తల్లి ఒడికి చేరిన తనయుడు | Mumbai Boy Found In jagtial | Sakshi
Sakshi News home page

తల్లి ఒడికి చేరిన తనయుడు

Published Thu, Apr 12 2018 12:39 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Mumbai Boy Found In jagtial - Sakshi

పోలీస్‌స్టేషన్‌ వద్ద తల్లిబిడ్డలు

మల్లాపూర్‌(కోరుట్ల): ముంబైలో నాలుగురోజుల క్రితం తప్పిపోయిన నెలరోజుల బాలుడు బుధవారం తల్లిఒడికి చేరాడు. కొడుకును చూడడంతో ఆ తల్లి కళ్లలో ఆనందానికి అవదులు లేవు. ఈ సంఘటన మల్లాపూర్‌ పోలీస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఎస్సై సతీశ్‌ కథనం ప్రకారం.. ముంబైకి చెం దిన అమిత్‌సింగ్‌– భాగ్యశ్రీబాయి దంపతులకు నెలరోజుల క్రితం బాబు పుట్టాడు. కాగా, ఈనెల 7న అమిత్‌సింగ్, బాబు కనిపించకుం డా పోయారు. ఈమేరకు భాగ్యశ్రీబాయి ముంబైలోని టీటీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అమిత్‌సింగ్‌ కాల్‌డేటా పరిశీలించారు. ఎక్కువసార్లు జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేటకు చెందిన చిట్యాల రాజ్‌పాల్‌– లావణ్య దంపతులతో మాట్లాడినట్లు గుర్తించారు. మల్లాపూర్‌ పోలసుల సహకారంతో బాబును రాజ్‌పాల్‌– లావణ్య దంపతుల ఇంట్లో పట్టుకున్నారు. బుధవారం  తల్లికి అప్పగించారు. కేసు విచారణకు సహకరించిన మల్లాపూర్‌ ఎస్సై సతీశ్‌కు టీటీనగర్‌ ఎస్సై మిథిన్‌పాటిల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement