nandigama police
-
నందిగామ ఘటనపై సీపీ కాంతి రాణా స్పందన..
-
చంద్రబాబుపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన లాక్డౌన్ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు కారణమయ్యారని లాయర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసుల నమోదు చేశారు. (చదవండి : ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధం: బొత్స) కాగా, ప్రత్యేక అనుమతితో మే 25న ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్ ర్యాలీలతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఉల్లంఘించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కూడా దాఖలైంది. మరోవైపు విశాఖ వెళ్తానని ఏపీ డీజీపీ అనుమతి కోరిన చంద్రబాబు.. మహానాడు ముగియగానే తిరిగి హైదరాబాద్‌కు వెళ్లడం గమనార్హం. -
సురేష్‌పై దాడి; 14 మందిపై కేసు నమోదు
సాక్షి, నందిగామ: రాజధాని ఉద్యమం పేరుతో బాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జి.వి.రమణమూర్తి తెలిపారు. నందిగామ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎంపీ సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. (నాపై దాడి వెనుక ఆ ఇద్దరి హస్తం ఉంది: సురేష్) దళిత ఎంపీపై ఉద్దేశపూర్వకంగానే దాడి నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు నెహ్రూనగర్ (గుంటూరు): దళిత ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా అన్ని జిల్లాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళన తలపెట్టామన్నారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ అమరావతి విషయంలో టీడీపీ నాయకులు దళిత ఎంపీలను ఒక విధంగా, అగ్రకుల ఎంపీలను ఒక విధంగా చూస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే దళితులంతా ఏకమై బుద్ధి చెబుతామన్నారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. (చదవండి: బాపట్ల ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి) -
బైక్ దొంగ అరెస్ట్.. 10 బైక్‌లు స్వాధీనం
సాక్షి, కృష్ణా : దాదాపు 15 ఏళ్లుగా బైక్ దొంగతనాలు చేస్తూ.. వాహన యజమానులకు దడ పుట్టించిన నిందితుడిని నందిగామ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వేమూరి కృష్ణ 2003 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి వద్ద నుంచి 10 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 4 హోండా యునికాన్, 6 హోండా షైన్ బైక్‌లని పోలీసులు తెలిపారు. బైక్‌లను దొంగిలించిన కృష్ణ వాటిని లింగాలపాడు గ్రామానికి చెందిన బండి నరసింహరావు వద్ద అమ్మటానికి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ. 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
జయరాం హత్య కేసును ఛేదించిన పోలీసులు
-
జయరామ్ హత్య కేసులో కొత్త మలుపు
-
అసలేం జరిగింది?
-
కారులో పారిశ్రామికవేత్త మృతదేహం
-
క్వారీ.. ఘోరీ!
సాక్షి, కంచికచర్ల(నందిగామ) : పాపం.. ఆ చిన్నారులకు తెలీదు, అది మృత్యులోయని.. ఆ తల్లికి ఊహకైనా అంది ఉండదు.. అది ప్రాణాలు మింగే అగాధమని.. బట్టలు ఉతుకుదామని వెళ్లారు.. తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. దొనబండ.. ఈ ఘోరానికి సాక్షిగా నిలిచింది. మాటలకందని విషాదం.. వర్ణింప వీలుకాని వేదన.. ఇష్టారీతిన తవ్వి వదిలేసిన ‘క్వారీ’ గొయ్యి ఇద్దరు చిన్నారులతో పాటు, మరో మహిళను బలితీసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇబ్రహీంపట్నం మూలపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. నీటి కుంటలో సరదాగా ఆడుకుందామని దిగిన చిన్నారులను అదే నీటికుంట మృత్యుకుహరమై మింగేసింది. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ క్వారీలో ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామానికి చెందిన దేవనం పరమేశ్వరి(ఏలేము జ్యోతి)(38)బడ్డీ కొట్టు పెట్టుకుని బతుకీడ్చుతుంది. భర్త సుబ్రహ్మణ్యం రోజు కూలీగా క్వారీలో పనిచేస్తుంటాడు. ఆదివారం పరమేశ్వరీ బట్టలు ఉతికేందుకని క్వారీలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లింది. ఆమెతో పాటు కుమార్తె దేవనం మీనా(5), వరుసకు మనుమరాలు అయిన వల్లెపు దుర్గ(8)లు అక్కడకు వెళ్లారు. పరమేశ్వరి నీటి కుంటలో దిగి బట్టలు ఉతుకుతుండగా ఒడ్డున చిన్నారులు ఆటలు ఆడుకుంటున్నారు. కొంత సమయం అయిన తర్వాత ఉల్లాసంగా ఆడుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా నీటికుంటలోకి దిగారు. ఆ నీటి కుంట లోతు ఎక్కువగా ఉండడంతో ముని గిపోతూ కేకలు పెట్టారు. దీంతో అక్కడే ఉన్న పరమేశ్వరి వారిని కాపాడేందుకు ప్రయత్నించి నీటికుంటలోకి దిగింది. దీంతో చిన్నారులతో పాటు ఆమె కూడా మునిగిపోయి మృత్యువాత పడింది. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు.. దేవనం సుబ్రహ్మణ్యం పరమేశ్వరి దంపతులు రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని కొండలు పిండిచేసి జీవనం చేస్తున్న నిరుపేద కుటుంబాలు. నిత్యం కాయకష్టం చేసుకుని తమ పిల్లలను పోషించుకుంటున్నారు. అప్పటిదాకా కళ్లముందు ఆడుకున్న ఆ చిన్నారులతోపాటు పరమేశ్వరి కూడా నీటికుంటలో పడి మృత్యువాతపడడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. మరో 5నిముషాల్లో బట్టలు ఉతికి చిన్నారులతో సహా ఇంటికి వెళ్లదామనే లోపే ఈ సంఘటన జరగటంతో వారి శోకం వర్ణనాతీతంగా ఉంది. అడ్డదిడ్డంగా క్వారీల తవ్వకాలు.. పరిటాల శివారు దొనబండ క్వారీల్లో కాంట్రాక్టర్లు అడ్డదిడ్డంగా తవ్వకాలు జరపటంతో ఇటువంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. క్వారీ బ్లాస్లింగ్ సమయంలోనూ ప్రమాదాలు జరిగిన ఘట నలు ఉన్నాయి. ఎక్కువ లోతులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నా.. అటు మైనింగ్ అధికారులు గానీ, ఇటు రెవెన్యూ అధికారులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. లోతైన నీటి కుంటల వద్ద ప్రమాద హెచ్చరికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. -
రైతుపై పోలీసుల దాడి?
నందిగామ(షాద్‌నగర్): నడుచుకుంటూ వెళ్తున్న రైతు దారి దోపిడీకి గురయ్యాడు... దళిత రైతును చితకబాది అతని వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. దెబ్బలు తగిలిన రైతు చర్మం పూర్తిగా కమిలిపోయింది. దాడి చేసింది పోలీసులేనని బాధితుడు అంటుంటే... తమకు దాడి చేయాల్సిన అవసరం ఏముందని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన నందిగామ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నర్సప్పగూడ రోడ్డులో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా బుధవారం ఉదయం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నడుచుకుంటూ వెళ్తుండగా.. మండల పరిధిలోని నర్సప్పగూడ గ్రామానికి చెందిన దళిత రైతు కొంగరి రాములు మంగళవారం రాత్రి సుమారు 8గంటల ప్రాంతంలో నందిగామ నుండి నర్సప్పగూడకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు గ్రామ శివారులోని వాగు వద్దకు చేరుకోగానే ఎదురుగా గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రైతు కొంగరి రాములును అడ్డగించి చితకబాదారు. రైతు జేబులో ఉన్న సుమారు రెండు వేల రూపాయలను కూడా వారు దోచుకున్నట్లు బాధితుడు వాపోతున్నాడు. అయితే బాధిత రైతును చితకబాదడంతో అతని చర్మం పూర్తిగా కమిలిపోయింది. దీంతో అతడు తన భార్య రాములమ్మతో కలిసి నందిగామ పోలీస్ స్టేషన్‌కు బుధవారం ఉదయం చేరుకొని గాయాలను ఎస్సై హరిప్రసాద్‌రెడ్డికి చూపిస్తూ ఫిర్యాదు చేశాడు. పోలీసులే దాడి చేశారని ఫిర్యాదు తనపై ఇద్దరు కానిస్టేబుళ్లు దాడి చేశారని, తన వద్ద ఉన్న రెండు వేల రూపాయల నగదును కూడా వారే దొంగిలించారని సదరు బాధితుడి బార్య ఎస్ఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనాడు. బూతుమాటలు తిడుతూ తనౖ భర్తపై దాడి చేసి దౌర్జన్యం చేసిన కానిస్టేబుళ్ళపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ కొసమెరుపు రైతు కొంగర రాములు మంగళవారం షాద్‌నగర్‌కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో నందిగామలో బస్సు దిగి స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ పరిశ్రమ వద్ద వాచ్‌మెన్‌తో చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు రాములును బెదిరించి అక్కడి నుండి పంపించినట్లు సమాచారం. కాగా నర్సప్పగూడ గ్రామంలో జరిగిన విందులో పాల్గొని వస్తున్న ఆ కానిస్టేబుళ్లే గ్రామ శివారులో ఉన్న వాగు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న రాములును చితక్కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఎస్సై ఈ ఘటనకు సంబంధించి బాధితుడి ఆరోపణ మేరకు కానిస్టేబుళ్లపై విచారణ చేపట్టి వాస్తవమని తేలితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. కొంగర రాములును కానిస్టేబుళ్లు కొట్టాల్సిన పనేముందని ఎస్సై అన్నారు. అసలు దాడి చేసిందెవరు..? కొంగర రాములుపై దాడి చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనే దానిపై భిన్నవాదనలు ఉన్నాయి. తనను దాడి చేసింది పోలీసు కానిస్టేబుళ్లేనని బాధిత రైతు చెప్పడమే కాకుండా ఎస్సైకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ఎస్సై కూడా తమ కానిస్టేబుళ్లకు కొట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. దళిత రైతుపై దాడి చేసిన ఘటన మిస్టరీగా మారింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితేనే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. -
శ్రీశైలవాసు హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
నందిగామ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గవరపు శ్రీశైల వాసు హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలవాసు ను చందాపురం గ్రామానికి చెందిన ఉన్నం హనుమంతరావు, హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకుడు పాషా గత నెల 28న హతమార్చిన విషయం తెలిసిందే. నందిగామ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు అయ్యింది. నందిగామతో పాటు ఇతర పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది నాలుగు బృందాలుగా ఆరు రోజుల నుంచి నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్థరాత్రి కిరాయి హంతకుడు పాషాను నందిగామ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అలాగే హనుమంతరావును బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు పాషాకు తుపాకీ అద్దెకిచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని సోమవారం నందిగామ కోర్టులో హాజరు పరచనున్నారు.