహస్యంగా కొంత మంది తమ ఇళ్లలో సాగిస్తున్నారని సమాచారం. అబ్బో.. కేన్సర్ కూడా తగ్గుతుందట...! ఎక్కడ తయారు అవుతున్నాయో, వాటిలో ఏముంటాయో తెలియకుండా వీరు నాలుగు రకాల ఉత్పత్తులను అంటగడుతున్నారు.. వీటిలో ఐ స్లిమ్ వాడితే ఎంత లావు ఉన్నా ఒక్క నెలలోనే స్లిమ్‌గా తయారవుతారట. ఇక ఐ ఫల్స్ తాగితే ప్రాణాంతకమైన కేన్సర్ కూడా తగ్గుతుందట. దీనిలో అసైబెర్రీ అనే ఫలరసం ఉంటుందని, ఇది అమెజాన్ అడవుల్లోనే ఉంటుందని మాయమాటలు చెబుతూ అంటగడుతున్నారు. ఇక ఐ చార్జీ వాడితే వెంటనే బాడీలో శక్తి వచ్చి పరుగులు పెట్టవచ్చట. ఇలా ఈ ఉత్పత్తుల్లో ఉన్న బ్రహ్మపదార్థం ఏమిటో అర్థం కాక వైద్యులే తలపట్టుకుంటున్నారు. వీరు మాత్రం సులువుగా మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకులు వీరి వలకు చిక్కుతున్నారు ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు సామాన్యులను బురిడీ కొట్టించడానికి వీరు ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు పెడతారు. సూటు, బూటు వేసుకుని కనికట్టు మాటలతో మభ్యపెడుతుంటారు. అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. అంతేకాక కొంత మందిని తీసుకొచ్చి ఇప్పటికే రూ.లక్షలు తమ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నట్లు చెప్పిస్తుంటారు. దీంతో పలువురు యువకులు తమ తల్లిదండ్రులు వద్దంటున్నా వీరికి సొమ్ముచెల్లించి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
చైన్ దందా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొలుసుకట్టు దందాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఇటీవలి కాలంలో క్యూనెట్, హీరా గ్రూపు ఉదంతాలు వెలుగుచూసినా కొత్త పేర్లు, ఐడియాలతో జనాల జేబుకు చిల్లు పెట్టేందుకు నయా మార్గాల్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. వేగంగా డబ్బు రెట్టింపు చేస్తామని ఆశచూపుతూ మధ్యతరగతి ప్రజల జీవితా లతో ఆటలాడుకుంటున్నాయి. తాజాగా సెర్ఫా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట హైదరాబాద్‌లో ఓ కొత్త కంపెనీ వెలిసింది. మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా వ్యాపారం సాగిస్తోంది. ఏడాదిలో లక్షాధి కారులు కావచ్చని అరచేతిలో స్వర్గం చూపిస్తూ అమాయకుల నుంచి భారీగా దండుకుంటోంది. ఎలా చేస్తున్నారు..? సెర్ఫా కంపెనీలో చేరాలంటే ముందుగా రూ. 18 వేలు కట్టాలి. దానికి సమాన విలువ అని చెబుతూ రెండు 100 గ్రాముల బరువున్న ట్యాబ్లెట్ల డబ్బాలు అంట గడతారు. కట్టిన డబ్బు వృథా కాలేదు అనే భావన కస్టమర్‌కు కలిగేలా సంతృప్తి పడేలా నూరిపోస్తారు. వాస్తవానికి ఆ ట్యాబ్లెట్ల విలువ మార్కెట్లో రూ. 1,000–2,000కు మించదు. తరువాత వారికి ఒక ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. అంతకుముందే బ్యాంకు, ఆధార్ ఖాతాల వివరాలు తీసుకొని తొలుత ఖాతాలో రూ. 2 వేలు జమచేస్తారు. ఇక అక్కడ నుంచి ఖాతాదారు తరఫున ఎంత మంది చేరితే అన్ని రూ. 1,200 చొప్పున ఖాతాలో జమ చేస్తామని ఆశచూపుతారు. బంధువులు, స్నేహితులను చేర్పించమంటూ మానవ సంబంధాలపై వ్యాపారం నడిపిస్తున్నారు. వారు తమ కంపెనీలో చేరే ప్రతి ఒక్కరినీ పార్ట్నర్ని అని చెబుతుండటం గమనార్హం. ఏడాదిన్నర కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నారట.. వాస్తవానికి ఈ కంపెనీని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వద్ద 2018 ఏప్రిల్ 26న విశాఖపట్నం కేంద్రంగా రిజిష్ట్రేషన్ చేశారు. అంటే దీని వయసు ఏడాదిన్నరలోపే. కానీ ఇందులో పనిచేసే ఉద్యోగులు మాత్రం తాము 2016 నుంచి ఈ కంపెనీలో చేస్తున్నామని, ఎంటెక్, ఎంబీఏలు చదివి వేల రూపాయల వేతనాలు వదులకొని ఇందులో భాగస్వాములుగా చేరామని గొప్పలు చెబుతున్నారు. ప్రతి వారినీ కంపెనీలో భాగస్వాములంటూ సంబోధించడంతో వెనకా ముందు చూడకుండా పేదలు దిగువ మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులు అప్పు చేసి మరీ పెట్టుబడి పెడుతున్నారు. క్యూనెట్ ప్రెస్‌మీట్‌తో ఖాతాదారుల్లో అనుమానాలు.. ఇటీవల క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ పోలీసులు పెట్టిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలుసుకుని ఇందులో చేరిన ఖాతాదారులు కొందరు ఆలోచనలో పడ్డారు. ఈ కంపెనీ ప్రతినిధులు ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ కాదని చెబుతున్నా.. అదేబాటలో నడుస్తుండటంతో అనుమానం వచ్చి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడం మొదలుపెట్టారు. కానీ, వారిని కంపెనీ ప్రతినిధులు దబాయిస్తున్నారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, కోర్టుకు లాగుతామని బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. అందరిలాగానే వెళ్లిన సాక్షి ప్రతినిధికి కూడా కంపెనీ ఉద్యోగులు అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్నంతా ‘సాక్షి’ రికార్డు చేసింది. తరువాత దీనిపై వివరణ కోరగా.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని తామెవరినీ మోసం చేయడం లేదని చెప్పుకొచ్చారు. చిక్కుకున్నాక మోసం.. ఈ దందాలే మానవ సంబంధాలు, మాటలే పెట్టుబడులు. మోసంలో చిక్కుకున్నాక.. తమ డబ్బును ఎలాగైనా తిరిగి వసూలు చేసుకోవాలని, బంధువులను, స్నేహితులను ఇందులో చేరుస్తున్నారు. ఫలితంగా మోసం వెలుగుచూసాక.. బంధాలు తెగిపోతున్నాయి. ఇలాంటి బాధితుల్లో అధికంగా సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేటు, ఎంటెక్, ఎంబీఏలు చదివిన గ్రాడ్యుయేట్లు కావడం గమనార్హం. డబ్బులిమ్మంటే బెదిరిస్తున్నారు.. మొదట్లో ఇదేదో మామూలు స్కీం అనుకున్నా. అందుకే పొరుగింటావిడ చెప్పిందని చేరాను. మొన్న క్యూనెట్ గురించి వార్తల్లో చదివా. రెండూ ఒకేరకంగా ఉండటంతో కంపెనీ ప్రతినిధులను నిలదీశా. వారు కంపెనీకి అనుమతులు ఉన్నాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటామని తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారు. – తులసి, గృహిణి, కేపీహెచ్‌బీ కాలనీ పేరేదైనా.. చివరి లక్ష్యం మోసమే..! హైదరాబాద్‌లో రకరకాల పేర్లతో అక్రమార్కులు జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. అందుకు పోంజి, మల్టీలెవల్ మార్కెటింగ్, హెర్బల్ ఇలా తదితర మార్గాల్లో దందాలు చేస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే.. జనాల నుంచి తక్కువ సమయంలో అందినకాడికి దండుకోవడం. క్యూనెట్: రాష్ట్ర రాజధాని ఇటీవల వెలుగుచూసిన మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం విలువ దాదాపు రూ. 1,000 కోట్లపైనే. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టి దారుణంగా మోసపోయాడు. తనతోపాటు స్నేహితులు, బంధువులనూ చేర్పించాడు. వారి వద్ద మొహం చెల్లక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. హీరా: ఇదో రకమైన పోంజి స్కీం. అధిక వడ్డీ ఆశజూపి హైదరాబాద్ కేంద్రంగా సాగిన దందా ఇది. దీని విలువ ఏకంగా రూ. 5,000 కోట్లు. ఈ పథకంలో చేరిన వారిలోనూ అధిక శాతం విద్యావంతులు, గ్రాడ్యుయేట్లే ఉండటం గమనార్హం. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ సంస్థా అధిక వడ్డీ చెల్లించదన్న చిన్న పాయింట్‌ను బాధితులెవరూ గుర్తించకపోవడం కుంభకోణానికి అసలు కారణం. కరక్కాయలు: రోజుకు కిలో కరక్కాయలు దంచిపెడితే రూ. 1,000 ఇస్తామని ఆశచూపి కోట్ల రూపాయలు దండుకున్న విషయం తెలిసిందే. నెల్లూరుకు చెందిన ఓ కేటుగాడు ప్రారంభించిన ఈ దందాలో చిక్కి 650 మంది మహిళలు దాదాపు రూ.8.3 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. -
మల్టీలెవల్లో మోసం
సాక్షి, హైదరాబాద్: అతి తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చంటూ ‘ఈ–లెర్నింగ్’కోర్సుల పేర వలవేస్తారు. వలకు చిక్కిన వారిని నెమ్మదిగా మల్టీ లెవల్ మార్కెటింగ్‌లోకి దింపుతారు. భారీగా కమిషన్లు వస్తాయంటూ ఆశచూపిస్తారు. ఎంత మందిని చేర్పించినా.. కమిషన్ మాత్రం చెల్లించరు. ఇలా లక్షల మంది నుంచి వందల కోట్లు వసూలు చేసింది ఈబిజ్.కామ్ ప్రైవేట్ లిమిటెడ్. వీరి చేతిలో మోసపోయిన విద్యార్థి సమల్ల వివేక్ ఫిర్యాదుతో ఈ స్కాం బయటికొచ్చింది. దీంతో నోయిడాకు చెందిన ‘ఈబిజ్.కామ్’ప్రతినిధి హితిక్ మల్హాన్‌ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మందిని ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో చేర్చుకొని రూ.వెయ్యి కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితిక్‌ను నోయిడాలో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు. ఈ కంపెనీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.70.5 కోట్లను ఫ్రీజ్ చేశారు. మల్హన్ ఫ్యామిలీ కనుసన్నల్లో నడుస్తున్న ఈ భారీ మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. రిటైల్ ప్రొడక్ట్స్తోనూ మోసాలు... ఇదిలా ఉండగా ఈ–లెర్నింగ్ కోర్సు వలలో పడిన వారిలో కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో ఫ్యాషన్‌పై వారికున్న అభిరుచిని డబ్బుగా మలచుకునేవారు. జీన్ పాయింట్లు, షర్ట్లు, టీషర్ట్లు, బెల్ట్‌లు అతి తక్కువ ధరకే ఇస్తామంటూ డబ్బులు కట్టించుకొనేవారు. నాసిరకం వస్తువులిస్తూ.. ఇందులో మరికొందరిని చేర్పిస్తే కమిషన్లు వస్తాయంటూ ఆశచూపేవారు. అలాగే ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున ముగ్గురిని చేర్పిస్తే హాలిడే ప్యాకేజీ ఇస్తామనేవారు. ఇలా అన్ని కలిపి లక్షల మందిని గొలుసు కట్టు పథకాల ద్వారా మోసగించినట్లు పోలీసు విచారణలో తేలింది. చాలా మంది విద్యార్థులు ఈ కంపెనీలో డబ్బులు పెట్టారని విచారణలో తేలింది. వరంగల్, ఆదిలాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కంపెనీ మోసాలపై కేసులు ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. పరారీలో ఉన్న కంపెనీ ఎండీ, డైరెక్టర్లు పవన్ మల్హన్, అనిత మల్హన్ కోసం గాలిస్తున్నామన్నారు. డబ్బులొస్తాయని ఆశచూపారు... మా అన్నయ్య స్నేహితుడు 2 నెలలు గడవగానే రెట్టింపు డబ్బులు వస్తాయంటూ చెప్పడంతో రూ.16,821 చెల్లించి ఈబిజ్ కంపెనీ ఈ–లెర్నింగ్ కోర్సులో చేరా. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నాకు హాస్టల్ ఖర్చుల కోసం ఆ కంపెనీ ఇచ్చే డబ్బు ఉపయోగపడుతుందని ఆశించా. అయితే 2 నెలలు గడిచినా డబ్బులు రాలేదు. అంతేకాదు మరో ఇద్దరిని చేర్పిస్తే కమిషన్ వస్తుందని చెప్పారు. దీంతో 8 మందిని చేర్పించా. ఎలాంటి కమిషన్ ఇవ్వలేదు. ఆ కంపెనీ ఇచ్చిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెరిచి చూస్తే నా బ్యాంక్ ఖాతాలో కమిషన్ వేసినట్లు కనిపిస్తున్నా... అకౌంట్లో మాత్రం డబ్బు పడలేదు. దీంతో ఆ కంపెనీ రిప్రజెంటీవ్లను వెళ్లి నిలదీస్తే డబ్బులు రావు నీ దిక్కున్నచోట చెప్పుకో అన్నారు. దీంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించా. – వివేక్, జగిత్యాల జిల్లా కమిషన్ వస్తుందని ఎరవేస్తారు.. పవన్ మల్హన్ ఎండీగా, అతని భార్య అనితా మల్హన్ డైరెక్టర్‌గా 2001లో నోయిడాలో ఈబిజ్.కామ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. 2007 నుంచి కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఈ–లెర్నింగ్ కోర్సుల పేరుతో కంపెనీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళుతున్నారు. పవన్ కుమారుడు హితిక్ కంపెనీ కార్యకలాపాలను చూస్తూ దాదాపు 7 లక్షల మందిని సభ్యులుగా చేర్పించాడు. ఈ–లెర్నింగ్ ప్రాజెక్టుల ద్వారా సులభ పద్ధతిలో డబ్బు సంపాదించే వ్యాపార మార్గాలున్నాయంటూ యువతను ఆకర్శిస్తారు. రూ.16,821 డబ్బులు వసూలు చేసి.. ఈబిజ్ బిజినెస్ ప్యాకేజీలు నచ్చకపోతే నెల రోజుల్లోపు నగదు తిరిగి ఇస్తామంటూ హామీలిస్తారు. ఈ నెల రోజుల సమయం తెలియకుండా విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ల మనసు మారకుండా చూసుకుంటారు. ఈ సమయంలోనే మీరు మరో ఇద్దరిని ఈ కోర్సుల్లో చేర్పిస్తే 30 వేల పాయింట్లు, రూ.2,700 (తొమ్మిది శాతం) కమిషన్ వస్తుందని ఆశచూపుతారు. ఎక్కువ సంఖ్యలో చేర్పించిన వారికి సిల్వర్, గోల్డ్, డైమండ్, డిప్లోమేట్, సిల్వర్ డిప్లోమేట్, గోల్డ్ డిప్లోమేట్ లాంటి టైటిళ్లను ఇస్తారు. ఇలా ఈ–లెర్నింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి ఏ యూనివర్సిటీకి అనుబంధంగా లేని సర్టిఫికెట్లను ఇచ్చి చేతులు దులుపుకుంటారు. మొత్తంగా ఎక్కువ మంది విద్యార్థులు ఈ–లెర్నింగ్ కోర్సుల కన్నా సభ్యులను చేర్పిస్తే కమిషన్ వస్తుందనే ఆశతో పనిచేసేలా నిర్వాహకులు చూస్తారు. కంపెనీకి డీడీ ద్వారా డబ్బులు కట్టి చేరిన సభ్యుడికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా కేటాయిస్తున్నారని సీపీ తెలిపారు. -
వెలుగులోకొచ్చిన రూ. 1000 కోట్ల భారీ స్కాం
సాక్షి, హైదరాబాద్ : అగ్రీగోల్డ్, క్యూనెట్ వంటి స్కాంల గొడవ తేలక ముందే భాగ్యనగరంలో మరో భారీ స్కాం వెలుగు చూసింది. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ‘ఈ బిజ్ అనే మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ప్రజలను మోసం చేసి దాదాపు రూ. 1000 కోట్లు వసూలు చేసింది. 2001లో నోయిడా కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుంది. ఇప్పటికే ఈ సంస్థలో దేశవ్యాప్తంగా దాదాపు 7లక్షల మంది సభ్యులు ఉన్నారు. వారి దగ్గర నుంచి సంస్థ నిర్వాహకులు ఇప్పటి వరకూ సుమారు రూ.1000 కోట్లు వసూలు చేశార’ని సజ్జనార్ తెలిపారు. సజ్జనార్ మాట్లాడుతూ.. ‘తొలుత సంస్థలో రూ.16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10వేల పాయింట్లు ఇస్తారు. ఆ తరువాత ఎంతమందిని జాయిన్ చేస్తే.. అంత కమిషన్ ఇస్తామంటారు. యువతను ఆకట్టుకొనేందుకు ఈ లెర్నింగ్ కోర్సు, కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తామని చెప్తారు. అనంతరం ధ్రువపత్రం ఇస్తారు. కానీ వీటికి ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు ఉండదు. దేశవ్యాప్తంగా ఈ స్కాం బాధితులున్నారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై పరిధిలో ఎక్కువ మంది ఉన్నార’ని సజ్జనార్ తెలిపారు. జగిత్యాలకు చెందిన సామల్ల వివేక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కాం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ బిజ్ నిర్వాహకుడు హితిక్ మల్హాన్‌ను అరెస్ట్ చేశామని.. అంతేకాక సంస్ధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.70 లక్షలను ఫ్రీజ్ చేశామని సజ్జనార్ వెల్లడించారు. -
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో ఘరానా మోసం
-
భారీ మోసం : పల్లీలు వలిచే యంత్రం ఇస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరుతో బోగస్ సంస్థను ఏర్పాటు చేసి కోట్లాది రూపాలను దండుకొని బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఫరిదిలో గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో ఓ బోగస్ సంస్థను ఏర్పాటు చేసిన శ్రీకాంత్... లక్ష రూపాయలు చెల్లిస్తే పల్లీలు వలిచే యంత్రం ఇస్తామంటూ చాలామంది నుంచి డబ్బు వసూలు చేశాడు. నెలకు రూ.10 వేలు సంపాధించవచ్చునని ఆశ చూసి వేలాది మంది నుంచి దాదాపు 50 నుంచి వంద కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాకట,తమిళనాడు రాష్ర్టాల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. గతంలో మహాలైఫ్ పేరుతో కూడా శ్రీకాంత్ భారీ మోసానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు శ్రీకాంత్‌తో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ముంచేస్తున్న ‘మల్టీ’ మోసం
సాక్షి, హైదరాబాద్: మల్టీలెవల్ మార్కెటింగ్ దందా అమాయకులను అప్పులపాలు చేస్తోంది. గడిచిన మూడు నెలల్లో రాష్ట్ర పోలీసులు పట్టుకున్న కేసుల్లో రూ.20 వేల కోట్ల మేర మల్టీలెవల్ మార్కెటింగ్‌లో వేలాదిమంది మోసపోవడం సంచలనం రేపుతోంది. దేశవ్యాప్తంగా మల్టీలెవల్ మార్కెటింగ్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం 1978లోనే చట్టాన్ని తీసుకువచ్చింది. మనీ సర్క్యులేషన్ స్కీం నిషేధిత యాక్ట్ కింద గిఫ్ట్‌ల పేరిట డబ్బులు వసూలు చేసి చెయిన్ లింక్ ద్వారా మార్కెటింగ్ చేయడం పూర్తిగా అక్రమమేనని ఈ చట్టం ద్వారా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో ఆమ్వే ప్రాడక్ట్‌పై ఇదే తరహా మల్టీలెవల్ మార్కెటింగ్ కేసును సీఐడీ నమోదు చేసింది. ఇటీవల బయటపడుతున్న మల్టీలెవల్ కంపెనీ మోసాలు వేలకోట్లకు చేరడంతో రాష్ట్రంలో మళ్లీ మల్టీలెవల్ మార్కెటింగ్ మాఫియా చాపకింద నీరులా దందా సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. - హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని గోల్డ్‌స్కీం పేరుతో దేశవ్యాప్తంగా డిపాజిట్లు వసూలు చేసిన హీరా గ్రూప్ మోసాన్ని నగర సీసీఎస్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆ గ్రూపు ఎండీ నౌహీరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా రూ.8 వేల కోట్లకుపైగా నౌహీరా షేక్ బంగారం స్కీం పేరుతో డిపాజిట్లు వసూలు చేసినట్టు బయటపడింది. - ఎఫ్ఎమ్ఎల్ సీ(ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దేశవ్యాప్తంగా రూ.1,200 కోట్ల వసూలు చేసింది. ఈ కంపెనీలో సభ్యులుగా చేరి, వారి వద్ద ఉన్న హెల్త్ ప్రొడక్టు కొనుగోలు చేయాలి. తర్వాత మరో ఇద్దరిని చేర్చి ప్రొడక్టు కొనుగోలు చేయించాలి. ఇలా చేయడం వల్ల నెలవారీగా ఇంత మొత్తం వస్తుందని డిపాజిట్ చేయిస్తారు. ఇలా రాష్ట్రంలో 650 మందిని మోసం చేసినట్టు గుర్తించారు. - కరక్కాయల పౌడర్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ చేస్తూ రూ.13 కోట్లు మోసం చేసిన వ్యవహారాన్ని ఛేదించారు. రూ.1,000 పెట్టి కిలో కరక్కాయలు కొని పౌడర్ చేసి ఇస్తే 1,300 రూపాయలకు కొనుగోలు చేస్తామని డిపాజిట్ల రూపంలో రూ.20 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. - హెల్త్ బిజ్ ప్రొడక్ట్స్ కంపెనీ పేరుతో మెంబర్షిప్ చేయించి ప్రొడక్టు కొనుగోలు చేసి, మరో ఇద్దరితో డిపాజిట్ చేయిస్తే పెట్టిన డబ్బులు రెట్టింపు ఇస్తామంటూ రూ.30 కోట్ల మేర కొల్లగొట్టారు. - సన్ పవర్ కంపెనీ పేరుతో రూ.200 కోట్ల మేర మోసం చేశారు. సభ్యులుగా చేరి, మరో ఇద్దరిని చేర్పిస్తే ప్రతి ఏడాదికి పెట్టిన డబ్బులతోపాటు వడ్డీ రెట్టింపు ఇస్తామంటూ మోసం చేశారు. స్టాక్ మార్కెట్లో సులభంగా డబ్బులు సంపాదించాలంటే తమ కంపెనీలో సభ్యులుగా నమోదవ్వాలంటూ డిపాజిట్ల పేరుతో బురిడీ కొట్టించారు. ఇలా 2 వేలమంది నుంచి రూ.2 వేల కోట్ల మేర వసూలు చేశారు. - క్యూనెట్ కంపెనీ పేరుతో వేల కోట్లు కొల్లగొట్టిన వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. గతంలో ఇదే కంపెనీ నిర్వాహకులు గోల్డ్‌క్వెస్ట్ పేరుతో రాష్ట్రంలో మల్టీలెవల్ మార్కెటింగ్ నిర్వహించి రూ.800 కోట్లకుపైగా అమాయకులకు ఎగనామం పెట్టారు. - ఇప్పుడిదే నిర్వాహకులు పేరు మార్చి క్యూ–నెట్ పేరుతో దందా ప్రారంభించారు. సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ప్రొడక్ట్ కొనుగోలు చేసి సభ్యత్వం పేరుతో వసూలు చేసినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపు తామని పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వద్దా? మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ప్రచారం చేసినా, టీవీల్లో ప్రకటనలిచ్చినా, సంక్షిప్త సందేశాలతో ప్రలోభపెట్టినా దర్యాప్తు విభాగాలు నేరుగా సుమోటోగా కేసు నమోదు చేయవచ్చు. కానీ, బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పా ఇలాంటి మోసపూరిత కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యవహారాలను గుర్తించడం, కట్టడి చేయడంతోపాటు రూ.వేల కోట్లు కొల్లగొట్టకుండా అడ్డుకునేందుకు రాష్ట్రంలో ‘ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్’ఏర్పాటు తప్పనిసరి అని సీనియర్ ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడ్డారు. మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు రాష్ట్ర పోలీసులు లేఖలు రాసినా ఇంతవరకు దృష్టి సారించలేదని, ఇప్పటికైనా దృష్టి పెట్టాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
భక్తి ముసుగులో ఘరానా మోసం
నాగోలు: భక్తి ముసుగులో మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 4 కార్లు, 3 బైక్‌లు, 5 పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు... నెల్లూరుకు చెందిన ఎగరపతి కుమార్ గిరీష్‌సింగ్ వృత్తి రీత్యా లైఫ్ కోచ్ వ్యాపారం చేసేవాడు. నగరానికి వలస వచ్చిన ఇతను మదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో తమ్ముడు దిలీప్‌సింగ్‌తో కలిసి ఉంటున్నాడు. పలు చానెళ్లలో భక్తి ఉపన్యాసాలు ఇచ్చే అతను ‘అద్వైత స్పిరిటల్ రీచార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ అద్వైత క్రియ’, డ్రీమ్ బ్రిడ్జ్ పేరుతో సోషల్ బిజినెస్ నెట్వర్క్ ప్రారంభించాడు. వివిధ చానెళ్లలో కుబేర ప్రక్రియ, అమృత ప్రక్రియ, ధనవంత ప్రక్రియ పేరుతో ప్రచారం చేస్తూ స్వామీజీగా అవతారమెత్తాడు. పూజలు, ప్రార్థనలు చేస్తామని చెప్పి పలువురితో పరిచయం పెంచుకున్న అతను. తన వద్ద పెట్టుబడి పెడితే డబుల్ చేస్తానని నమ్మించేవాడు. డ్రీమ్ బ్రిడ్జ్ నాగోల్‌కు చెందిన స్వప్న ఇదే విధంగా నమ్మించి రూ.21.78 లక్షలు తీసుకున్నారు. మరికొందరిని చేర్పిస్తే పెట్టుబడి 10 రెట్లు అవుతుందని చెప్పారు. ఇదే తరహాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలువురిని నమ్మించి రూ.50 నుంచి 60 కోట్లు వసూలు చేశారు. వసూలు చేసిన మొత్తాన్ని తన సోదరుడు దిలీప్‌తో కలసి 16 బ్యాంక్‌లలో డిపాజిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితుడు గిరీష్సింగ్ను అరెస్ట్ చేసి అతడి నుంచి కార్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని జాయింట్ సీపీ తెలిపారు. సమావేశంలో సైబర్‌క్రైమ్ డీసీపీ నాగారాజు, ఏసీపీ హరినాథ్, సీఐ నరేందర్‌గౌడ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఎ.వి.రంగ తదితరులు పాల్గొన్నారు. మంది సొమ్ముతో జల్సాలు... స్పిరిటల్ రీచార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ పేరుతో మోసాలకు పాల్పడిన గిరిష్సింగ్ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. సాఫ్ట్వేర్, వెబ్ఆప్స్ కంపెనీలను ఏర్పాటు చేశాడు. వివిధ పేర్లతో 250 కార్యాలయాలను ప్రారంభించాడు. రూ. 3 కోట్ల వెచ్చించి రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. విదేశీ పర్యటనల పేరుతో 20 దేశాలు చుట్టి వచ్చాడు. జీతాలు ఇవ్వకుండా వేధింపులు గిరీష్‌సింగ్ ప్రారంభించిన 250 కంపెనీల్లో ప్రస్తుతం 50 కంపెనీలు నడుస్తున్నాయని ఇందులో పనిచేసే దాదాపు 350 మందికి కొంతకాలంగా జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. -
రాధేశ్యామ్ @ రూ.3 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎఫ్ఎంఎల్సీ) పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం)కు పాల్పడిన రాధేశ్యామ్ చేసిన స్కామ్ రూ.3 వేల కోట్ల వరకు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీ సీఎండీగా వ్యవహరించిన ఆయన్ను ఈవోడబ్ల్యూ (ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హరియాణాలోని హిసార్‌కు చెందిన రాధేశ్యామ్, భన్సీలాల్, సురేందర్సింగ్, మనోజ్, సద్బీర్ సింగ్ తదితరులు ఎఫ్‌ఎంఎల్‌సీని రూ.1 లక్ష పెట్టుబడితో, అద్దె గదిలో ప్రారంభించారు. రూ.7,500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అందులో రూ.2,500 రిజిస్ట్రేషన్ చార్జీ కింద మినహాయించి, మిగిలిన రూ. 5వేల విలువైన ఆరోగ్య ఉత్పత్తులు అందజేస్తామంటూ స్కీం మొదలు పెట్టారు. స్కీమ్‌లో చేరిన ఒక్కొక్కరు మరో ఇద్దర్ని చేర్పిస్తే రూ.500 చొప్పున కమీషన్ ఇస్తూ వచ్చారు. ఇలా పలు స్కీమ్‌లతో దేశవ్యాప్తంగా 60 లక్షల మంది సభ్యుల్ని ఏర్పాటు చేసుకుని వారి నుంచి ఇప్పటివరకు రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల్లో తెలుగు రా ష్ట్రాలతో పాటు హరియాణా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన వారున్నారు. ఇటీవల శ్యామ్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఒక తుపాకి, 10 తూటాలు, 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్ ఫోన్లు, రూ.60 లక్షల నగదుతోపాటు 3 ఖరీదైన కార్లనూ స్వాధీనం చేసుకున్నారు. -
వేలకు వేలొస్తాయన్నారు.. కోట్లు కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్: ‘మీరు రూ.7,500 చెల్లిస్తే చాలు... రూ.2,500 ఫీజును మినహాయించి రూ.5 వేలకు డ్రెస్సులు లేదంటే ఆరోగ్యకర ఉత్పత్తులిస్తాం. మీరు మరో ఇద్దరు సభ్యులను చేర్పిస్తే రూ.500 బోనస్‌తో పాటు రెండేళ్ల పాటు నెలకు రూ.2,500 అంటే రూ.60,000 సంపాదించుకోవచ్చు’అంటూ దేశవ్యాప్తంగా లక్షల మందికి ఆశచూపి దాదాపు రూ.1,200 కోట్లకు టోకరా వేశాడు హరియాణాకు చెందిన రాధేశ్యామ్. 34 ఏళ్ల ఇతడు ఏడో తరగతి వరకే చదవడం గమనార్హం. రాధేశ్యామ్, అతడికి సహకరించిన సురేందర్ సింగ్‌ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగ పోలీసులు గుర్గావ్లో పట్టుకొని శనివారం నగరానికి తీసుకొచ్చారు. ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆరు బ్యాంక్ ఖాతాల్లోని రూ.200 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆర్థిక నేరాల విభాగం పర్యవేక్షిస్తున్న డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావుతో కలసి కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. హరియాణా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన రాధేశ్యామ్, ఫతేబాద్ తహసీల్‌కు చెందిన సురేందర్ సింగ్, బన్సీలాల్‌కు గుడ్‌వే, రైట్ కనెక్ట్ మార్కెటింగ్ సంస్థల్లో పనిచేసినప్పుడు పరిచయం ఏర్పడింది. అక్కడ నేర్చుకున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ అనుభవంతో స్వతహాగా ముగ్గురూ కలసి 2015లో ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ప్రారంభించారు. హరియాణాలోని హిస్సార్ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించారు. ఉత్తర భారతీయులే లక్ష్యంగా... నెలకు రూ.20 వేల నుంచి రూ.పది లక్షల వరకు సంపాదించవచ్చు.. కేవలం రూ.7,500తో ‘ఫ్యూచర్ మేకర్’గా మారవచ్చని అన్ని పత్రికల్లో క్లాసిఫైడ్స్ ఇచ్చారు. 2015–2017 నవంబర్ వరకు కేవలం వేల సంఖ్యలో ఉన్న కస్టమర్ల సంఖ్య.. గత పది నెలల్లోనే ఏకంగా 20 లక్షల వరకు దాటింది. సెప్టెంబర్ 2న కంపెనీ చీఫ్ రాధేశ్యామ్ జన్మదినం సందర్భంగా ‘మాన్సూన్ బొనాంజా’అంటూ ప్రకటనలు బాగా ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వీరిని అరెస్టు చేసిన శుక్రవారం ఒక్కరోజే.. కంపెనీ పేరు మీదున్న బ్యాంక్ ఖాతాలకు రూ.75 కోట్లు వచ్చి చేరాయి. ట్రస్టు పేరుతోనూ సేవా కార్యక్రమాలు చేసిన వీరు ముఖ్యంగా ఉత్తర భారతీయులపై గురిపెట్టారు. హరియాణా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులకు పార్ట్‌టైమ్ ఆదాయం పేరిట కుచ్చుటోపీ పెట్టారు. గత 6 నెలల నుంచి రాష్ట్రంలో ఊపందుకున్న ఈ వ్యాపారంలో దాదాపు రూ.29 కోట్లు మోసపోయారని సైబరాబాద్ పోలీసుల దృష్టికి వచ్చింది. దీన్ని ఆర్థిక నేరాల విభాగం తీవ్రంగా పరిగణించింది. ప్రత్యేక బృందం గుర్గావ్ వెళ్లి రాధేశ్యామ్, సురేందర్ సింగ్‌ను పట్టుకుంది. మరో నిందితుడు బన్సీలాల్ పరారయ్యాడు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎంత మందిని చేరిస్తే అన్ని డబ్బులు... దుస్తులు, ఆరోగ్యకర ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ గొలుసు వ్యాపారం సాగుతున్నట్లుగా కనిపించినా సభ్యుల చేరికపైనే సంస్థ నిర్వాహకులు ప్రధాన దృష్టి సారించారు. ఒక్కొక్కరూ ఇద్దరిని చేర్పిస్తే, ఆ ఇద్దరు మరో నలుగురు, ఆ నలుగురు మరో ఎనిమిది మందిని... ఇలా గొలుసుకట్టుగా సభ్యులను చేర్పించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఎక్కువ సభ్యులను చేర్పించేలా ప్రోత్సహించేందుకు టైటిల్ కూడా ప్రదానం చేసేవారు. 10 మందిని చేర్పిస్తే స్టార్ టైటిల్ ఇవ్వడంతో పాటు రూ.5వేలు ఇచ్చేవారు. ఇలా సిల్వర్ స్టార్ (30 మంది), పెరల్ స్టార్ (80 మంది), గోల్డ్ స్టార్ (180 మం ది), ఎమరాల్డ్ స్టార్ (430 మంది), ప్లాటినమ్ స్టార్ (1,43 0 మంది), డైమండ్ స్టార్ (4,430 మంది), రాయల్ డైమండ్ స్టార్ (11,930 మంది), క్రోన్ డైమండ్ స్టార్ (26,930 మంది), క్రోన్ అంబాసిడర్ స్టార్ (61,930 మంది) టైటిల్ దక్కించుకున్నవాళ్లకు రూ.8 వేల నుంచి రూ.కోటి వరకు ఇస్తామంటూ భారీ మొత్తంలో సభ్యులను చేర్పించేలా స్కెచ్ వేశారు. ఇలా దాదాపు రూ.1,200 కోట్ల మోసపూరిత వ్యాపార లావాదేవీలు చేశారు. వీరిచ్చే ఆరోగ్యకర ఉత్పత్తులను ల్యాబ్‌కు పంపడంతో అవి నకిలీవని తేలింది. ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్థిక నేరాల విభాగ బృంద సభ్యులు సుధీర్, ఆనంద్‌రెడ్డి, గోపీనాథ్, శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్యామ్, కూకట్పల్లి సీఐ ప్రసన్నకుమార్‌ను సీపీ ప్రశంసించారు. చేరినా.. చేర్పించినా నేరమే ‘సులభ పద్ధతిలో ఆదాయం వస్తుందని మల్టీ లెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం)లో పెట్టుబడులు పెట్టినా, పెట్టుబడులు పెట్టించినా అది నేరమవుతుంది. 1978, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించుకోవడం అంటూ పత్రికల్లో వచ్చే క్లాసిఫైడ్స్‌ను నమ్మకండి. మీడియా కూడా ఇటువంటి ప్రకటనల విషయాల్లో ఆయా సంస్థలను అది ఎలా సాధ్యమనే వివరాలు తెలుసుకోవాలి. పోయింది చిన్న మొత్తం కాబట్టి పోలీసు స్టేషన్‌కు పోవాలా అని ఆలోచన చేస్తున్నారు. ఈ చిన్నచిన్నవి మోసగాళ్లకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించొచ్చని ప్రకటన మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వండి’అని సీపీ సజ్జనార్ అన్నారు. -
బిట్‌కాయిన్స్ : గుట్టు రట్టు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి వ్యాపారాల పేరిట ప్రజల్ని నిలువునా దోచుకుని ఆపై వారికి టోపీ పేట్టేయడం ఆ ఘరానా కేటుగాడి నైజం. నాడు గ్లోబల్ ఆగ్రోఫామ్స్ పేరుతో టేకు చెట్ల ప్లాంటేషన్, గోల్డెన్ ఫారెస్ట్ కంపెనీ పేరుతో పెట్టుబడికి రెట్టింపు నగదు, నేడు బిట్‌కాయిన్స్..ఇలా పేర్లు ఏవైనా పథకం మాత్రం మోసగించడమే. వంచననే వృత్తి, ప్రవృత్తిగా మార్చుకుని అమాయకుల్ని తన బుట్టలో వేసుకుంటున్న ఈ మాయగాడి ఆటల్ని నగర టాస్క్‌ఫోర్స్ కట్టిపెట్టింది. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పూర్తి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా దొనకొండకు చెందిన జి.రమేశ్ 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. అప్పట్నుంచీ పలు మోసాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాజాగా ‘బిట్ కాయిన్’ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు (ఎంఎల్ఎం) ప్రజల్ని మోసగించేందుకు పథకం వేశాడు. ఇందుకోసం ముంబైకి చెందిన సీబీ ఆన్లైన్ సంస్థ నిర్వాహకులు మోహన్, సునీల్ చౌహాన్‌కు తన పథకం వివరించి రూ.లక్ష చెల్లించాడు. వీరు కాయినెక్స్‌ట్రేడింగ్.కామ్ పేరుతో ఓ వెబ్సైట్ సృష్టించి ఇచ్చారు. దేశంలో ఎంఎల్ఎం నిర్వహణపై నిషేధం ఉన్నందున అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కేంద్రంగా, అమెరికన్ల నేతృత్వంలో ఈ సంస్థ వ్యాపారం సాగిస్తున్నట్లు చూపించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎస్.సత్తయ్య, ఎన్.వెంకటేష్, కె.హరిగోపాల్, సి.శ్రీనివాస్‌లను దళారులుగా పెట్టుకున్నాడు. నమ్మకం కలిగించేందుకు బోయిన్‌పల్లిలో జీఆర్ఎం ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం తెరిచాడు. వీరితో తమ స్కీముల్లో పెట్టుబడి పెడితే కనిష్టంగా 134 రోజుల నుంచి 500 రోజుల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందని ప్రచారం చేయించాడు. తమ ద్వారా బిట్‌కాయిన్స్‌లో 100 అమెరికన్ డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చని, 4 నుంచి 10 శాతం వరకు బోనస్ కూడా వస్తుందని ఆశ చూపాడు. అలాగే ఓ వ్యక్తి మరికొందరిని చేరిస్తే 60% వరకు కమీషన్‌గా ఇస్తానంటూ ఎంఎల్ఎం దందాకు తెరలేపాడు. రూ.10 కోట్లకుపైగా పెట్టుబడులు రమేశ్ మాయమాటలను నమ్మి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన 1200 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడువు తీరినా తమ నగదు ఊసెత్తక పోవటంతో అనుమానమొచ్చిన బాధితులు ఇతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇతడి తాజా దందా బయటకొచ్చింది. ఈ ముఠా కార్యకలాపాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి రూ.1.8 కోట్ల విలువైన నగదు, స్థలాల పత్రాలు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను సంప్రదించాలని కమిషనర్ అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన సూత్రధారి రమేశ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించాలని పోలీసులు నిర్ణయించారు. సీబీ ఆన్లైన్ సంస్థకు చెందిన సునీల్ చౌహాన్, మోహన్‌ను సైతం పోలీసులు నిందితులుగా చేర్చారు. రూ. 100 కోట్లకు చేరే అవకాశం! ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయింది రూ. కోట్లలో ఉంది. దీంతో రమేశ్ చేతిలో మోసపోయిన వారంతా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే మొత్తం రూ. 100 కోట్లకు చేరే అవకాశమున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదీ రమేశ్ నేరాల చిట్టా 1999లో గ్లోబల్ ఆగ్రో ఫామ్స్ ముసుగులో టేకుచెట్ల ప్లాంటేషన్ పేరుతో రూ.5 కోట్లను ప్రజలనుంచి రమేశ్ వసూలు చేసి మోసగించాడు. 2013లో గోల్డెన్ ఫారెస్ట్ కంపెనీ పేరుతో తన వద్ద రూ.5 వేలు పెట్టుబడి పెడితే ఎనిమిదేళ్ల తర్వాత రూ.50 వేలు ఇస్తానంటూ వసూలు చేసి మోసం చేశాడు. అదే ఏడాదిలో కొందరితో దురుసుగా ప్రవర్తించి పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మూడు కేసుల్లోనూ రమేశ్ అరెస్టయినా, ఇతగాడి బుద్ధి మాత్రం మారలేదు. -
వీడు మామూలోడు కాదు!..
► సర్వర్ మైనింగ్ పేరిట రూ.కోట్లలో కుచ్చుటోపీ ► సొంత కరెన్సీ, కాయిన్స్ పేరుతో బురిడీ ► పోలీసు కస్టడీలో నిందితుడు సాక్షి, సిటీబ్యూరో: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఎంతో మంది అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకున్న ఘరానా ఆన్లైన్ మోసగాడు... బెంగళూరుకు చెందిన బీఎం జగదీశా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై నిందితుడిని బెంగళూరు నుంచి నగరానికి తీసుకువచ్చారు. మియాపూర్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీలోకి తీసుకొని నిందితుడి మోసాలపై ఆరా తీస్తున్నారు. జర్మనీ కేంద్రంగా పని చేస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్.ఈయూ, ఇంగ్లండ్ చిరునామాతో 3జీ మైనింగ్ టెక్ లిమిటెడ్‌ల మార్కెటింగ్‌కు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్.గోల్డ్ పేరుతో మరో వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. తన గర్ల్ ఫ్రెండ్ భర్త, తమిళనాడుకు చెందిన కె.నాగరాజన్ పేరుతో ఈ వెబ్సైట్లను ప్రారంభించాడు. మరో ట్విస్ట్ ఏంటంటే కె.నాగరాజన్ గత ఏడాది జనవరిలో చనిపోయాడు. దీంతో అతడి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డు నంబర్లను వినియోగించి సర్వర్ మైనింగ్‌కు తెరలేపాడు. దీని ద్వారా వచ్చే డేటాను గిగా బైట్స్‌గా మార్చి ఇస్తే మీకు ఒక గ్రాము క్రిష్ణో కరెన్సీ వస్తుందని... దీని విలువ నాలుగు యూరోలని వెబ్సైట్లో ప్రకటన ఇచ్చాడు. కుషాయిగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నెలవారీ రిటర్న్స్ ఆ కంపెనీ ఇవ్వకపోవడంతో వెబ్‌సైట్‌లోని చిరునామా ఆధారంగా బెంగళూరు కార్యాలయాన్ని సంప్రదించాడు. ఎంతకీ సమాధానం రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరు వెళ్లి జగదీశాను అరెస్టు చేశారు. మోసం చేసేదిలా... ‘మా సంస్థ నిర్వహిస్తున్న సర్వర్ మైనింగ్ డేటా ప్రాజెక్టులను తీసుకుంటే... రెండేళ్లలో మీ పెట్టుబడికి 180 శాతం అధిక ఆదాయం వస్తుంద’ని నమ్మిస్తాడు. దీని కోసం కంపెనీ ఇచ్చే సర్వర్ మైనింగ్ డేటాను అల్గారిథమ్ ప్రక్రియలో క్రిష్ణోగ్రఫీ, బార్‌కోడ్‌లను కిలోబైట్స్, మెగాబైట్స్, గిగా బైట్స్లుగా మార్చి డేటాను రూపొందించాలి. ఒక గిగాబైట్ డేటాను తయారు చేస్తే ఒక గ్రాము క్రిష్ణో కరెన్సీని ఇస్తామని చెబుతాడు. దీని విలువ నాలుగు మూరోలకు సమానమని చెబుతాడు. దీని కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.3జీకాయిన్.గోల్డ్‌లో 3జీ కాయిన్ ఖాతా తెరవాలంటే తొమ్మిది స్టెప్పుల్లో వివరాలు నింపాలి. బ్యాంక్ ఖాతా, పాన్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు పూర్తి చేయాలి. వెబ్సైట్లో ఇవన్నీ తనిఖీ చేసిన తర్వాత దరఖాస్తుదారుడి అడ్మినిస్ట్రేటర్ ఈ–మెయిల్‌కి ఓ ఐడీ నంబర్ పంపించేవాడు. రిజిస్ట్రేషన్ చార్జీల కింద 30 యూరోలకు సమానమైన భారత కరెన్సీని 3జీ కాయిన్ఐఎన్సీ పేరిట రూ.2,250 డిపాజిట్ చేయమనే వాడు. ఇలా ఒక్కో క్రిష్ణో కాయిన్‌పై 30 యూరోలను డిపాజిట్ చేసి సర్వర్ మైనింగ్ పొందితే రెండేళ్లలో 128 క్రిష్టో కాయిన్స్ పొందవచ్చని చెప్పేవాడు. -
గొలుసుకట్టుకు ‘తాళం’
ఏపీఎంఎల్ఎం ప్రొహిబిషన్ యాక్టు- 2013 సిద్ధం రాష్ట్ర ప్రభుత్వానికి డ్రాఫ్టు బిల్లు అందజేసిన సీఐడీ సాక్షి, హైదరాబాద్: మల్టీ లెవెల్ మార్కెటింగ్ (గొలుసుకట్టు మార్కెటింగ్) ద్వారా డిపాజిట్ దారులను నిలువునా ముంచుతున్న సంస్థలపై నేర పరిశోధన విభాగం(సీఐడీ) ఉక్కుపాదం మోపనుంది. దీని కోసం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఏపీ మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రొహిబిషన్ యాక్టు-2013ను సీఐడీ రూపొందించి ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల అందించింది. ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లును అసెంబ్లీ ఆమోదానికి పంపనుంది. లేదా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టం అమల్లోకి తీసుకురానుంది. ఎంఎల్ఎం ద్వారా మోసాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలతోపాటు, ఆస్తులను జప్తు చేసే విధంగా కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. పలు రకాల వ్యాపారాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఎంఎల్ఎంలు రాష్ట్రంలో ప్రతి ఏటా రూ.15 వేల కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్లు సీఐడీ అధ్యయనంలో తేలింది. ఆన్లైన్ సర్వే పేరుతో సింగపూర్‌కు చెందిన స్పీక్ ఏసియా సంస్థ దేశవ్యాప్తంగా 19 లక్షల మంది వద్ద 2,200 కోట్లు వసూలు చేసిన వ్యవహారంపై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. నెల్లూరు, ఒంగోలు, వరంగల్ జిల్లాలలో హిమ్ సంస్థ మోసాలకు పాల్పడింది. గోల్డ్‌క్వెస్ట్ తొమ్మి ది రాష్ట్రాలలో 5.5 లక్షల మంది వద్ద 1,650 కోట్ల వరకూ వసూలు చేసింది. కాగా, కేఎంజీ ల్యాండ్ డెవలపర్స్, అక్షయ గోల్డ్, పెరల్స్ వంటి పలు సంస్థలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కంపెనీలపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ (బ్యానింగ్) యాక్టు 1978 ప్రకారం కేసులు నమోదు చేశారు. తమ సంస్థ కార్యకలాపాలు ఆ చట్టపరిధిలోకి రావంటూ ఆ సంస్థ లు కోర్టును ఆశ్రయించడంతో దర్యాప్తు సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని సీఐడీ రూపొందించింది. ప్రతి జిల్లాలో సెంట్ర ల్ క్రైం స్టేషన్లను నోడల్ ఏజెన్సీగా ఎంఎల్ఎంలపై ప్రత్యేక దాడులకు సీఐడీ సన్నాహాలు చేస్తోంది. కాగా, ఎంఎల్ఎం విధానంలో సభ్యులను చేర్చుకుని ఉత్పత్తులను విక్రయిస్తున్న ఆమ్వే సంస్థపై సీఐడీ రెండు రోజు ల క్రితం మరో కేసు నమోదు చేసింది. 2006 నుంచే ఈ సంస్థ కార్యకలాపాలకు సంబంధించి సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. ఆ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన ప్రచురణలు, ప్రకటనలు విడుదల చేయకూడదని రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆ కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగానే రాష్ర్టంలో మళ్లీ ప్రకటనలు విడుదల చేయడాన్ని సీఐడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆ సంస్థకు సంబంధించిన ప్రకటనలు, ప్రచురణలను సీజ్ చేయాలని ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.