
లోకేశ్వరి (ఫైల్)
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడిన లోకేశ్వరి కేసులో పంజగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లోకేశ్వరిని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసిన ప్రవీణ్ కుమార్ కోసం గాలింపు చేపట్టారు. అతని ఫోన్ స్విచ్‌ఆఫ్‌లో ఉందని, లాస్ట్ కాల్ సిగ్నల్ ప్రకారం అతను బెంగళూరులో ఉన్నట్లు నిర్ధారించారు. ప్రవీణ్ కోసం అతడి బంధువుల ఇళ్లల్లో గాలించినా ప్రయోజనం కనిపించలేదు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం వారిని కూడా అదుపులోకి తీసుకోనున్నారు. కాగా లోకేశ్వరి మృతదేహాన్ని ఈ నెల 2న ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడంతో కాచిగూడలోని విద్యుత్ దహనవాటికలో దహనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment