
సాక్షి, కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. సీనియర్ల వేధింపులు తాళలేని ఓ మహిళా హౌజ్ కీపింగ్ ఉద్యోగిని శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో హౌజ్ కీపింగ్ విభాగంలో మహిళా ఉద్యోగిని చల్లా రమణ(35) పని చేస్తున్నారు. కొంతకాలంగా తరచూ జూనియర్ ఉద్యోగులను.. సీనియర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. ఏమి చేయాలో దిక్కుతోచని బాధితురాలు రమణ ఆత్యహత్యకు యత్నించింది. పురుగుల మందు తాగిన రమణను వెంటనే చికిత్స నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment