
సాక్షి, కృష్ణా : దాదాపు 15 ఏళ్లుగా బైక్ దొంగతనాలు చేస్తూ.. వాహన యజమానులకు దడ పుట్టించిన నిందితుడిని నందిగామ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వేమూరి కృష్ణ 2003 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి వద్ద నుంచి 10 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 4 హోండా యునికాన్, 6 హోండా షైన్ బైక్‌లని పోలీసులు తెలిపారు. బైక్‌లను దొంగిలించిన కృష్ణ వాటిని లింగాలపాడు గ్రామానికి చెందిన బండి నరసింహరావు వద్ద అమ్మటానికి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ. 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment