
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: రెండక్షరాల ప్రేమకు ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి. ఓ యువకుడు కోపంలో ప్రియురాలిని చంపడమే కాకుండా తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని మలాద్ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ముంబైలో నివసించే మంగేశ్ రానే సోమవారం కురర్‌లోని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ వారిద్దరికీ మాటల మధ్యలో భేదాభిప్రాయాల ఏర్పడ్డాయి. ప్రేమను ఇక్కడితో ఆపేద్దామని తొలుత యువతి చెప్పగా.. ఆ విషయాన్ని మంగేశ్ జీర్ణించుకోలేకపోయాడు. ఇన్నాళ్లూ కలిసుండి ఇప్పుడు వద్దంటుందా అని ఆవేశంతో ఊగిపోయాడు. కోపం నషాళానికి అంటిన మంగేశ్ ప్రియురాలిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు.
అనంతరం అతను కూడా చావటానికి ప్రయత్నించాడు. చేతిపై కత్తితో కోసుకోవటమే కాక పదో అంతస్థులోని బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడవగా కత్తిపోట్లతో తీవ్రగాయాలపాలైన యువతి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment