
విజయ్ స్నేహితురాలి టిక్‌టాక్ వీడియో దృశ్యం
ముంబై : స్నేహితురాలి టిక్‌టాక్ పిచ్చి కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ బుక్కయ్యాడు. ఆమె అతడి పోలీస్ డ్రెస్ వేసుకుని వీడియోలు చేయడంతో అధికారులు కానిస్టేబుల్‌పై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ సంఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన విజయ్ బ్రాహ్మణి అక్కడి ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం విజయ్ స్నేహితురాలు ఒకామె అతడి పోలీస్ డ్రెస్‌ను ధరించి టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలు చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు అధికారుల దృష్టిలో సైతం పడ్డాయి. వాటిలో అభ్యంతరకర దృశ్యాలు లేకపోయినా ఆ యువతి పోలీస్ డ్రెస్ వేసుకున్నందుకు గానూ ఎస్పీ శివాజీ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ( పావని అనే యువతిని పావుగా వాడి..)
విజయ్‌పై విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయిన అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటామని డీవైఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. కాగా, టిక్‌టాక్, వాట్సాప్, ట్విటర్‌లలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన నాలుగురోజులకే అజయ్ పోలీస్ డ్రెస్ ఘటన జరగటం గమనార్హం.
(బంగారు శ్రుతి కేసు!.. ఇలా ‘తెగించేశారు’.!)
Comments
Please login to add a commentAdd a comment