
సాక్షి, విజయవాడ: బస్టాండు సమీపంలో యువతిని వేధిస్తున్న ఆరుగురు ఆకతాయిలను కృష్ణ లంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ బస్టాండు ప్రాంగణంలో బస్సు కోసం వేచిచూస్తున్న యువతిని ఆరుగురు యువకులు వేధిస్తుండగా బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వేధింపులకు గురిచేస్తున్న ఆరుగురితోపాటు, స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment