
సాక్షి, వైఎస్సార్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణి మృత్యువాత పడింది. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లాలోని గాలివీడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చంద్రకళ అనే గర్భిణిని బంధువులు నూలివీడు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఏవరూ లేకపోవటంతో కాంపౌండర్ ఇచ్చిన ఫ్లూయిడ్‌తో చంద్రకళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మరో బిడ్డను ప్రసవించాల్సి ఉండగా సరైన వైద్యసేవలు అందక చంద్రకళ మృతిచెందింది. దీంతో వైద్యాధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గర్భిణి కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment